Rapthadu Girl: ఖలేజా సినిమా చూశారా.. అందులో ప్రకాష్ రాజ్ గ్యాంగ్ చేతిలో పాలి గ్రామంలో ఉన్న వారంతా చనిపోతుంటారు. అందులో ఒక పసబిడ్డ ప్రాణాన్ని మహేష్ కాపాడుతారు. ఆ సమయంలో ఆ ఊరి వాళ్ళు.. స్వామి ఇది నీ దర్శనం.. ఇది నిదర్శనం.. ఇది నువ్వు కాపాడిన ప్రాణం.. కత్తికి అందకుండా కాపాడిన ప్రాణం. నువ్వు మా దేవుడు అని చెప్పాల్సిన అవసరం లేదు. అది మమ్మల్ని నమ్మించాల్సిన పనిలేదు.. ఈ సీన్ చూస్తుంటే రోమాలు నొక్క పొడుస్తుంటాయి కదా.. అదంటే సినిమా.. లిబర్టీ ఉంటుంది. కానీ ఇది రియల్ లైఫ్ లో జరిగితే..
అనంతపురం జిల్లా రాప్తాడు లో ఇటీవల ఒక కామాంధుడు రంపంతో పదవ తరగతి చదివే బాలికపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడింది. ఈ నేపథ్యంలో ఆ బాలికను తన కూతురిగా అభివర్ణించారు నారా లోకేష్. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయించి బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వైద్య విభాగంలో శస్త్ర చికిత్సలు నిర్వహించారు. చివరికి ఆ బాలిక కోలుకుంది. ఆ బాలిక పరిస్థితిని పర్యవేక్షించేందుకు నారా లోకేష్ నేరుగా బెంగళూరు వెళ్లారు. బాలికను పరామర్శించారు. బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కొడుకుగా అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.
మృత్యుతో పోరాడి గెలిచిన ఆ బాలిక ఆరోగ్యం కుదుటపడింది. ఆ బాలికలో మానసిక ఉల్లాసం.. ఆత్మస్థైర్యం పెంపొందించడానికి ఆస్పత్రిలో పీడియాట్రిక్ ఎమర్జెన్సీ మెడిసిన్ బృందం ప్రత్యేకంగా వేడుక కూడా నిర్వహించింది. ఆమెకు చికిత్స అందిస్తున్న గదిని బెలూన్లతో అందంగా అలంకరించింది. వైద్యులు.. నర్సింగ్ సిబ్బంది ఆమెకు మధురమైన సంగీతాన్ని వినిపించడం మొదలుపెట్టారు.
ఇన్ని రోజులపాటు తీవ్రమైన నొప్పితో ఆ బాలిక బాధపడింది. చివరికి వైద్యులు అందించిన ప్రోత్సాహంతో తన కాళ్ళ మీద తన నిలబడింది. నవ్వుతూ కేక్ కట్ చేసింది. ఆ తర్వాత ఆ బాలిక మాట్లాడింది. నా ప్రాణాలు కాపాడినందుకు కష్టపడిన వారందరికీ ధన్యవాదాలు అంటూ కామెంట్లు చేసింది. ఆ బాలికను ఆసుపత్రిలో చేర్చినప్పుడు ఆమె ప్రాణాన్ని కాపాడుతానని నారా లోకేష్ చెప్పారు. ఆమె తనకు కూతురు లాంటిదని వ్యాఖ్యానించారు. చివరికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఆ బాలిక ప్రాణాలను నిలబెట్టి.. ఆమె దృష్టిలో ఒక హీరోగా నిలిచారు. సాధారణంగా ప్రభుత్వం తరఫున మంత్రులు పరామర్శకు పరిమితమవుతుంటారు. కానీ నారా లోకేష్ పరామర్శకు కాకుండా.. ఆత్మీయ స్పర్శను చూపించారు. తద్వారా ఆ బాలిక ప్రాణాలను కాపాడగలిగారు. ఆ బాలిక ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు నారా లోకేష్ సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటున్నారు. తాజాగా ఆ బాలిక ఆరోగ్య పరిస్థితిని బయట పెట్టారు.
Update (5 PM, 24th November 2026)
Small gestures make the biggest difference. Heartfelt thanks to the PEM team for organizing a lovely cake-cutting and musical session in the girl child’s room to lift her spirits. Wishing her strength and a speedy recovery! https://t.co/k8fsu7fbmG
— Lokesh Nara (@naralokesh) November 24, 2026