Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10' లోకి ఎంట్రీ ఇవ్వనున్న అల్లు అరవింద్...

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ లోకి ఎంట్రీ ఇవ్వనున్న అల్లు అరవింద్ ఫేవరెట్ హీరోయిన్.. పూర్తి వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు..

Bigg Boss 10 Telugu: వచ్చే నెల 6 వ తేదీ నుండి కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 10’ గ్రాండ్ గా మొదలు కానుంది. ఇప్పుడు సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈ సీజన్ కి సంబంధించిన మేనియా నే కనిపిస్తోంది. అందుకు ముఖ్య కారణం ‘అగ్నిపరీక్ష 2’. ఈ షో కి సంబంధించిన కొన్ని సంఘటనలు సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి […]

Bigg Boss 10 Telugu: వచ్చే నెల 6 వ తేదీ నుండి కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 10’ గ్రాండ్ గా మొదలు కానుంది. ఇప్పుడు సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈ సీజన్ కి సంబంధించిన మేనియా నే కనిపిస్తోంది. అందుకు ముఖ్య కారణం ‘అగ్నిపరీక్ష 2’. ఈ షో కి సంబంధించిన కొన్ని సంఘటనలు సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడేలా చేశాయి. వాటికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు ఒక రేంజ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇన్ స్టాగ్రామ్ తెరిచి చూస్తే చాలు , ‘అగ్నిపరీక్ష 2’ కి సంబంధించిన వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఆ రేంజ్ లో వైరల్ అయ్యింది ఈ షో. మొత్తం మీద ఎంపికైన 15 మందిలో కేవలం 6 మంది మాత్రమే ‘బిగ్ బాస్ 10’ లోకి ఎంట్రీ ఇస్తారట.

ఈ 15 మందిలో ఇప్పటికే గాయత్రీ అనే కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యినట్టు సమాచారం. ఇక మిగిలిన 14 మంది కంటెస్టెంట్స్ కి ఎలాంటి టాస్కులు పెట్టబోతున్నారు?, వీరిలో ఎవరెవరు గెలిచి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇకపోతే ఈ సీజన్ లో పాల్గొనే సెలబ్రిటీ కంటెస్టెంట్స్ పై సోషల్ మీడియా లో రకరకాల అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే జబర్దస్త్ పాపులర్ కమెడియన్ ‘ఆటో రాంప్రసాద్’ ఈ షోలో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ తర్వాత నటుడు ఆదిత్య మీనన్, యాంకర్ వర్షిణి వంటి వారు కూడా ఖరారు అయ్యినట్టు తెలుస్తోంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఒక క్రేజీ యంగ్ యాంకర్ ఈ షోలో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈమె పేరు చర్మిల. ఈమధ్యకాలం లో సోషల్ మీడియా లో బాగా ట్రెండింగ్ లో ఉన్న యాంకర్ ఈమె.

యూత్ ఆడియన్స్ ఈమె అందానికి ఫిదా అయిపోయారు. అనేక ఈవెంట్స్ కి యాంకర్ గా వ్యవహరిస్తూ వచ్చిన ఈమెని, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నా సినిమాలో హీరోయిన్ రోల్ ఇస్తాను , చేస్తావా ? అని అడిగిన వీడియో క్లిప్ ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. ఒకవిధంగా చెప్పాలంటే ఈ వీడియో క్లిప్ ఆమెని ఓవర్ నైట్ స్టార్ గా మార్చింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే, యూత్ ఆడియన్స్ లో ఇప్పటి వరకు ఈ షో ని చూడని వాళ్ళు కూడా చూడడం మొదలు పెడుతారు. ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

 

View this post on Instagram

 

A post shared by Charmilla Nalluru (@rj_charmilla)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper