Homeఎంటర్టైన్మెంట్Agni Pareeksha Season 2: అగ్ని పరీక్ష 2' లో ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ ని...

Agni Pareeksha Season 2: అగ్ని పరీక్ష 2′ లో ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ ని ‘గెట్ అవుట్’ అంటూ అరిచిన యాంకర్ శ్రీముఖి!

Agni Pareeksha Season 2: మరో 8 రోజుల్లో ‘బిగ్ బాస్ 10’ మొదలు కానుంది. ప్రేక్షకులు ఈ సీజన్ పై అంచనాలు ఏ రేంజ్ లో పెట్టుకున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత సీజన్ అందరి అంచనాలను తారుమారు చేస్తూ , ఊహించని బ్లాక్ బస్టర్ గా నిలవడం వల్లే, ఈ సీజన్ పై ఈ రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ‘అగ్నిపరీక్ష 2’ కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇందులోని సామాన్యులను […]

Agni Pareeksha Season 2: మరో 8 రోజుల్లో ‘బిగ్ బాస్ 10’ మొదలు కానుంది. ప్రేక్షకులు ఈ సీజన్ పై అంచనాలు ఏ రేంజ్ లో పెట్టుకున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత సీజన్ అందరి అంచనాలను తారుమారు చేస్తూ , ఊహించని బ్లాక్ బస్టర్ గా నిలవడం వల్లే, ఈ సీజన్ పై ఈ రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ‘అగ్నిపరీక్ష 2’ కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇందులోని సామాన్యులను చూస్తుంటే, ‘ఆమ్మో..ఇలా ఉన్నారేంటి.. వీళ్ళని సెలబ్రిటీలు తట్టుకోగలరా?, ఈ సీజన్ కూడా సెలబ్రిటీలు గెలవడం చాలా కష్టమే’ అని అనుకునే రేంజ్ లో ఉన్నారు. ముఖ్యంగా రోహిత్ , అమన్ లకు అయితే ఫ్యాన్ బేస్ మామూలు రేంజ్ లో లేదు అనే చెప్పాలి. అయితే నేటి ఎపిసోడ్ చాలా ఫైర్ మీద నడిచింది. ‘బిగ్ బాస్’ హౌస్ లో జరిగే గొడవలు, ఈ ఎపిసోడ్ లో భారీ రేంజ్ లో జరిగాయి.

ముఖ్యంగా ప్రియాంక, అమన్ లపై శ్రీముఖి అరిచిన తీరు పట్ల సోషల్ మీడియా లో నెగెటివిటీ ఏర్పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నేటి ఎపిసోడ్ లో ఇప్పటి వరకూ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయిన రామ కృష్ణ, ప్రియాంక, చరణ్ మరియు భాగీ లను స్టేజి మీదకు పిలిచి ‘మీరు ఎవరికంటే బెటర్ కంటెస్టెంట్ అనుకుంటున్నారు?’ అని అడుగుతుంది యాంకర్ శ్రీముఖి. ఆ సమయం లో ప్రియాంక ‘అమన్’ పేరు చెప్తుంది. కారణం అమన్ చాలా సేఫ్ గేమ్ ఆడుతాడని, ఫేక్ కంటెస్టెంట్ అని, తనకంటే నేను బెటర్ అంటూ చెప్పుకొచ్చింది. అప్పుడు అమన్ , ప్రతీ దాంట్లో నేను బెస్ట్ ఇస్తున్నాను, ఫైర్ కార్డు గెలుచుకున్నాను, మరో టాస్క్ లో టాప్ 2 లో వచ్చాను, నువ్వు ఇప్పటి వరకు ఏమి చేసావో చెప్పు అని అంటాడు అమన్. అప్పుడు ఇద్దరి మధ్య గొడవలు బాగా అవుతాయి.

ప్రియాంక వైపు సరైన పాయింట్స్ లేవు, ఏవేవో మాట్లాడుతూ ఉన్నింది. దీంతో సమయం వృధా అవుతుందని మధ్యలో శ్రీముఖి వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తుంది. కానీ వాళ్ళు ఆగకుండా వాదించుకుంటూ ఉండడం తో , వీళ్ళని బయటకి గెంటేస్తారా లేదా అని ‘అగ్ని పరీక్ష 2’ సిబ్బంది ని అడుగుతుంది శ్రీముఖి. ఆమెలో ఇంత ఫైర్ ని చూడగానే జడ్జీలు కూడా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అయితే ఈ అంశం లో శ్రీముఖి తప్పేమి లేదు , పిలిచి అవకాశం ఇస్తే, ప్రియాంక నిరూపించుకోలేకపోయింది, ఆమె వాదనలో బలం లేదు, అందుకే శ్రీముఖి కి చిరాకు వేసింది అంటూ కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper