Homeజాతీయ వార్తలుCongress First List: కాంగ్రెస్ తొలి జాబితా రెడీ.. అందులోని నేతలు వీరే

Congress First List: కాంగ్రెస్ తొలి జాబితా రెడీ.. అందులోని నేతలు వీరే

Congress First List: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి కసరత్తును తీవ్రతరం చేసింది. మంగళవారం గాంధీభవన్ లో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే, రాష్ట్ర పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ గత సంప్రదాయానికి భిన్నంగా ఈసారి ఎవరెవరైతే పోటీ చేయదలచుకున్నారో.. వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించడం మొదలుపెట్టింది.. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న తెలంగాణలో భారీగా దరఖాస్తులు వచ్చాయని సమాచారం.

భారత రాష్ట్ర సమితి ప్రకటించిన నేపథ్యంలో..

భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. అయితే అధికార పార్టీకి మించి అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవడంతో ఒకింత ఒత్తిడి కాంగ్రెస్ పార్టీలో ఉంది. చాలా స్థానాల్లో అభ్యర్థులు పోటీ పడుతున్న నేపథ్యంలో ఎవరికి టికెట్ ఇవ్వాలో తెలియక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినాయకత్వం నల్లగుల్లాలు పడుతోంది. అయితే ఈసారి ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఎన్నికల కమిటీతో చర్చించింది. అయితే దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో ఒక అంగీకారం కుదరకపోవడంతో మరొకసారి భేటీ కావాలని నిర్ణయించింది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దాదాపు 40 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అయితే వీరిలో చాలావరకు పాత ముఖాలే ఉన్నాయి. భారత రాష్ట్ర సమితి నుంచి వచ్చిన కొంతమంది నేతలకు కూడా టికెట్లు తగ్గడం విశేషం.

జిల్లాల వారీగా..

నల్లగొండ_కోమటి రెడ్డి వెంకటరెడ్డి, హుజూర్ నగర్_ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ_ పద్మావతి, ఆలేరు_ బీర్ల ఐలయ్య.

హైదరాబాద్

నాంపల్లి_ ఫిరోజ్ ఖాన్, జూబ్లీహిల్స్_ విష్ణువర్ధన్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా

వికారాబాద్_ గడ్డం ప్రసాద్ కుమార్, ఇబ్రహీంపట్నం_ మల్ రెడ్డి రంగారెడ్డి, పరిగి_ రామ్మోహన్ రెడ్డి.

వరంగల్ జిల్లా

నర్సంపేట_దొంతి మాధవరెడ్డి, వరంగల్ తూర్పు _ కొండా సురేఖ, ములుగు_ సీతక్క, భూపాలపల్లి_ గండ్ర సత్యనారాయణ.

మహబూబ్ నగర్ జిల్లా

కొల్లాపూర్_ జూపల్లి కృష్ణారావు, కల్వకుర్తి_ వంశీ చంద్ రెడ్డి, అచ్చంపేట_ వంశీకృష్ణ, షాద్ నగర్_ ఈర్లపల్లి శంకర్, కొడంగల్_ రేవంత్ రెడ్డి, అలంపూర్_ సంపత్ కుమార్.

మెదక్ జిల్లా

సంగారెడ్డి_ జగ్గారెడ్డి, ఆందోల్_ దామోదర రాజనర్సింహ, జహీరాబాద్_ చంద్రశేఖర్, నర్సాపూర్_ గాలి అనిల్ కుమార్.

ఆదిలాబాద్

నిర్మల్_ శ్రీహరి రావు, మంచిర్యాల_ ప్రేమ్ సాగర్ రావు.

నిజామాబాద్

జుక్కల్_ గంగారాం, కామా రెడ్డి_ షబ్బీర్ అలీ.

ఖమ్మం జిల్లా

మధిర_ మల్లు భట్టి విక్రమార్క, భద్రాచలం_ పొదెం వీరయ్య, కొత్తగూడెం_ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

కరీంనగర్ జిల్లా

మంథని_ శ్రీధర్ బాబు, వేములవాడ_ ఆది శ్రీనివాస్, జగిత్యాల_ జీవన్ రెడ్డి, హుజురాబాద్_ బల్మూరి వెంకట్, చొప్పదండి_ మేడిపల్లి సత్యం, మానకొండూరు_ కవ్వంపల్లి సత్యనారాయణ, రామగుండం_ రాజ్ ఠాకూర్, పెద్దపల్లి_ విజయ రమణారావు, ధర్మపురి_ లక్ష్మణ్, కోరుట్ల_ జువ్వాడి నర్సింగరావు. వీరందరికీ టిక్కెట్లు ఖరారు అయ్యాయని ప్రాథమికంగా సమాచారం అందుతోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular