Electric Scooters: సాధారణంగా కొన్ని బ్రాండెడ్ కారును దక్కించుకోవాలంటే మూడు లేదా నాలుగు నెలలు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ పరిస్థితి ఇప్పుడు టూ వీలర్స్ లోనూ ఉంటోంది. ఇటీవల కాలంలో విద్యుత్ స్కూటర్లకు ఎక్కువగా ఆదరణ లభిస్తోంది. పెట్రోల్ వాహనాలు ఉన్నవారు వాటి స్థానంలో ఎలక్ట్రిక్ స్కూటర్లను చేర్చుకుంటున్నారు. ఇవి తక్కువ ధరకు అందుబాటులో రావడంతో పాటు మైలేజ్ కూడా ఎక్కువగా ఇస్తుండడంతో.. బడ్జెట్కు అనుగుణంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఈ విధంగా డిమాండ్ పెరగడంతో ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలంటే కనీసం రెండు నెలలు వెయిటింగ్ చేయాలని షోరూంల ల వద్ద ఉన్న పరిస్థితి చూస్తే తెలుస్తుంది. ఏ కంపెనీ స్కూటర్ కు ఎక్కువ డిమాండ్ ఉంది?
కొన్ని నివేదికల ప్రకారం 2025 సంవత్సరంలో 13.4 లక్షల విద్యుత్ వాహనాలు విక్రయాలు జరగగా.. ఈ ఏడాదిలో ఆగస్టు వరకే 11.8 లక్షల సేల్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే వీటిలో ఎక్కువగా స్కూటర్లు ఉండడం విశేషం. అయితే వినియోగదారులు మొన్నటి వరకు తమకు నచ్చిన కలర్ల కోసం కొన్ని రోజులు వెయిట్ చేసేవారు. కానీ ఇప్పుడు ఏ కలర్ అయినా పర్వాలేదు అని అనుకున్నా కూడా.. తగిన ఎలక్ట్రిక్ వాహనం దొరకడం లేదు. ముఖ్యంగా ఎక్కువగా ఆసక్తి ఉన్న కంపెనీల కు చెందిన వాహనాలు కావాలని అనుకుంటే కనీసం రెండు నెలల వరకు సమయం పడుతుందని వాహనాల డీలర్లు పేర్కొంటున్నారు.
అయితే వినియోగదారుల డిమాండ్కు తగిన ఉత్పత్తి లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని అంటున్నారు. ఈ మేరకు ఏథర్ ఎనర్జీ కంపెనీ యాజమాన్యం తెలుపుతూ.. వినియోగదారుల డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని గత ఏడాది కంటే ఇప్పుడు 158 శాతం ఉత్పత్తిని పెంచినట్లు తెలుపుతున్నారు. ఇక డీలర్ల వద్ద గతంలో 14 రోజుల వరకు ఉన్న నిల్వలు ఇప్పుడు మూడు రోజులకు తగ్గాయని తెలుపుతున్నారు. దీంతో కొన్ని బుకింగ్లను ఆపేస్తున్నట్లు తెలుస్తోంది. వినియోగదారులు ఏదైనా వాహనం కావాలంటే కనీసం రెండు నుంచి మూడు నెలల వరకు వెయిటింగ్ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు.
అయితే కొంతమంది మాత్రం తమకు అర్జెంటుగా వాహనాలు కావాలని అనుకుంటే ఉన్న వాటిని ఎంచుకుంటున్నారు. దీంతో మిగతా కంపెనీల వాహనాలకు కూడా డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితిని చూసినా కొన్ని బ్రాండ్లు కంపెనీలు సైతం తమ ఉత్పత్తిని పెంచుకుంటున్నాయి. బజాజ్ ఆటో గతంలో 50 వేల వాహనాలను ఉత్పత్తి చేయగా.. ఇప్పుడు 60 వేలకు పెంచుతోంది. టీవీఎస్ స్కూటర్ నెలవారి విద్యుత్ స్కూటర్ల ఉత్పత్తిని 40 వేల నుంచి 50 వేలకు పెంచింది.. అయితే డిమాండ్ ఇంకా పెరిగితే ఈ ఉత్పత్తి సరిపోదనే భావన వ్యక్తం అవుతుంది.