Homeబిజినెస్iQOO Z12 Lite 5G : 8,000mAh బ్యాటరీతో iQOO కొత్త స్మార్ట్‌ఫోన్.. Z12 Lite...

iQOO Z12 Lite 5G : 8,000mAh బ్యాటరీతో iQOO కొత్త స్మార్ట్‌ఫోన్.. Z12 Lite 5G స్పెసిఫికేషన్లు లీక్!

iQOO Z12 Lite 5G : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐక్యూ (iQOO) మరో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే వార్తల్లో నిలుస్తున్న iQOO Z12 Lite 5Gకు సంబంధించి తాజాగా కీలక స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. ముఖ్యంగా ఈ ఫోన్‌లో ఏకంగా 8,000mAh భారీ బ్యాటరీని అందించనున్నట్లు సమాచారం. దీంతో పాటు మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్‌ను ఇందులో ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ […]

iQOO Z12 Lite 5G : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐక్యూ (iQOO) మరో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే వార్తల్లో నిలుస్తున్న iQOO Z12 Lite 5Gకు సంబంధించి తాజాగా కీలక స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. ముఖ్యంగా ఈ ఫోన్‌లో ఏకంగా 8,000mAh భారీ బ్యాటరీని అందించనున్నట్లు సమాచారం. దీంతో పాటు మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్‌ను ఇందులో ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ఫోన్ కొన్ని మార్కెట్లలో iQOO Z12 SE 5G పేరుతో కూడా విడుదలయ్యే అవకాశం ఉందని టిప్‌స్టర్లు వెల్లడిస్తున్నారు.

iQOO Z12 Lite 5G స్పెసిఫికేషన్లు ఇవేనా?

PassionateGeekz.comకు చెందిన టిప్‌స్టర్ (@passionategkeez) ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన వివరాలను తాజాగా వెల్లడించారు. లీక్ ప్రకారం.. I2603 మోడల్ నంబర్‌తో రానున్న ఈ ఫోన్ 4nm టెక్నాలజీతో తయారైన MediaTek Dimensity 7400 Turbo చిప్‌సెట్‌తో పనిచేయనుంది. రోజువారీ వినియోగంతో పాటు గేమింగ్, మల్టీటాస్కింగ్ వంటి పనులకు ఈ ప్రాసెసర్ మెరుగైన పనితీరును అందించే అవకాశం ఉంది.

ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణగా 8,000mAh బ్యాటరీ ఉండనుంది. దీనికి 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం. సాధారణంగా స్మార్ట్‌ఫోన్లలో 5,000mAh నుంచి 6,500mAh వరకు బ్యాటరీలు అందుబాటులో ఉంటుండగా.. 8,000mAh బ్యాటరీతో వస్తే ఎక్కువ సమయం ఫోన్ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తరచూ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇష్టపడని వినియోగదారులకు ఇది ఉపయోగకరంగా ఉండవచ్చు.

స్టోరేజ్ విషయానికి వస్తే గరిష్ఠంగా 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందించే అవకాశం ఉంది. ఇక సాఫ్ట్‌వేర్ పరంగా Android 16 ఆధారిత OriginOS 6 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పనిచేయనున్నట్లు లీకులు సూచిస్తున్నాయి.

120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే.. 50MP కెమెరా!

గతంలో వచ్చిన నివేదికల ప్రకారం.. iQOO Z12 Lite 5Gలో 6.77 అంగుళాల డిస్‌ప్లే ఉండనుంది. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో స్క్రోలింగ్, వీడియోలు చూడటం, గేమింగ్ సమయంలో స్మూత్ అనుభూతి లభించవచ్చు.

కెమెరాల విషయానికి వస్తే వెనుకవైపు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉండనున్నట్లు గత లీకులు వెల్లడించాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ఇవే కెమెరా స్పెసిఫికేషన్లు iQOO Z12 SE 5G వేరియంట్‌కు కూడా వర్తిస్తాయా? లేదా? అన్నది ఇంకా స్పష్టత లేదు.

త్వరలోనే మార్కెట్లోకి.. ఎప్పుడంటే?

ఈ ఫోన్ మోడల్ నంబర్ I2603 ఇప్పటికే పలు ధ్రువీకరణ, డేటాబేస్ వెబ్‌సైట్లలో కనిపించింది. తొలుత IMEI డేటాబేస్‌లో దర్శనమివ్వగా.. ఆ తర్వాత Bluetooth SIG సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో iQOO Z12 Lite 5G పేరుతో నమోదైంది. అయితే ఈ జాబితాల్లో ఫోన్ స్పెసిఫికేషన్లు వెల్లడించలేదు. తాజాగా వచ్చిన లీకులు మాత్రం ఈ ఫోన్‌పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. త్వరలోనే మార్కెట్లోకి రానుందని టిప్‌స్టర్ చెబుతున్నప్పటికీ.. కచ్చితమైన లాంచ్ తేదీ, ధర, ఏయే దేశాల్లో విడుదల చేస్తారనే వివరాలు ఇంకా వెల్లడించలేదు.

iQOO Z11 Lite 5Gకి వారసుడిగా..

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న iQOO Z11 Lite 5Gకి తర్వాతి మోడల్‌గా Z12 Lite 5G అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. iQOO Z11 Lite 5G ఈ ఏడాది జూలైలో భారత మార్కెట్లో విడుదలైంది. తొలుత 4GB RAM + 128GB స్టోరేజ్, 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్‌ను కూడా తీసుకొచ్చారు. దీని ధర అమెజాన్‌లో రూ.19,499గా ఉంది.

పాత మోడల్‌లో MediaTek Dimensity 6300 ప్రాసెసర్, 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఫొటోగ్రఫీ కోసం 50 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. అలాగే 6,500mAh బ్యాటరీతో పాటు 44W ఛార్జింగ్ సపోర్ట్ అందించారు.

ఇక కొత్త iQOO Z12 Lite 5Gలో 8,000mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌సెట్ వంటి అప్‌గ్రేడ్లు నిజమైతే.. బడ్జెట్, మిడ్‌రేంజ్ 5G స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఈ ఫోన్‌కు మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది. అయితే కంపెనీ అధికారికంగా ప్రకటించే వరకు ఈ వివరాలన్నింటినీ లీకులుగానే పరిగణించాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper