Homeఆంధ్రప్రదేశ్‌Happy birthday To You Pawan Kalyan: పవన్.. సినిమాల్లో ప్రభంజనం.. రాజకీయాల్లో విస్ఫోటనం..

Happy birthday To You Pawan Kalyan: పవన్.. సినిమాల్లో ప్రభంజనం.. రాజకీయాల్లో విస్ఫోటనం..

Happy birthday To You Pawan Kalyan: 2024 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అంతంత మాత్రం గానే సీట్లు వచ్చాయి. ఈ క్రమంలో ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలి. అది జరగాలంటే ఎంపీల బలం కావాలి. ఆ బలాన్ని ఇచ్చింది పవన్ కళ్యాణ్. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగంగానే చెప్పారు. దీనిని బట్టి పవన్ కళ్యాణ్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. నేడు పవన్ కళ్యాణ్ జన్మదినం. […]

Happy birthday To You Pawan Kalyan: 2024 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అంతంత మాత్రం గానే సీట్లు వచ్చాయి. ఈ క్రమంలో ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలి. అది జరగాలంటే ఎంపీల బలం కావాలి. ఆ బలాన్ని ఇచ్చింది పవన్ కళ్యాణ్. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగంగానే చెప్పారు. దీనిని బట్టి పవన్ కళ్యాణ్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

నేడు పవన్ కళ్యాణ్ జన్మదినం. తెలుగు రాష్ట్రాలలో అత్యంత కల్ట్ ఫ్యాన్ బేస్ కలిగి ఉన్న స్టార్లలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. పవన్ కళ్యాణ్ బర్త్డే అనగానే అతడి అభిమానులు భారీగా హంగామా చేస్తుంటారు. కటౌట్లు పెడుతుంటారు.. నినాదాలు చేస్తుంటారు. అయితే ఈ హడావిడి కి పవన్ కళ్యాణ్ చాలా దూరంగా ఉంటారు. ఆయన మొదటి నుంచి కూడా ఆడంబరాలకు.. హడావిడి కి దూరంగా ఉంటారు. ఆయన లైఫ్ స్టైల్ నిశ్శబ్దంగా ఉంటుంది. ఆలోచన విధానంలో పరిణతి కనిపిస్తుంది. సినిమా తెరమీద ఆయనకున్న పేరును.. రాజకీయాలలో సాగించిన విలువలను ఆయన ఎప్పుడూ తన వ్యక్తిగత గొప్పతనంగా చెప్పుకోలేదు. అట్టహాసం అనేది ఆయనకు సరిపడదు. కేవలం తను సాధించాల్సిన టార్గెట్ల మీద మాత్రమే ఆయన ఫోకస్ చేస్తూ ఉంటారు.

పవన్ కళ్యాణ్ విలాసవంతమైన జీవితానికి అవకాశం ఇవ్వలేదు. చిన్నపాటి వ్యవసాయ క్షేత్రం.. అందులో మామిడి చెట్లు.. నాటు ఆవులను పెంచుకుంటూ తన నిరాడంబరమైన జీవితాన్ని కొనసాగించారు. ఆయనకు ప్రకృతి అంటే విపరీతమైన ఇష్టం. ఆధ్యాత్మిక పుస్తకాలను చదువుతూ ఉంటారు. సమాజం పట్ల ఆయనకు విపరీతమైన ప్రాధాన్యత ఉంటుంది. సినిమా ఆయనకు ఆర్థిక భద్రత అందించిన నేపథ్యంలో.. దానిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోలేదు. వెనుకబడిన వర్గాల వారికి.. కష్టాలలో ఉన్న ప్రజలకు.. కౌలు రైతులకు.. పేదల సంక్షేమానికి ఉపయోగించారు. వీటిని ఎక్కడ కూడా పబ్లిసిటీగా ప్రచారం చేసుకోలేదు.

రాజకీయాలలోకి వచ్చినవారు వెంటనే విజయాలు సాధించాలి అనుకుంటారు. సీట్లను సంపాదించాలి అని భావిస్తుంటారు. కానీ అందరికీ రాజకీయాలనేవి కేక్ వాక్ లాగా ఉండవు. అందులో ఓటములు ఉంటాయి. ఇబ్బందులు ఉంటాయి. కష్టాలు ఉంటాయి. విమర్శలు ఉంటాయి. ఆరోపణలు కూడా ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడడం అంత ఈజీ కాదు. ఎదురు దెబ్బలు తగిలినప్పుడు వాటిని ఓర్చుకోవడం అంత సులభం కాదు. ఓటముల నుంచి వచ్చిన పాఠాలను ఆయన విజయాలుగా మలుచుకున్నాడు పవన్ కళ్యాణ్. క్షేత్రస్థాయిలో సహనంతో ఉన్నాడు.. ప్రజల కోసం గట్టిగా నిలబడ్డాడు. ఆ ఓర్పును చివరి వరకు కొనసాగించాడు.

ఆర్భాటం అనేది ఆయనకు ఎన్నడూ లేదు. సేవా గుణం.. బాధితుల పక్షాన వెంటనే స్పందించడం.. వంటి లక్షణాలు ఆయనను రాజకీయాల్లో విలక్షణమైన వ్యక్తిగా తీర్చిదిద్దాయి. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా.. ఆయన పదవి కంటే.. తన విధి నిర్వహణకే ప్రాధాన్యం ఇచ్చారు. పరిపాలనపరంగా యంత్రాంగాన్ని తిట్టకుండా, కేవలం స్వేచ్ఛాయుత విధానంలోనే పనిచేయిస్తున్నారు. ఇది ఒక రకంగా ఆయన మార్పు చూపించే ప్రయత్నం.

మాటలను పెద్దగా మాట్లాడరు. కేవలం చేతలకు మాత్రమే ప్రాధాన్యమిస్తారు. అనవసరమైన విషయాలకు ఆస్కారం ఇవ్వరు. లేనిపోని ప్రచారాన్ని కోరుకోరు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అంటే చాలామంది ఒక సెలబ్రిటీ బర్త్డే లాగా చూడరు. ఒక విలక్షణమైన నాయకుడి బర్త్డే లాగా.. సిద్ధాంతాల మీద నిలబడే నాయకుడి జన్మదినం లాగా చూస్తారు. ఒక ముక్కలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఒక సాధకుడు. తన ప్రయాణాన్ని మొహమాటం లేకుండా సాగించగలిగే వ్యక్తి. అన్నిటికంటే ముఖ్యంగా తనను తాను తగ్గించుకొని.. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే కర్మయోగి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper