Bigg Boss 10 Telugu: వచ్చే నెల 6 వ తేదీ నుండి ‘బిగ్ బాస్ 10’ షో గ్రాండ్ గా ప్రారంభం కాబోతున్న సందర్భంగా ఎక్కడ చూసినా దీని గురించే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ‘అగ్ని పరీక్ష 2’ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. వివాదాలతోనే మొదలైనప్పటికీ, కంటెస్టెంట్స్ అందరూ ప్రాణం పెట్టి టాస్కులు ఆడుతుండడం వల్ల , ఈ షో కూడా పెద్ద హిట్ అయ్యింది. ఇక్కడి నుండి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్న సామాన్యులు ఎవరో తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే. ఇకపోతే ‘బిగ్ బాస్ 10’ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న కంటెస్టెంట్స్ జాబితా ని ఇది వరకే మనమంతా చూసాము. అయితే ఇప్పుడు ఈ బిగ్ బాస్ ఆఫర్ ని రిజెక్ట్ చేసిన కంటెస్టెంట్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము.
విష్ణు :
ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తున్న ‘గుండెనిండా గుడిగంటలు’ సీరియల్ హీరో ఇతను. బాలు క్యారెక్టర్ తో ఎంత ఫేమస్ అయ్యాడో అందరికీ తెలిసిందే. ఈయన్ని బిగ్ బాస్ టీం సంప్రదించి మంచి రెమ్యూనరేషన్ ని కూడా ఆఫర్ చేశారు. కానీ ఆయన ఆ ఆఫర్ ని సున్నితంగా రిజెక్ట్ చేశాడట .
తేజశ్విని గౌడ :
టీవీ సీరియల్స్ లో హీరోయిన్ గా , అమర్ దీప్ చౌదరి సతీమణి గా ఈమెకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత రెండు మూడు సీజన్స్ నుండి ఈమెని అడుగుతూనే ఉన్నారు. ఈమెకు కూడా పాల్గొనడానికి ఆసక్తి ఉంది కానీ , అదే సమయం లో ఎదో ఒక సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తుండడం వల్ల ఆమె రాలేకపోయింది. ఈ సీజన్ కి కూడా అంతే. భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినప్పటికీ రిజెక్ట్ చేసిందట.
దెబ్ జాన్ :
స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన ఎన్నెన్నో జన్మల బంధం , సత్యభామ వంటి సీరియల్స్ లో హీరోయిన్ గా నటించిన ఈమెకు మంచి క్రేజ్ ఉంది. ఈ సీజన్ లోకి రావడానికి సిద్దమే , కానీ అదే సమయం వేరే భాషలో ఆమె సీరియల్ చేస్తుండడం , అది మంచి రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తుండడం వల్ల , ఈమె కూడా ‘బిగ్ బాస్ 10’ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది.
కావ్యశ్రీ :
సీరియల్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈమెని కూడా బిగ్ బాస్ మేకర్స్ గత రెండు సీజన్స్ నుండి అడుగుతూనే ఉన్నారు. కానీ ఈమెకు ఆసక్తి లేకపోవడం తో ఈ సీజన్ ఆఫర్ ని కూడా రిజెక్ట్ చేసింది.