Kiran Abbavaram: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కిరణ్ అబ్బవరం , అతి తక్కువ సమయం లోనే ఇండస్ట్రీ లో హీరో గా స్థిరపడి , తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని , బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రం ఎంత పెద్ద కమర్షియల్ సక్సెస్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే. కేవలం మూడు రుజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని పొంది , క్లీన్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా , ఇప్పటి వరకు 50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పటికీ థియేటర్స్ లో విజయవంతంగా రన్ అవుతున్న ఈ సినిమా, రాబోయే రోజుల్లో ఇంకా ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి.
ఈ సినిమాకు ముందు కిరణ్ అబ్బవరం చేసిన ‘క’, ‘k ర్యాంప్’ చిత్రాలు కూడా కమర్షియల్ గా సక్సెస్ అయ్యాయి. ఇలా కెరీర్ జెట్ స్పీడ్ లో వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతున్న సందర్భంగా , తన కెరీర్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లే విధంగానే అడుగులు వేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. అందులో భాగంగా ఆయన మరో క్రేజీ ప్రాజెక్ట్ ని లాక్ చేసాడు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ‘కాంతారా’ ఫ్రాంచైజ్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన శ్రీనివాస పుప్పాల తో ఒక సినిమా చేయడానికి కిరణ్ అబ్బవరం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ‘ఇంద్రప్రస్థ’ అనే టైటిల్ ని లాక్ చేసినట్టు సమాచారం. టైటిల్ చాలా పవర్ ఫుల్ గా ఉంది కదూ. కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే ఒక డిఫరెంట్ జానర్ చిత్రమిది.
ఈ నెలలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రం తెరకెక్కబోతుంది సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. కిరణ్ అబ్బవరం స్పీడ్ చూస్తుంటే , భవిష్యత్తులో ఈయన మరో నాని అవుతాడని అనిపిస్తోంది. మినిమం గ్యారంటీ సినిమాలు సెట్ చేసుకోవడమే కాదు , వాటిని కమర్షియల్ సక్సెస్ చేసేందుకు కిరణ్ అబ్బవరం అనుసరించే ఫార్ములా ఆయన తర్వాత వచ్చే యంగ్ హీరోలు కూడా అనుసరిస్తే , కమర్షియల్ గా సక్సెస్ సాధించొచ్చు అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే కిరణ్ అబ్బవరం ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు.