Allu Arjun: హీరో అల్లు అర్జున్ (సతీమణి స్నేహ రెడ్డి తండ్రి) మామ.. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మీద కేసు నమోదు అయింది. గతంలో గులాబీ పార్టీలో ఉండేవారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతగా కొనసాగుతున్నారు. ఈయన మీద గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది.. హైదరాబాద్ నగరంలోని నానగరం గూడా లోని మంత్రి కాస్మోస్ అనే భవనానికి సంబంధించిన వ్యవహారంలో చంద్రశేఖర్ రెడ్డి మీద పోలీసులకు ఫిర్యాదు అందింది.
ఏం జరిగిందంటే
నానక్ రామ్ గూడ ప్రాంతంలో మంత్రి కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ ఉంది. దీనికి మేనేజర్ గా రావి పెద్దిరాజు కొనసాగుతున్నారు. ఈనెల 13న మురళీధర్ రెడ్డి.. గడ్డం రవి అనే ఇద్దరు వ్యక్తులు మంత్రి కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ లోకి అక్రమంగా ప్రవేశించారు. ఈ సందర్భంగా పెద్దిరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎందుకు ప్రవేశించారంటే..
మంత్రి కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ సముదాయంలోకి మురళీధర్ రెడ్డి.. గడ్డం రవి అక్రమంగా ప్రవేశించారు. వారు గేట్ల తాళాలు పగలగొట్టారు. ప్రహరీ గోడను కూల్చివేశారు. అక్కడి ప్రాంగణాన్ని సగానికి విభజించారు. రేకులతో ఫెన్సింగ్ వేయడానికి ప్రయత్నించారు. ఆడుకోడానికి ప్రయత్నించిన సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారు. మురళీధర్ రెడ్డి, గడ్డం రవి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ పని చేసినట్టు పెద్దిరాజు ఆరోపిస్తున్నారు. అందువల్లే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఏం చేశారంటే
అసోసియేషన్ ప్రతినిధులు పోలీసులు అడిగిన సిసి ఫుటేజ్ అందించారు. ఇతర ఆధారాలు కూడా సమర్పించారు. దీంతో గచ్చిబౌలి పోలీసులు మురళీధర్ రెడ్డి.. గడ్డం రవి మీద రకరకాల సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన జరిగినప్పుడు చంద్రశేఖర్ రెడ్డి అక్కడ లేరు. ఆయన పాత్ర కూడా ప్రత్యక్షంగా కనిపించడం లేదు. దీనికి తోడు ఆక్రమణకు ప్రయత్నించినట్టు దాఖలాలు కనిపించడం లేదు. దీంతో పోలీసులు ఈ వ్యవహారం మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మంత్రి కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సమర్పించిన సిసిటీవీ విజువల్స్.. ఇతర దృశ్యాలను పోలీసులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బందిపై దౌర్జన్యం చేసిన వారిని గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. ఈ వివాదం లో అల్లు అర్జున్ మామ ఉండడంతో అసోసియేషన్ సభ్యులు కేవలం స్థానిక పోలీసులను మాత్రమే కాకుండా.. సైబరాబాద్ పోలీస్ కమిషనర్.. మాదాపూర్ డిసిపి.. డీజీపీ కార్యాలయాలకు కూడా ఫిర్యాదు కాపీలను పంపించారు. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తుని కూడా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
వివాదం చోటు చేసుకున్న ప్రాంతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఎకనామిక్ జోన్ పరిధిలోకి వస్తుంది. పైగా అక్కడ అత్యవసర సేవలకు సంబంధించిన రాకపోకలు సాగుతూ ఉంటాయి. ఇటువంటి గొడవలు జరుగుతున్నా నేపథ్యంలో ఐటీ సంస్థల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చంద్రశేఖర్ రెడ్డి ఏమంటున్నారంటే
ఎఫైర్ నమోదుపై కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. తాను ఎటువంటి భూ ఆక్రమణకు పాల్పడలేదని క్లారిటీ ఇచ్చారు. కొంతమంది తనమీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని.. అదంతా కూడా సత్యదూరం అని చంద్రశేఖర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తను ఆక్రమణలకు పాల్పడలేదని.. దౌర్జన్యాలు చేయాల్సిన అవసరం లేదని.. తను సచ్చిలమైన రాజకీయ నాయకుడిని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.. వాస్తవానికి ఇలాంటి వివాదాలలో పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరిస్తారు. ఒకవేళ అల్లు అర్జున్ మామ తప్పు చేస్తే ఆయనను నిందితుడిగా పేర్కొంటారు. విచారణకు రావాలని కోరుతారు. దాని కంటే ముందు నోటీసులు జారీ చేస్తారు. తదుపరి విచారణలో చంద్రశేఖర్ రెడ్డి తరఫున లీగల్ వాదనలు బయటికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.