Agni Pareeksha 2: ‘బిగ్ బాస్’ రియాలిటీ షో లో ఏది కూడా మనం అనుకున్నట్టుగా జరగదు. ఎవ్వరూ ఊహించనివే జరుగుతుంటాయి. ఒక కంటెస్టెంట్ ని చూసినప్పుడు మనకి ఒక అభిప్రాయం కలుగుతుంది. కానీ అదే అభిప్రాయం సందర్భాలను బట్టీ మారిపోతూ ఉంటాయి. ఉదాహరణకు గత ‘అగ్ని పరీక్ష’ సీజన్ లో శ్రీజ ఎంత హైలైట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆమ్మో, ఈమెతో తలపడలాంటే చాలా కష్టమే అని అనిపించుకుంది. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఎంత నెగెటివ్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సరిగ్గా ఈమెకు లాగానే కళ్యాణ్ పడాల , ప్రియా కూడా బాగా హైలైట్ అయ్యారు. కానీ వీళ్ళు కూడా మొదటి మూడు వారాల్లో బాగా నెగెటివ్ అయ్యారు. డేంజర్ జోన్ వరకు వచ్చారు. ప్రియా ఎలిమినేట్ అయ్యింది, ఆ తర్వాత కళ్యాణ్ అలెర్ట్ అయ్యి తన గేమ్ ని మొత్తం మార్చుకొని టైటిల్ విన్నర్ గా నిలిచాడు.
‘అగ్ని పరీక్ష 2’ లో కూడా ఇలాంటి సందర్భాలు ఎదురు అవుతున్నాయి. ఆడిషన్స్ లోకి వచ్చినప్పుడు రోహిత్ ని చూడగానే, ఇతను మెతకగా ఉన్నాడు, బిగ్ బాస్ కి పనికి రాడని అనుకున్నారు. ఇతన్ని ఆడిషన్స్ సమయం లో బిందు మాధవి ఎంత అవమానించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పిలిచి స్వీట్ తినిపించి మరీ ముఖం పై నీళ్లు చల్లింది. నీ తప్పు లేకుండా నీళ్లు చల్లాను, అయినప్పటికీ నీకు కోపం రాలేదు, నువ్వు నటిస్తున్నావు అంటూ బిందు మాధవి తో పాటు, నవదీప్ కూడా ఇతనికి రెడ్ ఫ్లాగ్ ఇస్తారు. బిందు మాధవి రోహిత్ ని అవమానించిన తీరుపై సోషల్ మీడియా లో ఆమెపై విపరీతమైన నెగెటివిటీ ఏర్పడింది. అయితే ఎవరైతే మనల్ని అవమానిస్తారో , మనం సాధించే విజయాల ద్వారా వాళ్ళతోనే జేజేలు కొట్టించుకుంటే ఆ కిక్ వేరే లెవెల్ లో ఉంటుంది కదా.
‘అగ్ని పరీక్ష 2’ లో రోహిత్ ని చూస్తే అదే ఫీలింగ్ మనకి కలుగుతుంది. ఒక్క అభిజిత్ మాత్రమే గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి ముందు రౌండ్స్ కి పంపిస్తాడు. అలా పంపినందుకు రోహిత్ ప్రతీ రోజు తన వైపు నుండి ది బెస్ట్ ఇస్తూ, తోపు కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నాడు. నేటి ఎపిసోడ్ లో కూడా టాస్కులు అద్భుతంగా ఆడి , బిందు మాధవి చేత శభాష్ అనిపించుకుని ఆమె చేతుల మీదుగా స్టార్ తోడించుకున్నాడు. అలా ‘అగ్ని పరీక్ష 2’ లో రెండు సార్లు స్టార్ ని సంపాదించిన ఏకైక కంటెస్టెంట్ గా రోహిత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంతటి ట్రాక్ రికార్డు ని సాధించిన రోహిత్ ‘బిగ్ బాస్ 10’ లోకి అడుగుపెట్టిన తర్వాత అదే ట్రాక్ రికార్డు ని కొనసాగిస్తాడా?, లేదంటే శ్రీజ లాగా అగ్నిపరీక్ష కే పరిమితం అవుతాడా అనేది చూడాలి.