HomeతెలంగాణKCR Ghati Vijay Kumar : మాజీ సీఎం కేసీఆర్ ఒకప్పటి సీపీఆర్వో.. కొత్తగా తవ్వుతున్నాడు..

KCR Ghati Vijay Kumar : మాజీ సీఎం కేసీఆర్ ఒకప్పటి సీపీఆర్వో.. కొత్తగా తవ్వుతున్నాడు..

KCR Ghati Vijay Kumar : కెసిఆర్ గురించి కొత్తగా చెప్పేది ఏముంది.. నచ్చితే నెత్తిన పెట్టుకుంటాడు. నచ్చకపోతే బండకేసి కొడుతుంటాడు. ఆలే నరేంద్ర.. విజయశాంతి.. రాములు నాయక్.. ఈటెల రాజేందర్.. కల్వకుంట్ల కవిత.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దది. కెసిఆర్ కు క్లోజ్ గా వెళ్లాలంటే అయ్యే పని కాదు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు.. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఇప్పుడు ఫామ్హౌస్ కే పరిమితమైనప్పుడు.. కొంతమందికి మాత్రమే యాక్సిస్ ఉంది. అంతటి కవితకు […]

KCR Ghati Vijay Kumar : కెసిఆర్ గురించి కొత్తగా చెప్పేది ఏముంది.. నచ్చితే నెత్తిన పెట్టుకుంటాడు. నచ్చకపోతే బండకేసి కొడుతుంటాడు. ఆలే నరేంద్ర.. విజయశాంతి.. రాములు నాయక్.. ఈటెల రాజేందర్.. కల్వకుంట్ల కవిత.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దది.

కెసిఆర్ కు క్లోజ్ గా వెళ్లాలంటే అయ్యే పని కాదు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు.. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఇప్పుడు ఫామ్హౌస్ కే పరిమితమైనప్పుడు.. కొంతమందికి మాత్రమే యాక్సిస్ ఉంది. అంతటి కవితకు కూడా కేసీఆర్ ను కలిసే అవకాశం లేదంటే ఆయన చుట్టూ ఎలాంటి బౌండరీస్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే అంతటి కెసిఆర్ దగ్గరికి వెళ్లగలిగి.. కెసిఆర్ పక్కనే ఉండగలిగి.. కెసిఆర్ కు సలహాలు ఇచ్చే స్థాయికి ఎదిగిన ఒక జర్నలిస్టు ఉన్నాడు. ఆయన పేరు ఘటిక విజయ్ కుమార్. ఉమ్మడి వరంగల్ జిల్లా నెక్కొండ మండల వాసి. మంచి చదువరి. రాజకీయ నేపథ్యం ఉంది. పైగా కేసీఆర్ మనసు గెలిచిన స్థాయి ఉంది. అందువల్లే కాబోలు అప్పట్లో నెక్స్ట్ టు సీఎం అన్నట్టుగా విజయ్ కుమార్ ఉండేవారు.

ఏం జరిగిందో తెలియదు.. ఏమైందో తెలియదు కేసీఆర్ బయటికి పంపించారు. విజయ్ అలానే బయటకు వచ్చారు. ఏం జరిగిందో కెసిఆర్ చెప్పలేడు. విజయ్ వివరించలేడు.. విజయ్ అంతకుముందు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో పనిచేసినట్టు గుర్తు. ఆ తర్వాత టీ న్యూస్ లో పనిచేశాడు. ఉద్యమకాలంలో భిన్నమైన కథనాలను టీ న్యూస్ కు ఇచ్చాడు. ఆ తర్వాత కెసిఆర్ క్యాంపులో అత్యంత కీలకమైన వ్యక్తిగా మారిపోయాడు. హరీష్ రావు.. కేటీఆర్.. సంతోష్ రావు లాంటి వాళ్లకు లభించని ప్రయారిటీ విజయ్ కి దక్కేది. ఒక దశలో సంతోష్ కంటే కూడా విజయ్ కి కేసిఆర్ ప్రాధాన్యం ఇచ్చేవారు. విజయ్ బయటికి వచ్చిన తర్వాత సంతోష్ కేసీఆర్ కు అన్నీ తానయ్యారు.

కెసిఆర్ క్యాంపు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొద్ది రోజుల వరకు విజయ్ బయటకు కనిపించలేదు. ఆ తర్వాత ఎలాగూ తనకు తెలిసిన జర్నలిజం లోకి వచ్చేసారు. ఐ న్యూస్ అనే ఛానల్ లో పెద్ద పోస్ట్ సంపాదించారు. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం అందులో ఆయన కొంత మేర పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఒక పాడ్ కాస్ట్ రూపంలో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి విజయ్ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. తొలి ఇంటర్వ్యూ నే కెసిఆర్ కు అత్యంత దగ్గరైన వ్యక్తితో చేశారు విజయ్. ఆయన మరెవరో కాదు తెలంగాణ సాగునీటి పార్ధుల రంగంలో అనుభవం ఉన్న వీరమల్ల ప్రకాష్. కెసిఆర్ గురించి లోతుగా తెలిసిన అత్యంత కొద్దిమంది వ్యక్తుల్లో ప్రకాష్ ఒకరు. ప్రకాష్ ను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేశారు విజయ్ కుమార్. కెసిఆర్ లోపాలను.. కెసిఆర్ ఇప్పుడు చేస్తున్న తప్పులను.. అవన్నీ కూడా ప్రకాష్ ద్వారా చెప్పించగలరు విజయ్. తద్వారా తనకు ఎదురైన అవమానాన్ని కొంతలో కొంత తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి ఇంటర్వ్యూలో కేసీఆర్ లోపాల గురించి మాత్రమే అడిగినట్లు కనిపించింది. ఎంతైనా విజయ్ కుమార్ కూడా కేసీఆర్ బాధితుడే కాబట్టి ఆ మాత్రం కోపం ఉంటుంది..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper