Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Agnipariksha 2: 'అగ్నిపరీక్ష 2' లో టాప్ ఓటింగ్ తో కొనసాగుతున్న టాప్...

Bigg Boss Agnipariksha 2: ‘అగ్నిపరీక్ష 2’ లో టాప్ ఓటింగ్ తో కొనసాగుతున్న టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్ళే..!

Bigg Boss Agnipariksha 2: రీసెంట్ గానే మొదలైన ‘అగ్నిపరీక్ష 2’ కి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ప్రతీ రోజు మనం కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఈ రేంజ్ హీట్ బిగ్ బాస్ గత సీజన్స్ లో ఎప్పుడూ లేదనే చెప్పాలి. ఎపిసోడ్స్ చాలా రసవత్తరంగా ఉన్నాయి కానీ , జడ్జీలు సామాన్యుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై మాత్రం సోషల్ మీడియా లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. ముఖ్యంగా నవదీప్ , బిందు మాధవి […]

Bigg Boss Agnipariksha 2: రీసెంట్ గానే మొదలైన ‘అగ్నిపరీక్ష 2’ కి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ప్రతీ రోజు మనం కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఈ రేంజ్ హీట్ బిగ్ బాస్ గత సీజన్స్ లో ఎప్పుడూ లేదనే చెప్పాలి. ఎపిసోడ్స్ చాలా రసవత్తరంగా ఉన్నాయి కానీ , జడ్జీలు సామాన్యుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై మాత్రం సోషల్ మీడియా లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. ముఖ్యంగా నవదీప్ , బిందు మాధవి వంటి వారు కొన్ని సంఘటనల కారణంగా బాగా నెగెటివ్ అయిపోయారు. వాళ్ళ సంగతి పక్కన పెడితే నిన్నటి నుండి టాప్ 15 కంటెస్టెంట్స్ కి ఓటింగ్ మొదలైంది. వీరిలో అందరికంటే అత్యధిక ఓట్లను సంపాదించుకున్న కంటెస్టెంట్ ఎవరు?, టాప్ 5 లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారు అనేది ఇప్పుడు మనం వివరంగా చూడబోతున్నాం.

అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం , ప్రస్తుతం అందరి కంటే టాప్ ఓటింగ్ తో కొనసాగుతున్న కంటెస్టెంట్ అమన్ మసూద్. ఈయన నెంబర్ 1 స్థానం లో ఉన్నాడట. ఈరోజు ఎపిసోడ్ లో ఆయన ఆడిన తీరు బాగానే ఉంది కానీ , జడ్జీలు ఎందుకో ఇతన్ని కావాలని ముందుకు తోస్తున్న ఫీలింగ్ జనాల్లో ఉంది. ఇక అతని తర్వాత అత్యధిక ఓట్లతో కొనసాగుతున్న కంటెస్టెంట్ రాజా కుమారి దయానా. ఈమె జడ్జీల చేత నేరుగా ఎంపికై టాప్ 15 లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈరోజుటి ఎపిసోడ్ లో కూడా టాస్కులు అద్భుతంగా ఆడింది. ఇక మూడవ స్థానం లో చరణ్ ఉన్నాడట. ఇతన్ని ఆడిషన్స్ సమయం లోనే జనాలు విపరీతంగా నచ్చేసారు. ఆ వేవ్ ఇప్పటికీ ఇతనికి కొనసాగుతూనే ఉంది. 4 వ స్థానం లో ఉన్న రోహిత్ నాయుడు. చూసేందుకు చాలా సైలెంట్ గా ఉన్న రోహిత్ లో ఎంత టాలెంట్ దాగుందో ఈరోజుటి ఎపిసోడ్ లో మీరంతా చూసే ఉంటారు.

ఇతని పేరు గుర్తుపెట్టుకోండి , రాబోయే ఎపిసోడ్స్ తో ఇతను ఏకంగా మొదటి స్థానానికి ఎగబాకుతాడని అంటున్నారు విశ్లేషకులు. ఇక 5 వ స్థానం లో కొనసాగుతున్న కంటెస్టెంట్ మితిలేష్. ఇతన్ని కూడా జడ్జీలు మూడు గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చి టాప్ 15 కి నేరుగా పంపారు. కానీ నేటి ఎపిసోడ్ లో ఈయన పెద్దగా పెర్ఫార్మ్ చెయ్యలేదు అనే చెప్పాలి. షూటింగ్ అప్డేట్స్ ప్రకారం చూస్తే , ఈయన ఇప్పటి వరకు ఈ షోలో బలమైన ముద్ర వేయలేకపోయాడట. ఇది ఇలా ఉండగా , 6 వ స్థానం లో షాలిని కొనసాగుతుందని , 7 వ స్థానం లో భాగీ , 8 వ స్థానం లో శ్రేష్టి వ్యాకరణం వంటి వారు కొనసాగుతున్నట్టు సమాచారం. వీరిలో టాప్ 6 కచ్చితంగా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ డేంజర్ జోన్ లోనే ఉన్నారట.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper