Homeబిజినెస్Poco X8 5G: కార్నింగ్ గొరిల్లా గ్లాస్..6.83 అంగుళాల డిస్ ప్లే. ఇంకా చాలా ఉన్నాయి...

Poco X8 5G: కార్నింగ్ గొరిల్లా గ్లాస్..6.83 అంగుళాల డిస్ ప్లే. ఇంకా చాలా ఉన్నాయి ఇందులో..

Poco X8 5G: మీడియం రేంజ్ ధరల్లో స్మార్ట్ ఫోన్ వాడే వాళ్లకు పోకో కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కంపెనీ జనరేషన్ జెడ్ ను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని ఫోన్లను తయారు చేస్తూ ఉంటుంది. తాజాగా భారత మార్కెట్లో మరోసారి తన వాటాను మరింత పరిపుష్టం చేసుకోవడానికి POCO X8 5G, POCO X8 power 5G ఫోన్లను విడుదల చేసింది. అత్యంత దృఢమైన ఫ్రేమ్.. పవర్ బ్యాంక్.. ఎక్కువసేపు మన్నగలిగే […]

Poco X8 5G: మీడియం రేంజ్ ధరల్లో స్మార్ట్ ఫోన్ వాడే వాళ్లకు పోకో కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కంపెనీ జనరేషన్ జెడ్ ను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని ఫోన్లను తయారు చేస్తూ ఉంటుంది. తాజాగా భారత మార్కెట్లో మరోసారి తన వాటాను మరింత పరిపుష్టం చేసుకోవడానికి POCO X8 5G, POCO X8 power 5G ఫోన్లను విడుదల చేసింది.

అత్యంత దృఢమైన ఫ్రేమ్.. పవర్ బ్యాంక్.. ఎక్కువసేపు మన్నగలిగే బ్యాటరీతో ఈ రెండు కేటగిరీల ఫోన్లు మార్కెట్లోకి వచ్చేసాయి. ఇందులో కార్నింగ్ గొరిల్లా విక్టస్ గ్లాస్ ఏర్పాటు చేశారు. 6.83 అంగుళాల పరిమాణంలో దీనిని రూపొందించారు. 1.5 కే 120 హెచ్ జెడ్ అమోలెడ్ డిస్ ప్లే తో పాటుగా దుమ్ము ధూళి.. నీటి నిరోధించడానికి అసాధారణమైన ఐపీ 69కే రేటింగ్ ఇందులో ఉంది.

బ్యాటరీ పరంగా చూసుకుంటే ఇందులో అత్యాధునిక సిలికాన్ కార్బన్ మెటీరియల్ ఉపయోగించారు. ఫలితంగా ఫోన్ బరువు నిర్ణీత స్థాయిలోనే ఉండి. 9000 mAh, 10,000 mAh సామర్థ్యాలతో ఈ బ్యాటరీలను రూపొందించారు.

ఈ రెండు మోడల్స్ లో 67 W వైర్డ్/ 22.5 W రివర్స్ వైర్డ్, 100 W వైర్డ్/ 27 W రివర్స్ వైర్డ్ చార్జింగ్ సదుపాయాన్ని కల్పించారు.

క్వాల్కం స్నాప్ డ్రాగన్ 6 ఎస్ జన్ 4, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 6 జన్ ఎస్ ప్రాసెసర్ లను ఏర్పాటు చేశారు

నిల్వ సాంకేతికత విషయంలో యు ఎఫ్ ఎస్ 2.2/ యు ఎఫ్ ఎస్ స్టోరేజ్ వేరియంట్.. హై స్పీడ్ ఎల్పిడి డిఆర్ ఫై ఎక్స్ రామ్+ యు ఎఫ్ ఎస్ 4.1 ను ఇందులో ఏర్పాటు చేశారు.

50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా.. 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా.. 8 మెగాపిక్సల్ ఆల్ట్రా వైడ్ వంటి కెమెరాలను ఇందులో ఏర్పాటు చేశారు.

ఫ్రంట్ కెమెరా ఇందులో 16 మెగాపిక్సల్ సామర్థ్యంతో ఉంది. దీని ద్వారా సెల్ఫీలు తీసుకోవచ్చు. ఎక్స్ 8 పవర్ 5జి మోడల్ లో 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఏర్పాటు చేశారు.

సాఫ్ట్వేర్ పరంగా xiaomi hyperbola 3 Android 16, xiaomi hyper os3 Android 16 ను ఏర్పాటు చేశారు. ఇది నాలుగు సంవత్సరాల ఓఎస్.. ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అందిస్తుంది.

ఈ రెండు మోడల్స్ ప్రామాణిక ధర 29,999, 35,999 గా కంపెనీ నిర్ణయించింది.

ప్రారంభ తగ్గింపుగా ఫ్లిప్కార్ట్ ఇండియాలో జరిగే సేల్ సమయంలో కొనుగోలు ధరలు తక్షణమే రెండువేల కూపన్ తగ్గింపుతో పాటు 1000 రూపాయల బ్యాంకు ఎక్స్చేంజ్ బోనస్ సొంతం చేసుకోవచ్చు.

సెప్టెంబర్ 11 నుంచి భారత మార్కెట్లో ఈ ఫోన్లు అందుబాటులోకి వస్తాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper