Bigg Boss Agnipariksha 2: ‘అగ్ని పరీక్ష 2’ లో ప్రతీ ఎపిసోడ్ లోనూ తన సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్న కంటెస్టెంట్ ఎవరు అంటే, మన అందరికీ గుర్తుకు వచ్చే మొట్టమొదటి పేరు రోహిత్ నాయుడు. ఆడిషన్స్ సమయం లో ఇతనేంటి ఇంత సైలెంట్ గా ఉన్నాడు, ‘బిగ్ బాస్’ కి వెళ్తే అక్కడి కంటెస్టెంట్స్ దాటికి తట్టుకోగలడా అనే అనుమానం అందరిలోనూ కలిగింది. అంతే కాదు జడ్జి బిందు మాధవి ఈయన ముఖం పై నీళ్లు కొట్టి , అతని రియాక్షన్ ఎలా ఉంటుందో టెస్ట్ చేసింది. కానీ అతని వైపు నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడం తో, బిందు మాధవి తో పాటు నవదీప్ కూడా రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు. అభిజిత్ కూడా రెడ్ ఫ్లాగ్ ఇచ్చి ఉండుంటే , ఈరోజు ఒక గొప్ప టాలెంట్ ఉన్న కంటెస్టెంట్ ని ‘బిగ్ బాస్ 10’ మిస్ అయ్యేది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే నేటి ఎపిసోడ్ లో కూడా రోహిత్ తన సత్తా చాటాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే నేటి ఎపిసోడ్ లో ఫైర్ కార్డు టాస్క్ ఒకటి ఏర్పాటు చేసేందుకు ‘బిగ్ బాస్ 5’ టైటిల్ విన్నర్ సన్నీ వచ్చాడు. స్టార్స్ వచ్చిన నలుగురు కంటెస్టెంట్స్ ని స్టేజి మీదకు పిలిచి నన్ను మీ టాలెంట్ తో 30 సెకండ్స్ పాటు ఆకర్షిస్తే కంటెండర్ ని చేస్తాను అని అంటాడు సన్నీ. అప్పుడు ఆ నలుగురు తమ టాలెంట్స్ ని చూపించగా, రోహిత్ డ్యాన్స్ చేస్తానని అంటాడు. ఆయనకు జోడీగా అపూర్వ ని కోరుతాడు. అపూర్వ ముందు టాస్క్ లో , నా కళ్ళలోకి కళ్ళు పెట్టి కూడా మాట్లాడలేవు నువ్వు అని అంటుంది. అందుకు సమాధానం గా రోహిత్ అపూర్వ కళ్ళల్లోకి చూస్తూ, నాన్ స్టాప్ గా రొమాంటిక్ డ్యాన్స్ వేస్తాడు. ఒక్కసారిగా అందరూ షాక్ కి గురై, రోహిత్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అనేలా అలా చూస్తుండిపోతారు.
శ్రీముఖి అయితే రోహిత్ లోని ఈ యాంగిల్ ని చూసి అతని బుగ్గలను గట్టిగా గిల్లేస్తుంది. ఇక సన్నీ షాలిని, రోహిత్ లను కంటెండర్స్ గా ఎంచుకుంటాడు. వీళ్లిద్దరికీ టవర్స్ టాస్క్ ని ఇస్తాడు సన్నీ. ఈ టాస్క్ లో రోహిత్ గెలిచి ‘ఫైర్ కార్డు’ ని గెలుచుకుంటాడు. ఆ తర్వాత ఆ కార్డుని తనకు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి ఇంత దూరం తీసుకొచ్చిన అభిజిత్ మోకాళ్ళ పై నిల్చొని ఇస్తాడు. ఈ సన్నివేశం ఎపిసోడ్ కి పెద్ద హైలైట్ అయ్యింది అనే చెప్పొచ్చు. అలా ఈ ఎపిసోడ్ కూడా రోహిత్ మోస్ట్ వేల్యూ ప్లేయర్ గా నిలిచి జడ్జీల మెప్పు పొందాడు.