Viswanath and Sons : తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘విశ్వనాధ్ & సన్స్’ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో తెలుగు , తమిళ భాషల్లో విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. టీజర్ , ట్రైలర్ , పాటలు చూసి కచ్చితంగా ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవ్వుద్దని అంతా అనుకున్నారు. కానీ ఈ రేంజ్ లో బ్లాక్ బస్టర్ కంటెంట్ తో ఉంటుందని మాత్రం ఊహించలేదు. టాక్ బాగా రావడం తో ఓపెనింగ్స్ కూడా అదిరిపోతున్నాయి. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 20 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే అనేక సెంటర్స్ లో ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన సినిమాలకంటే బెటర్ కలెక్షన్స్ ని నమోదు చేసుకుంటున్నాయని అంటున్నారు. అయితే ఈ చిత్రాన్ని ఒక టాలీవుడ్ క్రేజీ స్టార్ చేతులారా మిస్ చేసుకున్నాడనే విషయం మీకు తెలుసా?..
ఆ స్టార్ హీరో మరెవరో కాదు , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ముందుగా ఈ సబ్జెక్టు ని వెంకీ అట్లూరి త్రివిక్రమ్ శ్రీనివాస్ కి చెప్పగానే , కళ్యాణ్ తో చేద్దామని త్రివిక్రమ్ అన్నాడట. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. ఆయన ఒకవేళ ఈ సినిమా ఒప్పుకొని ఉండుంటే , ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బదులుగా ఈ సినిమా విడుదల అయ్యుండేది. కానీ ఆ చిత్రానికి అడ్వాన్స్ తీసుకొని ఎన్నో ఏళ్ళు అవ్వడం తో ఎట్టి పరిస్థితిలోనూ ఆ సినిమాని పూర్తి చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు పవన్ కళ్యాణ్. అందుకే ఈ కథ ని పక్కన పెట్టి, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని పూర్తి చేసాడట. ఆ చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే చాలా అవమానకరమైన డిజాస్టర్ గా నిల్చింది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ చిత్రానికి బదులుగా ‘విశ్వనాథ్ & సన్స్’ ని చేసి ఉండుంటే , కచ్చితంగా పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ రేంజ్ ఇండస్ట్రీ హిట్ ని అందుకునేవాడని అంటున్నారు ఫ్యాన్స్. ఇది కచ్చితంగా పవన్ ఫ్యాన్స్ కి నిరాశే. వాస్తవానికి ముందుగా సూర్య తో ఒక బయోపిక్ చెయ్యాలని అనుకున్నాడట డైరెక్టర్ వెంకీ అట్లూరి. కానీ పవన్ కళ్యాణ్ ‘విశ్వనాథ్ & సన్స్’ కథ ని రిజెక్ట్ చేయడం తో, దాన్ని సూర్య తో చేశారు. మరి భవిష్యత్తులో అయినా పవన్ కళ్యాణ్ , వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సినిమా పడుతుందో లేదో చూడాలి.