Anna Konidela: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహించిన నాటి నుంచి పిఠాపురం నియోజకవర్గం తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చింది. వాస్తవానికి పిఠాపురంలో అతి పురాతనమైన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అవి ప్రాచీనమైనవి కూడా. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో గుర్తింపు పొందాయి కూడా. వాటిని దర్శించుకునేందుకు నిత్యం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. అయితే తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదల పిఠాపురంలోని పాదుగయా క్షేత్రాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు చేపట్టారు. గతంలో మెగా కుటుంబానికి చెందిన మహిళలు పలుమార్లు ఈ ఆలయానికి వచ్చారు. నాగబాబు భార్య గతంలో ప్రత్యేక పర్వదినాల్లో ఈ ఆలయాన్ని సందర్శించడమే కాదు.. మహిళలకు పెద్ద ఎత్తున చీరలు పంపిణీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
* ఎటువంటి ఆర్భాటం లేదు..
పవన్ భార్య అన్నా కొణిదల ఎటువంటి ఆర్భాటం లేకుండా ఈ ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం కట్టు బొట్టుతో హాజరయ్యారు. ఆమెను చూసేందుకు భక్తులతో పాటు స్థానికులు ఎంతగానో ఆసక్తి చూపారు. అందర్నీ నమస్కరిస్తూ పలకరించారు అన్నా కొణిదెల. ఆలయంలో మొక్కులు చెల్లించేందుకుగాను ఆమె వచ్చినట్లు తెలుస్తోంది. శ్రావణమాసం తొలి శుక్రవారం కావడంతో వ్రతం చేపడుతున్న ఆమె పూజలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఒక డిప్యూటీ సీఎం భార్య వస్తుందనగా ఎంతో హడావిడి ఉండాలి. కానీ ఎటువంటి ఆర్భాటం లేకుండా ఆమె పర్యటన సాగడం విశేషం.
* ప్రాచీన క్షేత్రం..
పిఠాపురంలోని పాదగయా క్షేత్రానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇది ఎంతో ప్రాచీనమైనది. శక్తి పీఠాల్లో ఒకటి. దక్షిణ కాశీగా కూడా పేరుగాంచింది. ఈ ఆలయ ప్రాంగణంలోనే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన.. పురుహూతిక అమ్మవారు కొలువై ఉన్నారు. ఏటా ప్రత్యేక పర్వదినాల్లో వేలాదిమంది భక్తులు వస్తుంటారు. శ్రావణమాసం ప్రారంభం కావడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. అయితే సంప్రదాయ వస్త్రధారణలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదల రావడం విశేషం. ఆమెను చూసేందుకు భక్తులు ఎంతగానో ఆసక్తి చూపారు. అందరితోనూ కలివిడిగా ఆమె కనిపించడం గమనార్హం. అస్సలు విదేశీ ప్రభావం ఆమెపై కనిపించడం లేదని అక్కడున్న వారు వ్యాఖ్యానించడం విశేషం.
View this post on Instagram