Vrushakarma Trailer: ‘తండేల్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత అక్కినేని నాగ చైతన్య హీరో గా నటించిన చిత్రం ‘వృష కర్మ’. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దందు దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. సాధారణంగా హారర్ థ్రిల్లర్ జానర్ సినిమాలు అంటేనే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. అలాంటిది ‘విరూపాక్ష’ లాంటి సాలిండ్ హారర్ థ్రిల్లర్ ని తెరకెక్కించిన డైరెక్టర్ నుండి వస్తున్న సినిమా అంటే, ఆ మాత్రం హైప్, క్రేజ్ ఉండడం లో ఆశ్చర్యం లేదు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం వచ్చే నెల 4 న విడుదల అవ్వబోతున్న సందర్భంగా, మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తవ్వకాల్లో బయటపడ్డ 500 ఏళ్ళ క్రితం గుహలో, కొన్ని అనూహ్యమైన వస్తువులు, ఆభరణాలు దొరుకుతాయి. అదే గుహ నుండి ఒక అతీంద్రియ శక్తి బయటకు వస్తుంది. ఆ శక్తి వల్ల మానవ జాతి మనుగడకే ప్రమాదం. దీన్ని హీరో ఎలా అడ్డుకున్నాడు అనేదే సినిమా స్టోరీ గా ఈ ట్రైలర్ లో చూపించారు. విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అంత గొప్పగా అనిపించలేదు కానీ, థియేటర్స్ లో మాత్రం కచ్చితంగా మంచి అనుభూతిని కలిగించేలా ఉంటాయని తెలుస్తోంది. నాగ చైతన్య క్యారెక్టర్ కంటే విలన్ క్యారెక్టర్ ని ఎక్కువగా డైరెక్టర్ హైలైట్ చేసాడేమో అనే ఫీలింగ్ కూడా కలిగింది. ఓవరాల్ గా హారర్ థ్రిల్లర్ జానర్ లో ఈసారి కొత్త ప్రయోగం చేసినట్టుగా అనిపించింది. మరి దీన్ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. మరి ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది?,విరూపాక్ష రేంజ్ లో ఆడియన్స్ కి సరికొత్త అనుభూతిని ఇస్తుందని అనుకుంటున్నారా?, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఓకే తెలుగు ని ఫాలో అవ్వండి.