Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Agnipariksha 2: 'అగ్ని పరీక్ష 2' లో అన్యాయం.. ఓటింగ్ తో సంబంధం...

Bigg Boss Agnipariksha 2: ‘అగ్ని పరీక్ష 2’ లో అన్యాయం.. ఓటింగ్ తో సంబంధం లేకుండా ‘బిగ్ బాస్ 10’ వెళ్తున్నది వీళ్ళే!

Bigg Boss Agnipariksha 2: ‘అగ్ని పరీక్ష 2’ షో మరో మూడు రోజుల్లో ముగియనుంది. ఇప్పటి వరకు ఈ షో కి సంబంధించిన ప్రతీ ఎపిసోడ్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా టాస్కులు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కంటెస్టెంట్స్ కూడా అంతే ఉత్సాహం తో ఆడారు. ఏ రేంజ్ లో ఆడారంటే , వీళ్ళని చూసి సెలబ్రిటీలు కూడా వణికిపోయే రేంజ్ లో అన్నమాట. అయితే ఈ షో ద్వారా బిగ్ […]

Bigg Boss Agnipariksha 2: ‘అగ్ని పరీక్ష 2’ షో మరో మూడు రోజుల్లో ముగియనుంది. ఇప్పటి వరకు ఈ షో కి సంబంధించిన ప్రతీ ఎపిసోడ్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా టాస్కులు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కంటెస్టెంట్స్ కూడా అంతే ఉత్సాహం తో ఆడారు. ఏ రేంజ్ లో ఆడారంటే , వీళ్ళని చూసి సెలబ్రిటీలు కూడా వణికిపోయే రేంజ్ లో అన్నమాట. అయితే ఈ షో ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న కంటెస్టెంట్స్ గురించి ఇప్పుడు ఒక హాట్ టాపిక్ నడుస్తోంది. సాధారణంగా ఆడియన్స్ ఓటింగ్ ద్వారా కంటెస్టెంట్స్ ని ఎంచుకొని బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతామని ఇది వరకే జడ్జీలు చెప్పుకొచ్చారు. కానీ ఆడియన్స్ ఓటింగ్ తో సంబంధం లేకుండా , 6 మంది కంటెస్టెంట్స్ ని అయితే కచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నట్టు టాక్.

అందులో మొదటి వ్యక్తి రోహిత్ నాయుడు. ఇతనికి ఆడియన్స్ ఓటింగ్ భీభత్సంగా ఉంది, నెంబర్ 1 స్థానం లో దూసుకుపోతున్నాడు. ఇతన్ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నారు. అదే విధంగా ఈమధ్య కాలం లో బాగా వెలుగులోకి వచ్చిన రామ కృష్ణ ని కూడా బిగ్ బాస్ హౌస్ లోకి పంపేందుకు ఎంపిక చేశారట మేకర్స్. ఇక ఆడిషన్స్ సమయం లో మూడు గ్రీన్ ఫ్లాగ్స్ ని సొంతం చేసుకున్న చరణ్, ‘అగ్ని పరీక్ష 2’ టాస్కుల్లో గొప్పగా రాణించలేకపోయినప్పటికీ, ఇతన్ని కూడా ఎంపిక చేశారట. ఇది రాబోయే రోజుల్లో పెద్ద కాంట్రవర్సీ అవ్వొచ్చు. ఇక లేడీ కంటెస్టెంట్స్ లో అయితే ఫినాలే ఎపిసోడ్ లో టాస్కులన్నీ గెలిచి ఝాన్సీ ‘టికెట్ టు బిగ్ బాస్’ ద్వారా ఎంట్రీ ఇవ్వనుంది. అదే విధంగా షాలిని , శ్రేష్టి వ్యాకరణం వంటి వారు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అట.

ఇది కేవలం టాప్ 6 మాత్రమే, ఒకవేళ మేకర్స్ టాప్ 8 ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపాలని అనుకుంటే అమన్ / దీపక్ లలో ఒకరిని, అపూర్వ/ రాజకుమారి లలో ఒకరిని పంపే అవకాశం ఉందట. వాస్తవానికి అమన్ కి ఆడియన్స్ ఓటింగ్ భారీగా పడుతోంది. టాప్ 2 స్థానం లో కొనసాగుతున్నాడు. అలాంటి వ్యక్తి ని ‘బిగ్ బాస్ 10’ కి ఎంపిక చేయకపోతే చాలా అన్యాయం చేసినట్టే. అయితే అమన్ ‘అగ్ని పరీక్ష 2’ లో పెద్దగా పెర్ఫర్మ్ చేయలేదనే చెప్పాలి. టాస్కులు పెట్టినప్పుడు అయ్యోమయానికి గురి అవుతున్నాడు. పెద్దగా షైన్ అవ్వలేదు. కానీ ‘టికెట్ టు బిగ్ బాస్’ టాస్కుల్లో మాత్రం అమన్ చాలా బాగా ఆడాడట, చూడాలి మరి గ్రాండ్ లాంచ్ రోజు ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper