YS Sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఆమె కుమార్తె అంజలి రెడ్డికి వివాహం కుదిరింది.
షర్మిల.. అనిల్ దంపతులకు కుమారుడు, కుమార్తె సంతానం. కుమారుడి పేరు రాజారెడ్డి. ఇతనికి కొద్దిరోజుల క్రితం రాజస్థాన్ లోని జోధ్ పూర్ ప్రాంతంలోని విలాసవంతమైన భవనంలో చట్నీస్ రెస్టారెంట్ అధినేత మనవరాలితో వివాహం జరిగింది. ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత రిసెప్షన్ వేడుక హైదరాబాద్లో నిర్వహించారు.
నాడు రాజారెడ్డి నిశ్చయ తాంబూలాల కార్యక్రమానికి ముఖ్యమంత్రి హోదాలో షర్మిల సోదరుడు జగన్ హాజరయ్యారు. ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఆ సమయంలో జగన్ వెంట భారతి కూడా ఉన్నారు . నాడు జగన్ వివాహానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు షర్మిల.. జగన్ మధ్య విభేదాలు ఉండేవి. ఈ వివాహానికి హాజరు కాకపోవడంతో ఆ వివాదాలు మరింత పెరిగిపోయాయి. తద్వారా రాజకీయంగా.. కుటుంబ బంధాలపరంగా జగన్.. షర్మిల మధ్య దూరం విపరీతంగా పెరిగిపోయింది.
ఇప్పుడు షర్మిల కూతురు అంజలి రెడ్డికి వివాహం కుదిరింది. ఈ విషయాన్ని షర్మిల సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సోమల సుబ్బారెడ్డి.. పద్మా రెడ్డి కుమారుడు డాక్టర్ రఘురాం రెడ్డి తో ఆమె వివాహం జరగబోతోంది. వీరిది కర్నూలు జిల్లా.. వీరు అమెరికాలో స్థిరపడ్డారు. అయితే అంజలి, రఘురాం ది ప్రేమ వివాహమా.. పెద్దలు కుదిరించిన వివాహమా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఇటీవల షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. శస్త్ర చికిత్స చేయించుకున్నారు. కొద్దిరోజులపాటు ఆసుపత్రికి పరిమితమయ్యారు. ఆ తర్వాత విశ్రాంతి తీసుకుని.. తన రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించారు. అప్పట్లో ఆమెకు పార్లమెంట్ సీట్ గ్యారెంటీ అని వార్తలు వచ్చాయి . కర్ణాటక నుంచి ఆమెను రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం కూడా జరిగింది. కాని చివరి నిమిషంలో ఆ అవకాశం వేరే వాళ్లకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చింది. మొదట్లో షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేశారు. . ప్రస్తుతం ఆమె ఏపీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.
ఈ అంజలి.. రఘురాం వివాహాన్ని ఇక్కడ జరుపుతారా.. అమెరికాలో జరుపుతారా అనేది తెలియాల్సి ఉంది. రాజారెడ్డి వివాహాన్ని రాజస్థాన్లోని జోధ్పూర్ ప్రాంతంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ ప్రకారం చూసుకుంటే అంజలి వివాహం కూడా అక్కడే జరుపుతారని వార్తలు వస్తున్నాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి.. షర్మిల కి రాజకీయంగా బంధువులు.. అభిమానులు.. శ్రేయోభిలాషులు చాలామంది ఉన్నారు. వారందరి కోసం హైదరాబాద్ నగరంలో రిసెప్షన్ నిర్వహిస్తారని తెలుస్తోంది.
My husband, Anil Kumar, and I are very grateful to God and delighted to share the wonderful news that our daughter, Y.S. Anjili Reddy’s marriage has been arranged with Dr. Somala Raghuram Reddy, son of Sri Somala Subba Reddy and Smt. Somala Padma Reddy.
All members of their… pic.twitter.com/50NEQkqT08— YS Sharmila (@realyssharmila) September 6, 2026