Rohith Naidu Injuries: నిన్న గాక మొన్ననే మొదలైనట్టుగా అనిపిస్తున్న ‘అగ్ని పరీక్ష 2’ షో అప్పుడే చివరి దశకు చేరుకుంది. ఈ శనివారం తో ఈ షో పూర్తి కానుంది. షూటింగ్ ఇప్పటికే అయిపోయింది. కంటెస్టెంట్స్ కి ఓటింగ్ కూడా భారీ రేంజ్ లోనే పడుతున్నాయి. అయితే ఈ అగ్నిపరీక్ష షో ద్వారా బాగా మెరిసిన సామాన్యుడు ఎవరైనా ఉన్నారా అంటే, అది రోహిత్ నాయుడు మాత్రమే. నేటి ఎపిసోడ్ లో ఒక్కటే ఆయన ఓడిపోయాడు కానీ, ఇప్పటి వరకు ఆయన ఆడిన ప్రతీ టాస్క్ గెలిచాడు, తనకు సాటి మరెవ్వరూ లేరని అనిపించుకున్నాడు. అయితే రేపు టెలికాస్ట్ అవ్వబోయే ఎపిసోడ్ రోహిత్ పేరు ని మరోసారి మారుమ్రోగిపోయేలా చేయనుంది. ఇప్పటికే అతని ఓటింగ్ ఎవ్వరూ అందుకోలేని రేంజ్ లో ఉంది, ఇక రేపటి ఎపిసోడ్ తో అయితే తిరుగులేని కంటెస్టెంట్ గా మారిపోతాడు.
‘బిగ్ బాస్ 10’ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా ఇతన్ని దాటుకొని సెలబ్రిటీలు ముందుకు వెళ్లడం చాలా కష్టం అయిపోతుంది అనుకోవచ్చు. ఇంతకీ రేపటి ఎపిసోడ్ లో జరగబోయేది ఏంటంటే, ఉన్న 14 మంది కంటెస్టెంట్స్ ని రెండు టీమ్స్ గా ఏర్పడమని చెప్తారు జడ్జీలు. రోహిత్, ప్రియాంక ఇద్దరు ఒక జోడీగా ఆడుతారు. అన్ని జంటల చేతులు రోప్స్ తో కట్టేసి ఉంటుంది. దాన్ని విడిపించుకుని క్రమం లో రోహిత్ రెండు చేతులకు గాయాలై రక్తం కూడా కారుతుంది అట. అయినప్పటికీ కూడా వెనకడుగు వేయకుండా గేమ్ ని కొనసాగించాడట. చేతులను ఉపయోగించకుండా, నోటితో రోప్స్ నుండి విడిపించుకొని తన టీం ని గెలిపిస్తాడట. 12 మంది కంటెస్టెంట్స్ ని దెబ్బ తగిలినప్పటికీ కూడా ఓడించాడంటే రోహిత్ స్టామినా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
సోషల్ మీడియా లో అందరూ అతన్ని అంత పైకి లేపడం లో తప్పు లేదని అనిపిస్తోంది, ఆ రేంజ్ లో ఇతను తన గేమ్ ని కొనసాగిస్తున్నాడు. అయితే గెలిచిన లో ఒకరికి ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం లభిస్తుంది కదా, ఇక్కడ కూడా రోహిత్ తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ఇప్పటికే నేను రెండు సార్లు ఓటు అప్పీల్ చేసానని, ఇప్పుడు నాకు బదులుగా ప్రియాంక కి ఓటు అప్పీల్ చేసే అవకాశం ఇస్తున్నానని చెప్పాడట రోహిత్. ఒకవేళ రోహిత్ ఓటు అప్పీల్ చేసుకొని ఉండుంటే ‘అగ్ని పరీక్ష 2’ హిస్టరీ లో మూడు సార్లు ఓటు అప్పీల్ చేసుకున్న ఏకైక కంటెస్టెంట్ గా రోహిత్ చరిత్ర సృష్టించేవాడు, కానీ ఆ అవకాశాన్ని వదులుకున్నాడు.