Pakistan Test Cricket: ఇటీవల బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా తో టెస్ట్ మ్యాచ్ ఆడింది. అది కూడా ఆస్ట్రేలియా గడ్డమీద.. తిరుగులేని స్థాయిలో ఆటను చూపించింది. ఒక రకంగా ఆస్ట్రేలియా కు చుక్కలు చూపించింది. ఫలితంగా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. రెండు టెస్టుల సిరీస్ ను దాదాపుగా సొంతం చేసుకునేలాగా కనిపించింది. మొదటి టెస్టులో గెలిచిన తర్వాత.. మళ్లీ ఆ స్థాయి ప్రతిభ చూపించలేకపోవడంతో ఆస్ట్రేలియా ముందు బంగ్లాదేశ్ తలవంచింది. కాకపోతే సిరీస్ ఆస్ట్రేలియా సొంతంగా బంగ్లాదేశ్ సత్తా చూపించింది.. దీనిని పోరాటపటిమ అంటారు
టెస్టులలో బంగ్లాదేశ్ జట్టుతో పోల్చి చూస్తే పాకిస్తాన్ జట్టుకు విపరీతమైన అనుభవం ఉంది. పాకిస్తాన్ జట్టులో అపారమైన ప్లేయర్లు ఉన్నారు. అంతమంది ఉన్నప్పటికీ ఉపయోగం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ జట్టు పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ముఖ్యంగా టెస్ట్ ఫార్మేట్లో ఆ జట్టు ఆడుతున్న తీరు అత్యంత చండాలంగా ఉంది. కెప్టెన్ గా బాబర్ అజామ్ వచ్చినప్పటికీ కూడా పాకిస్తాన్ తీరు ఏమాత్రం మారలేదు. ఇంగ్లాండ్ గడ్డలో పర్యటిస్తున్న పాకిస్తాన్ జట్టు ఇప్పటికే మూడు టెస్టుల సిరీస్ లో రెండు మ్యాచ్లు ఓడిపోయింది. మొదటి దృష్టిలో 100కు మించి పరుగుల తేడాతో ఓడిపోయింది. రెండో టెస్టులో అయితే దాదాపు 200 పరుగుల తేడాతో కూటమిని మూటగట్టుకుంది.
పాకిస్తాన్ జట్టు Sena(South Africa, England, New Zealand, Australia) జట్ల మీద దారుణంగా ఆడుతోంది. అసలు ఏమాత్రం పోరాటం కూడా ప్రదర్శించడం లేదు. సేన జట్లమీద పాకిస్తాన్ ఇటీవల కాలంలో దాదాపు 18 టెస్టులు ఆడింది. ఇందులో ఒక విజయం కూడా నమోదు చేయలేదు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఇందులో 16 ఓటములు ఉన్నాయి. రెండు మాత్రమే డ్రాలు ఉన్నాయి. దీనిని బట్టి పాకిస్తాన్ ఆట తీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సైకిల్ ను ఐసీసీ తీసుకు వచ్చిన తర్వాత ఇప్పటివరకు పాకిస్తాన్ ఒక్కసారి కూడా ఫైనల్ దాకా వెళ్ళలేక పోయిందంటే.. ఆ జట్టు ఆటగాళ్లు ఎంత నిర్లక్ష్యంగా ఆడుతున్నారో వివరించాల్సిన పనిలేదు..
పాకిస్తాన్ జట్టు ప్లేయర్లు ఆడుతున్న తీరు పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఆటగాళ్లు ఇలా ఎందుకు ఆడుతున్నారో అర్థం కావడం లేదని పాకిస్తాన్ అభిమానులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఆడి పాకిస్తాన్ జట్టును ఏం చేద్దాం అనుకుంటున్నారని ఆటగాళ్లను ఉద్దేశించి పాకిస్తాన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు..”వైట్ బాల్ ఫార్మాట్లో గొప్పగా ఆడటం లేదు. చివరికి రెడ్బల్ ఫార్మాట్లో కూడా దారుణంగా ఆడుతున్నారు. ఇలా అయితే కష్టం. జై షా కు చెప్పి బయటికి వచ్చేయండి. లేదా ఎలిమినేట్ కండి” అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
image.png