Homeఆంధ్రప్రదేశ్‌Amaravati Quantum Valley: చంద్రబాబు సంకల్పం.. అమరావతి క్వాంటం క్యాపిటల్.. ఏం చేస్తున్నారో తెలుసా..

Amaravati Quantum Valley: చంద్రబాబు సంకల్పం.. అమరావతి క్వాంటం క్యాపిటల్.. ఏం చేస్తున్నారో తెలుసా..

Amaravati Quantum Valley: ఒకప్పుడు కంప్యూటర్ టెక్నాలజీ ప్రపంచాన్ని మొత్తం మార్చేసింది. ఆ తర్వాత ఇంటర్నెట్.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కొత్త విప్లవానికి నాంది పలికాయి. ఇప్పుడు ప్రపంచం మరో కీలకమైన సాంకేతికతను అందిపుచ్చుకోబోతోంది. మార్పు దిశగా అడుగులు వేస్తోంది. దాని పేరే క్వాంటం కంప్యూటింగ్ (Quantum computing). సాదరణ కంప్యూటర్లతో పరిష్కరించడానికి కొన్ని క్లిష్టమైన సమస్యలకు చాలా సమయం పడుతుంది. కానీ క్వాంటం కంప్యూటర్లు వేగంగా సమస్యను పరిష్కరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇలాంటి అత్యధిక సాంకేతికతలో […]

Amaravati Quantum Valley: ఒకప్పుడు కంప్యూటర్ టెక్నాలజీ ప్రపంచాన్ని మొత్తం మార్చేసింది. ఆ తర్వాత ఇంటర్నెట్.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కొత్త విప్లవానికి నాంది పలికాయి. ఇప్పుడు ప్రపంచం మరో కీలకమైన సాంకేతికతను అందిపుచ్చుకోబోతోంది. మార్పు దిశగా అడుగులు వేస్తోంది. దాని పేరే క్వాంటం కంప్యూటింగ్ (Quantum computing).

సాదరణ కంప్యూటర్లతో పరిష్కరించడానికి కొన్ని క్లిష్టమైన సమస్యలకు చాలా సమయం పడుతుంది. కానీ క్వాంటం కంప్యూటర్లు వేగంగా సమస్యను పరిష్కరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇలాంటి అత్యధిక సాంకేతికతలో ఏపీ రాజధాని అమరావతి క్యాపిటల్ గా అవతరించడానికి అడుగులు వేస్తోంది. అమరావతిని క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ నగరాన్ని ఐటి కి కేరాఫ్ అడ్రస్ లాగా మార్చారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ ఒక గుండెకాయ లాగా నిలిచింది. ఐటీ ద్వారా సింహభాగం ఆదాయం అటు కేంద్రానికి.. ఇటు రాష్ట్రానికి వస్తోంది. చంద్రబాబు దూర దృష్టి అలా ఉంటుంది కాబట్టి హైదరాబాదులో ఆయన ఏర్పాటు చేసిన ఐటీ సంస్థలు భారీగా పన్ను ఆదాయాలను ప్రభుత్వాలకు అందిస్తున్నాయి.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని క్వాంటం టెక్నాలజీకి కేంద్రంగా మార్చడానికి చంద్రబాబు అమరావతి క్వాంటం వ్యాలీ(Amravati Quantum valley) అనే ప్రాజెక్టును చేపడుతున్నారు. దీనికోసం ఐబీఎం (IBM), టిసిఎస్ (Tata consultancy services), ఎల్ అండ్ టి (L&T) వంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. గత ఏడాది మే రెండవ తేదీన ఈ సంస్థలతో క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ ఏర్పాటు సంబంధించిన ప్రణాళికలను ప్రకటించారు. ఇందులో ఐబిఎం క్వాంటం సిస్టం టూ, 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్ ను ఏర్పాటు చేయాలి అనేది ప్రధాన లక్ష్యం. ఈ కంప్యూటర్ వ్యవస్థను పరిశోధకులు.. శాస్త్రవేత్తలు.. విద్యాసంస్థలకు అందుబాటులోకి తీసుకురావాలనే ప్రణాళికను రూపొందించారు.

క్వాంటం కంప్యూటింగ్ అంటే

సాదరణ కంప్యూటర్లు బిట్స్ ఆధారంగా పనిచేస్తాయి. వీటిలో ఒక బిట్ జీరో లేదా ఒకటి అనే రెండు స్థితులలో ఉంటుంది కానీ క్వాంటం కంప్యూటర్లు క్యూబిట్స్ ఆధారంగా పనిచేస్తాయి. క్వాంటం మెకానిక్స్ లోని సూపర్ పొజిషన్.. ఏంటి యాంగిల్ మెంట్ వంటి సూత్రాలను ఉపయోగించి ఇవి లెక్కలను నిర్వహిస్తాయి అందువల్ల కొన్ని ప్రత్యేకమైన క్లిష్ట సమస్యలను సాంప్రదాయ కంప్యూటర్ల కంటే సమర్థవంతంగా పరిష్కరిస్తాయి.

క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణం కోసం ఇప్పటికే ఇన్స్టాల్ పనులు మొదలయ్యాయి. ఈ సెంటర్లో 150 క్యూబిట్స్ కంప్యూటర్ ను ఇన్స్టాల్ చేస్తారు. దీనికోసం అమెరికా నుంచి 120 క్యూబ్ బిట్స్ క్వాంటం కంప్యూటర్ ను ఏకంగా అమరావతికి తీసుకొచ్చారు. ఇక ఇప్పటికైతే 120 క్యూ బిట్స్ కంప్యూటర్ ను ఇన్స్టాల్ చేసినప్పటికీ.. భవిష్యత్తులో దీన్ని సామర్ధ్యాన్ని 1000 క్యూ బిట్స్ కు విస్తరించే విధంగా ముందస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎంతో సున్నితమైన వాతావరణంలో క్వాంటం కంప్యూటర్ పనిచేస్తుంది. అందువల్లే అధికారులు దీనికోసం ప్రత్యేకమైన ఛాంబర్ నిర్మించారు. ఇది ఫైర్ ప్రూఫ్.. బ్రేక్ ప్రూఫ్ ఉండే విధంగా పటిష్టమైన అద్దాలతో నిర్మించారు. ఆ అద్దాలలోనే కర్టెన్లు ఉంటాయి. ఇక ఈ ఛాంబర్ లో నిరంతరం మైనస్ 270 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను ఐబీఎం సంస్థ పర్యవేక్షిస్తుంది. ఛాంబర్ ను చల్లగా ఉంచడానికి అవసరమైన నైట్రోజన్.. హీలియం సిలిండర్లను తెప్పించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper