Samantha: స్టార్ హీరోయిన్ సమంత తన జీవితం లో ఇప్పటి వరకు ఎప్పుడూ పొందలేని ఆనందాన్ని పొందుతూ, ముందుకు దూసుకెళ్తోంది. నాగ చైతన్య తో విడాకులు తర్వాత ఆమె ఎలాంటి మానసిక వేదనకు గురైందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దానికి తోడు మయోసిటిస్ లాంటి ప్రాణాంతక వ్యాధి సోకడం తో మరణం అంచుల వరకు వెళ్ళొచ్చింది. ఇక కోలుకున్న తర్వాత రాజ్ నిడిమోరు అనే బాలీవుడ్ డైరెక్టర్ ని ప్రేమించి పెళ్లాడిన సమంత, ‘మా ఇంటి బంగారం’ చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చి , ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ ని అందుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సౌత్ ఇండియన్ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ క్యాటగిరీలో 100 కోట్ల గ్రాస్ ని అందుకున్న ఏకైక చిత్రం గా ‘మా ఇంటి బంగారం’ చిత్రం చరిత్ర సృష్టించింది.
ఈ సినిమా షూటింగ్ సమయం లోనే ఆమె గర్భం దాల్చిన సంగతి అందరికీ తెలిసిందే. గర్భం తోనే యాక్షన్ సన్నివేశాలు కూడా చేసింది. అయితే ఇన్ స్టాగ్రామ్ లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సమంత, అప్పుడప్పుడు తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ కూడా చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా రీసెంట్ గా చేసిన చిట్ చాట్ లో ఆమె మాట్లాడుతూ ‘పుట్టబోయే బిడ్డకు పేరు పెట్టడం లో మీ సాయం కావాలని’ అభిమానులను కోరుతుంది. అభిమానులు వేల కొద్దీ పేర్లను సూచించారు. వాటిల్లో ఒక అభిమాని సూచించిన పేరు సమంత కి తెగ నచ్చేసింది. సమంత, రాజ్ పేర్లు కలిసి వచ్చేలా ఆడ బిడ్డ పుడితే ‘సమైరా’ అని, మగబిడ్డ పుడితే ‘సామ్రాజ్’ అని పేరు పెట్టాలని ఒక అభిమాని సూచించాడు.
దీనికి సమంత స్పందిస్తూ ‘మన గురించి మనమే ఎక్కువగా ఊహించుకున్నట్టు ఉంది కదూ’ అని అంటుంది. ఇకపోతే గర్భం దాల్చిన తర్వాత సమంత ఇప్పటి వరకు 11 కిలోల బరువు పెరిగిందట. మాతృత్వాన్ని మనసారా ఆస్వాదిస్తున్నానని, ఈ ఫీలింగ్ ఎంతో అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చింది. అయితే సమంత నుండి కొత్త సినిమా సెట్స్ మీదకు వెళ్ళాలంటే ఇంకా చాలా సమయం పడుతుందట. ప్రస్తుతం ఆమె మెటర్నిటీ లీవ్ లో ఉన్నానని అభిమానులకు మరోసారి గుర్తు చేసింది.
View this post on Instagram