Allu Arjun
Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఇప్పుడు మారుమోగుతోంది. 69 ఏళ్ల సినీ జాతీయ అవార్డుల్లో మొదటిసారిగా తెలుగు నటుడుగా బన్నీ గెలుచుకొని రికార్డు సృష్టించాడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆయనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. కొందరు ఐకాన్ స్టార్ ను నేరుగా కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తుండగా..మరికొందరు సోషల్ మీడియా ద్వారా విషెస్ చెబుతున్నారు.లేటెస్టుగా చేతులు లేని ఓ అమ్మాయి అల్లు అర్జున్ కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. అదేంటో తెలుసా?
సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలోని నటనకు అల్లు అర్జున్ ను జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపిక చేసింది. ఇందులో గంధపు చెక్కల స్మగ్లర్ గా బన్నీ యాక్టింగ్ కు అంతా ఫిదా అయిపోయారు. మొదట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే హిట్టు సాధించగా.. ఆ తరువాత పాన్ ఇండియా లెవల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదే మూవీలోని మ్యూజిక్ బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మికా మందన నటించిన విషయం తెలిసిందే.
ఈ తరుణంలో బన్నీకి ప్రపంచంలో ఉన్న తెలుగు వారు సామాజిక మాధ్యమాల ద్వారా విషెస్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ దివ్యాంగురాలు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపింది. తనకు చేతులు లేకున్నా.. నోటితో బన్నీ బొమ్మ గీసి ఆకట్టుకుంది. శ్రీకాకుళంకు చెందిన కొవ్వాడ స్వప్నికా రోడ్డు ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయింది. దీంతో ఆమె కుంగిపోకుండా తన కళను కొనసాగించింది. అప్పటి నుంచి ఆమె నోటితో బొమ్మలు గీయడం నేర్చుకుంది.
పుష్ప సినిమాకు అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన నేపథయంలో బన్నీ బొమ్మను స్వప్పికా నోటితో వేసింది. ఈ బొమ్మ సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారుతోంది. స్వప్పికా బేసిగ్గా మెగాహీరోలంటే అభిమానం. గతంలో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ బొమ్మలు గీయడంతో వారు ఆమెను స్వయంగా కలిసి అభినందించారు. ఇప్పుడు అల్లు అర్జున్ బొమ్మ గీయడంతో ఆమెను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. ఆమె కళనైపుణ్యం ఎంతో అద్భుతం అని కొనియాడుతున్నారు.