Homeబిజినెస్Motorola signature 27: అదిరిపోయే డిజైన్.. ఇంకా ఎన్నో ఫీచర్లు..

Motorola signature 27: అదిరిపోయే డిజైన్.. ఇంకా ఎన్నో ఫీచర్లు..

Motorola signature 27: స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మోటరోలా.. ఇప్పుడు ప్రీమియం ఫ్లాగ్ షిప్ సెగ్మెంట్ మీద మరింత దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా సరికొత్త Motorola signature 27 స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అత్యంత ఆధునికమైన ప్రాసెసర్, భారీ కెమెరా సెన్సార్, సరికొత్త డిస్ ప్లే టెక్నాలజీ తో ఈ ఫోన్ టెక్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ ఫోన్.. […]

Motorola signature 27: స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మోటరోలా.. ఇప్పుడు ప్రీమియం ఫ్లాగ్ షిప్ సెగ్మెంట్ మీద మరింత దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా సరికొత్త Motorola signature 27 స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అత్యంత ఆధునికమైన ప్రాసెసర్, భారీ కెమెరా సెన్సార్, సరికొత్త డిస్ ప్లే టెక్నాలజీ తో ఈ ఫోన్ టెక్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ ఫోన్.. మనదేశంలో ఈ నెలలో విడుదల కాబోతోంది. ఇటీవల ఈ ఫోన్ కు సంబంధించిన హాండ్స్ ఆన్ వివరాలు బయటకు వచ్చాయి. దీంతో దీని ఫీచర్ల మీద ఆసక్తి పెరిగింది.

డిస్ ప్లే లో సరికొత్త టెక్నాలజీ

Motorola signature 27 లో 6.78 అంగుళాల Tandem o LED LTPO డిస్ ప్లే ను అందించినట్టు హాండ్స్ ఆన్ వివరాల ద్వారా తెలుస్తోంది. 120 హెచ్ జెడ్ రీ ప్రెష్ రేట్ తో ఈ ఫోన్ పని చేస్తుంది. స్క్రీన్ గరిష్టంగా 12000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ అందిస్తుంది.. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా దీనికి ఉంటుంది. ఎండల కూడా స్క్రీన్ మీద కంటెంట్ స్పష్టంగా కనిపించే విధంగా డిస్ ప్లే ఉపయోగపడుతుంది.

ఈ ఫోన్లో కెమెరాకు మోటరోలా ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. 50 మెగాపిక్సల్ సోనీ ఎల్ వై టి ఐ ఏ 910 ప్రైమరీ కెమెరా ఇందులో ఉంది. 200 మెగాపిక్సల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఇందులో ఉంది. 50 మెగాపిక్సల్ ఆల్ట్రా వైట్ కెమెరా.. 50 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఇందులో ఉన్నాయి. 200 మెగాపిక్సల్ పెరిస్కోప్ కెమెరా.. 100 ఎక్స్ డిజిటల్ జూమ్ సదుపాయం ఇందులో ఉంది. ప్రత్యేకమైన మోషన్ సెన్సార్ ద్వారా వేగంగా కదిలే వస్తువులను కూడా స్పష్టంగా ఫోటోలు తీయవచ్చు.8 కే రిజల్యూషన్ ద్వారా వీడియోలను రికార్డ్ చేయవచ్చు. ఏఐ ఆధారిత వీడియో enhancement engine వీడియోలలో రంగులను.. నాణ్యతను మెరుగుపరుస్తుంది.

పనితీరు విషయంలో ఈ ఫోన్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇందులో qualcomm Snapdragon 8 Elite extreme Gen 6 processor ఉంది. ఇది 2nm టెక్నాలజీతో రూపొందిన చిప్ సెట్. గరిష్టంగా 16 జిబి LPDDR5X ర్యామ్, 1 టీవీ యు ఎఫ్ ఎస్ 4.1 స్టోరేజ్ వేరియంట్ అందుబాటులో ఉంది..

భారీగా గేమ్స్ ఆడే సమయంలో.. వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు actic mesh పోలింగ్ సిస్టం ఇందులో ఉంది. ఇందులో డైమండ్ ఇన్ఫ్యూజ్డ్ థర్మల్ జెల్.. లిక్విడ్ మెటల్.. కాపర్ మెష్.. 3d వేపర్ చాంబర్ టెక్నాలజీ ఉపయోగించారు…

ఈ ఫోన్లో 7000 ఎం ఏ హెచ్ భారీ బ్యాటరీ ఉంది. దీనికి 90 డబ్ల్యూ వైరడ్ చార్జింగ్.. 50 డబ్ల్యు వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. రోజు మొత్తం స్మార్ట్ ఫోన్ ఉపయోగించేవారికి ఈ బ్యాటరీ ఉదయకరంగా ఉంటుంది. ఐపీ 68.. ఐపీ సిక్స్టీ నైన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్స్ కూడా ఉన్నాయి.

Motorola signature 27 లో మరో ప్రత్యేకమైన అంశం ఏమిటంటే Bang&Olufsen(B&O) ఆడియో టెక్నాలజీ. మోటరోలా ఫోన్లో తొలిసారిగా ఈ సంస్థ ఆడియో టెక్నాలజీని అందిస్తోంది. ప్రీమియం ఆడియో అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ భాగస్వామ్యం జరిగింది. ఫోన్ డిజైన్లలో అల్యూమినియం ఫ్రేమ్, ప్రత్యేకమైన బ్యాక్ ప్యానెల్ ఫినిషింగ్ ఆకట్టుకుంటున్నాయి.

Motorola signature 27 ను నవంబర్ ఐదు న ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేశారు. భారతదేశంలోనూ నవంబర్ నెలలో విడుదల చేయబోతున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే కచ్చితంగా లాంచ్ తేదీ.. ధర వివరాలను ఇంకా బయటపెట్టలేదు. ఈ ఫోన్ రెండు ఆకర్షణ ఏమైనా రంగుల్లో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఏడు సంవత్సరాల వరకు ఆపరేటింగ్ సిస్టం అప్డేట్స్ అందిస్తామని మోటరోలా ఇప్పటికే ప్రకటించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper