
ఓ వైపు.. బెంగాల్‌లో పోరు హోరాహోరీగా నడుస్తోంది. ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకునేందుకు అన్ని పార్టీలూ సిద్ధమయ్యాయి. ఆ స్థాయిలో పోరాడుతున్నాయి కూడా. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ముఖాముఖి పోరు కనిపిస్తోంది. అయితే.. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అడ్రస్ ఇక్కడి ఎన్నికల్లో మచ్చుకైనా కనిపించడం లేదు. అక్కడ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకా గాంధీతోపాటు ఇతర సీనియర్ నేతలు మొహం చాటేశారు. ఇంతవరకు అక్కడికి ప్రచారానికి వెళ్లలేదు. ఓవైపు లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుని కూటమిగా పోటీ చేస్తూ బెంగాల్ ఎన్నికల ప్రచారానికి వీరు దూరంగా ఉండటం వెనుక ఓ ఆసక్తికర కారణం ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమబెంగాల్లో రెండో దశ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రేపు రెండోదశ పోలింగ్ జరగబోతోంది. రెండు దశల ఎన్నికల ప్రచారం ముగిసిపోయింది. అయితే.. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా మాత్రం ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కనిపించలేదు. మిగతా రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్న రాహుల్, ప్రియాంక, ఇతర కాంగ్రెస్ సీనియర్లు బెంగాల్ ప్రచారానికి మాత్రం మొహం చాటేశారు.
అయితే.. వీరు బెంగాల్‌కు ప్రచారానికి రాకపోవడానికి వివిధ కారణాలు వినిపిస్తున్నాయి. కేరళలో అధికారంలో ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ ఆధ్వర్వంలోని ఎల్డీఎఫ్ కూటమితో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమి తలపడుతోంది. వచ్చే నెల 6న అక్కడ ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ ఎల్టీఎఫ్‌ను మరోసారి అధికారంలోకి రానివ్వకుండా కాంగ్రెస్ ఆధ్వర్వంలోని యూడీఎఫ్ గట్టి పోటీ ఇస్తోంది. అయితే కేరళలో ఎల్‌డీఎఫ్ సర్కారుకు మరో అవకాశం దక్కవచ్చంటూ సర్వేలు చెబుతున్నాయి. అయినా.. యూడీఎఫ్ మాత్రం ఆశలు వదులుకోవడం లేదు. ఇక్కడ లెఫ్ట్ సర్కారుకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. విజయన్ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
కేరళలో ఎలాగైనా అధికారం చేపట్టాలని కాంగ్రెస్ ప్రధానంగా ఆ రాష్ట్రంపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే.. కాంగ్రెస్ పార్టీ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం లెఫ్ట్ కూటమితో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగింది. ఒకప్పుడు బెంగాల్‌ను అప్రతిహతంగా ఏలిన కమ్యూనిస్టులను నామమాత్రంగా మార్చేసిన మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఓవైపు, సిద్ధాంత పరంగా విభేదాలు ఉన్న బీజేపీతో మరోవైపు పోరాటం చేస్తున్న లెఫ్ట్‌తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ఇక్కడ చురుగ్గా ప్రచారం చేస్తోంది. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్, లెఫ్ట్ పార్టీలతో కూడిన కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి అగ్రనేతలు రాహల్, ప్రియాంకల ప్రచార భాగ్యం మాత్రం కలగడం లేదు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్