Homeసినిమా వార్తలువకీల్ సాబ్ ఈవెంట్ అక్కడే.. పవన్ ఏమంటాడో ?

వకీల్ సాబ్ ఈవెంట్ అక్కడే.. పవన్ ఏమంటాడో ?

కరోనా ప్రవాహం మళ్ళీ రోజురోజుకూ దేశమంతా వ్యాపిస్తోంది. ఈ క్రమంలో కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. తెలంగాణలో కూడా ఇప్పుడు కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయని.. ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా పబ్లిక్ ఫంక్షన్లు, సభలు, సమావేశాల పై ఆంక్షలు విధిస్తూ వస్తోంది. దాంతో ‘వకీల్ సాబ్’ ఈవెంట్ ని భారీగా నిర్వహిద్దామనుకున్న దిల్ రాజ్ కి ఇప్పుడు ఏం చేయాలో అర్ధం కావడం లేదట. ఒకపక్క ఫ్యాన్స్ నుండి త్రీవ్ర ఒత్తిళ్లు. ఫంక్షన్ లో తేడా […]

Vakeel Saab
కరోనా ప్రవాహం మళ్ళీ రోజురోజుకూ దేశమంతా వ్యాపిస్తోంది. ఈ క్రమంలో కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. తెలంగాణలో కూడా ఇప్పుడు కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయని.. ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా పబ్లిక్ ఫంక్షన్లు, సభలు, సమావేశాల పై ఆంక్షలు విధిస్తూ వస్తోంది. దాంతో ‘వకీల్ సాబ్’ ఈవెంట్ ని భారీగా నిర్వహిద్దామనుకున్న దిల్ రాజ్ కి ఇప్పుడు ఏం చేయాలో అర్ధం కావడం లేదట. ఒకపక్క ఫ్యాన్స్ నుండి త్రీవ్ర ఒత్తిళ్లు. ఫంక్షన్ లో తేడా జరిగితే.. నీకు కలెక్షన్స్ ఎలా వస్తాయో చూస్తాం అంటూ పవన్ అభిమాన సంఘాల అధ్యక్షులే బాహాటంగానే శపధాలు చేస్తున్నారట.

నిజానికి దిల్ రాజుకు ఏప్రిల్ 3న యూసఫ్ గూడలోని స్టేడియంలో భారీ ఈవెంట్ చేయాలని లేదట. కేవలం పవన్ అభిమానుల కోసమే దిల్ రాజు ఆ ఈవెంట్ ను ప్లాన్ చేశాడు. ఇప్పుడు అది కూడా రద్దు అవ్వడంతో మరో భారీ ఈవెంట్ ను మరో చోట పెట్టాలని అడుగుతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. కానీ, భారీ ఈవెంట్ కి పర్మిషన్ ఇచ్చేందుకు హైదరాబాద్ పోలీస్ లు ఎట్టిపరిస్థితుల్లో సముఖంగా లేరు. ఇవ్వన్నీ అభిమానులకు అర్ధం కావు, అర్ధమయ్యేలా చెప్పినా వాళ్ళు వినరు. అందుకే సైలెంట్ గా దిల్ రాజు వేరే వెన్యూ కోసం ప్రయత్నిస్తున్నాడు.

శిల్పకళావేదికలో భారీ ఈవెంట్ పెట్టుకునే అవకాశం ఉన్నా.. అక్కడ కూడా భారీగా జనం రావడానికి పోలీసులు అంగీకరిస్తారా అనేది మరో డౌట్. ఎందుకు ఇదంతా రిస్క్.. అసలు ఈవెంట్ నే వేరే ఎక్కడైనా ఏర్పాటు చెయ్యాలని దిల్ రాజు బృందం అనుకుంటుందట. బీమవరం, విజయవాడ లాంటి చోట్ల ఈవెంట్ చేస్తే.. అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని టీమ్ ఆలోచిస్తోంది. అయితే ఈవెంట్ ఎక్కడ చేయాలనేది చివరకు పవనే నిర్ణయిస్తాడు. మరి విజయవాడలో చేయడానికి అంగీకారం తెలిపితే.. వకీల్ సాబ్ ఈవెంట్ విజయవాడలోనే ఉండనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper