Agni Pareeksha 2 Ramakrishna: కేవలం ఒకటి రెండు సంఘటనలు చూసి, ఒక మనిషిని తక్కువ అంచనా వేయడం చాలా పెద్ద తప్పు. ప్రతీ మనిషి లోనూ ఎదో ఒక టాలెంట్ ఉంటుంది. అదే విధంగా ప్రతీ మనిషి లోనూ బలహీనతలు ఉంటాయి. బలహీనతలు బయటపడినప్పుడు ‘ఇతను దేనికి పనికిరాడు ,వేస్ట్’ అని అనుకోకూడదు. ఒకవేళ అతని వైపు నుండి ‘ది బెస్ట్’ వచ్చినప్పుడు, తక్కువ అంచనా వేసి పొరపాటు చేశామే అని బాధ పడుతుంటాము. మనలో అలాంటి బాధ కలిగినప్పుడు, మన తక్కువ అంచనా వేసిన వ్యక్తి ముఖాన్ని చూసేందుకు కూడా సిగ్గు పడుతుంటాము. అలాంటి సందర్భమే నేటి ‘అగ్ని పరీక్ష 2’ ఎపిసోడ్ లో రామకృష్ణ విషయం లో చోటు చేసుకుంది. ఇతన్ని ఆడిషన్స్ లో చూసిన వెంటనే, చాలా విచిత్రం గా ఉన్నాడే అనే ఫీలింగ్ కలిగింది.
‘మీరు మాయమైతే.. ఏమి చేస్తారు?’ అని అడిగిన ప్రశ్న కు, అమ్మాయిని ముద్దుపెట్టుకుంటాను అని రాస్తాడు రామకృష్ణ. దీనికి జడ్జి బిందు మాధవి చాలా ఫైర్ అవుతుంది. నీ లెంపలు వాయించేస్తా అని వార్నింగ్ కూడా ఇస్తుంది. ఆమెకు కూడా రామకృష్ణ నేటి ఎపిసోడ్ లో గట్టిగానే సమాధానం ఇచ్చాడు రామకృష్ణ. పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఉన్న 15 మంది కంటెస్టెంట్స్ నలుగురు చొప్పున టీమ్స్ గా ఏర్పడండి అని అంటారు జడ్జీలు. రామకృష్ణ, ఝాన్సీ, దీపక్, శ్రేష్టి వ్యాకరణం ఒక టీం గా ఫార్మ్ అవుతారు. టీమ్స్ కి లీడర్ గా ఏకాభిప్రాయం తో ఎన్నుకోండి అని అంటారు జడ్జీలు. రామకృష్ణ టీం వంతు వచ్చిన తర్వాత, అతని తోటి టీం సభ్యులు, నువ్వు స్వతంత్రం గా టాస్కులు బాగా ఆడగలవు కానీ, టీం ని లీడ్ చేయలేవు, అయ్యోమయ్యం గా వ్యవహరిస్తావు అని అంటారు. అప్పుడు జడ్జీలు కలగచేసుకొని, మీ నలుగురిలో ముగ్గురుకి ఇప్పటికే లీడర్స్ గా వ్యవహరించే ఛాన్స్ వచ్చింది. రామకృష్ణ కి ఒక్క ఛాన్స్ ఇవ్వొచ్చు కదా అని అనేలోపు ఆయనకు అవకాశం ఇస్తారు.
ఇదంతా పక్కన పెడితే నవదీప్ ఒక ట్విస్ట్ ఇస్తూ , టీం లీడర్స్ కి ఎంపికైన వాళ్లకు, మీ టీమ్స్ నుండి ఒకరిని తీసేయండి, ఎవరితో చర్చించకుండా, మీ సొంత నిర్ణయంతోనే తీసేయాలి అని అంటాడు నవదీప్. అప్పుడు రామకృష్ణ తెలివి గా శ్రేష్టి ని తన టీం నుండి తీస్తాడు. ఎందుకంటే ఝాన్సీ వద్ద పవర్ కార్డు ఉంది, దీపక్ ఫిజికల్ టాస్కులు బాగా ఆడుతాడు, శ్రేష్టి అతనితో పోలిస్తే తక్కువ కాబట్టి, ఆమెని తొలగించాడు. ఇది ఆ టీం కి చాలా ఉపయోగపడింది. ఝాన్సీ కి పవర్ కార్డు ఉండడం వల్ల, అందరికంటే ముందుగా ఆ టీంకి టాస్క్ ని ప్రారంభించే అవకాశం దక్కింది. అలా ప్రారంభించడం వల్లే, రోహిత్ నుండి ఓటమి ని తప్పించుకుంది ఈ టీం. ఇదంతా రామకృష్ణ తెలివిగా శ్రేష్టి ని టీం నుండి తొలగించడం వల్లే కదా జరిగింది?, అందుకే రామకృష్ణ ని నిన్న అందరూ ఒక రేంజ్ లో మెచ్చుకున్నారు. తక్కువ అంచనా వేయకండి, మీరు ఒక అవకాశం ఇస్తేనే కదా నా టాలెంట్ తెలిసేది అంటూ తన తోటి కంటెస్టెంట్స్ కి చెప్పుకొచ్చాడు రామకృష్ణ. ఒక మనిషిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు అనే సూత్రాన్ని నిన్నటి ఎపిసోడ్ ద్వారా చూపించాడు రామకృష్ణ.