Tirumala Donations: ప్రతిరోజు కళ్యాణం జరుగుతూ ఉంటుంది. పచ్చ తోరణం నిత్యం కనిపిస్తూ ఉంటుంది. వేద మంత్రాలు.. సుగంధ ద్రవ్యాలు.. పునుగు పిల్లి తైలం.. ఇలా చెప్పుకుంటూ పోతే తిరుమల తిరుపతి శ్రీవారికి ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలు బ్రహ్మాండంగా జరుగుతుంటాయి. ఆ స్వామివారిని పూజించడానికి.. దర్శించడానికి.. వేలాది మంది భక్తులు నిత్యం వస్తూ ఉంటారు. స్వామివారికి భక్తులు విరాళాలు భారీగా ఇస్తూ ఉంటారు. అయితే తాజాగా ఒక ప్రవాస భారతీయుడు స్వామివారికి 121 కిలోల స్వర్ణభరణాల సెట్ ను కానుకగా ఇస్తున్నారు. వాస్తవానికి శ్రీవారి దగ్గర దాదాపు 650 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. అయితే స్వామివారికి స్వర్ణ ఆభరణాలు భక్తులు ఇవ్వడం కొత్త కాదు. ఈ సాంప్రదాయం ఆకాశరాజు నుంచి కొనసాగుతూనే ఉంది.
పురాణ కథనాల ప్రకారం శ్రీనివాసుడికి ముందుగా ఆకాశరాజు బంగారం కిరీటం చేయించారు. ఆ తర్వాత 12వ దశాబ్దం వరకు స్వర్ణాభరణాలు.. వస్తువులు దఫాల వారీగా స్వామివారికి అందాయి. ఆ వివరాలు ఎక్కడ కూడా నమోదు కాలేదు. అయితే పని ఉండవ దశాబ్దం నుంచి స్వర్ణాభరణాలు భారీగా అందినట్టు తెలుస్తోంది .
బ్రిటిష్ పరిపాలన కాలంలో చిత్తూరు కలెక్టర్ గా థామస్ మన్రో పనిచేశారు. నాడు ఆయన పెద్ద గంగాలాన్ని కానుకగా ఇచ్చారు.
మొగల్ పరిపాలన కాలంలో చక్రవర్తులుగా పనిచేసిన అక్బర్.. జహంగీర్ వంటి వారి ముద్రలతో ఐదు వేల కాయిన్స్ తో ఉన్న దండతోపాటు.. కింగ్ జార్జ్.. విక్టోరియా రాణి చిత్రం ఉన్న 492 కాయిన్స్ తో హారాలు స్వామీజీకి కానుకగా ఇచ్చారు.
శ్రీ వెంకటేశ్వర హేచరీస్ సంస్థ 13 కిలోల కిరీటాన్ని.. సంజీవ్ గోయంక పది కిలోల బంగారు కెరటాని స్వామి వారికి అందించారు.
స్వామివారికి నిర్వహించే సహస్ర కళాశాభిషేకంలో ఉపయోగించే 128 బంగారు పుష్పాలను గుంటూరు జిల్లా చెందిన షేక్ హుస్సేన్ సాహెబ్ అనే భక్తుడు సమర్పించారు.
రత్నాల కంటి.. వరద హస్తాలు.. 7 కిలోల మకర కంటి.. బంగారు వస్త్రాలు.. స్వామీజీకి కానుకగా అందించారు.
2009లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి దాదాపు 42 కోట్లు విలువచేసే ఒక వజ్రాల కిరీటాన్ని స్వామి వారికి అందించారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వం తరఫున 5.2 కోట్ల విలువైన 19.072 కిలోల బరువు ఉన్న రెండు సువర్ణ ఆభరణాలను అందించారు.
అమెరికాలో నివాసం ఉంటున్న రామలింగరాజు ఇచ్చిన విరాళంతో 11 కోట్ల ఖర్చుతో నూతన సహస్రనామ కాసుల బంగారు హారాన్ని సీఎం చంద్రబాబు తన చేతుల మీదుగా స్వామి వారికి అందించారు.
లలిత్ బాసిన్ అనే భక్తుడు గంగాళం.. పాత్రలను స్వామివారికి అందించారు.
మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి 20 కిలోల మూలవర్ల బంగారు పీతాంబరాలను స్వామివారికి అందించారు.
2003లో 108 బంగారు పుష్పలను లలిత జ్యువెలరీస్ అధినేత కిరణ్ అందించారు.
2021లో ఎం అండ్ సి ప్రాపర్టీస్ సంస్థ 3.604 కేజీల బంగారు బిస్కెట్లను విరాళంగా అందించింది. ఒక అజ్ఞాత భక్తుడు అదే ఏడాది 5.3 కిలోల బంగారు బరువైన కటి.. వరద హస్తాలను అందించారు.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన తంగ దురై అనే భక్తుడు అనేక పర్యాయాలు స్వామి వారికి బంగారు ఆభరణాలను అందించారు.
2025 మే నెలలో సంజీవ్ గోయంక బంగారు కటి.. వరద హస్తాలను స్వామివారికి కానుకగా అందించారు.