Jabardasth anniversary : గత 13 ఏళ్లుగా తెలుగువారిని నవ్వుల్లో ముంచెత్తుతున్న జబర్దస్త్ వేదిక నుంచి ఎంతోమంది టాలెంట్ ఉన్నవాళ్లు బయటకు వచ్చారు. ఈరోజు వాళ్లంతా సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా, నటులుగా, డైరెక్టర్లుగా, రైటర్లుగా రాణిస్తున్నారు. అలాంటి వాళ్లందరినీ ఈ వారం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒక్కచోట చేర్చింది. తాజాగా రిలీజ్ అయిన ఈ ప్రోమోలో బలగం వేణు చేసిన మాటలు అందరినీ కంటతడి పెట్టించాయి. అసలు ఆ ప్రోమోలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం!
ఎపిసోడ్ మొదట్లోనే బుల్లెట్ భాస్కర్, హైపర్ ఆది, యాంకర్ ప్రదీప్ సందడి చేశారు. ఈ స్టేజ్ మీద నుంచి వెళ్లి సక్సెస్ అయినవాళ్లు నీకు తెలియదా అని ప్రదీప్ అడగ్గా.. అందరూ ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత జబర్దస్త్‌లో గతంలో పనిచేసిన ప్రసన్నకు ప్రదీప్ ఓ సరదా టాస్క్ ఇచ్చాడు. స్క్రీన్‌పై అర్ధరాత్రి దుప్పటి కప్పుకుని చాటింగ్ చేస్తున్న కుర్రాడి ఫోటో చూపించాడు. ‘నాకు 100 కోట్ల ఆస్తి ఉంది, రోజుకు ఐదారు కోట్లు ఖర్చు పెడతాను’ అని అమ్మాయికి బిల్డప్ ఇస్తూ.. కట్ చేస్తే చిల్లులు పడిన కట్ డ్రాయర్‌లో ఉంటాడని ప్రసన్న చెప్పిన కథ అందరినీ బాగా నవ్వించింది. జబర్దస్త్ నుంచి అందరికంటే ముందు వెళ్లి సక్సెస్ అయింది ప్రసన్న అన్నే అని ఆది చెప్పడంతో చప్పట్లతో అభినందించారు.
ఆ తర్వాత నూకరాజు ‘విమానం’ సినిమాలో సముద్రఖని గెటప్‌లో వీల్‌చైర్‌లో వచ్చాడు. ఆ సినిమాలో కొడుకుగా నటించిన కుర్రాడు కూడా వచ్చి డైలాగ్ చెప్పి నవ్వించాడు. ఈ సినిమాకు డైరెక్షన్ చేసిన శివప్రసాద్.. గతంలో ధనరాజ్, చమ్మక్ చంద్ర టీమ్స్‌కి రైటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఫైమా, ఇమ్మాన్యుయేల్, పటాస్ ప్రవీణ్‌లకు రైటర్‌గా చేసిన సతీష్ ఎంట్రీ ఇవ్వగా.. ఆయన కోన వెంకట్ గారి ప్రియ శిష్యుడని ఆది ప్రశంసించారు.”
“ఇక హైపర్ ఆదితో పాటు కొంతమంది టీమ్ లీడర్ల దగ్గర పనిచేసిన బాబు క్యారెక్టర్‌ను, లంచ్ బ్రేక్ హడావుడిని ప్రసన్న ఇమిటేట్ చేసి చూపించాడు. ఇప్పుడు బాబుకు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల నుంచి ఆఫర్లు వచ్చి.. అడ్వాన్స్ కూడా తీసుకుని నెక్ట్స్ మూవీ మీద వర్క్ చేస్తున్నాడని ఆది చెప్పడం విశేషం. ఆ తర్వాత తన గురువు అభితో కలిసి ఆది తన ఐకానిక్ స్కిట్ చేసి నవ్వించారు.
ఆ తర్వాత కొమరం మాట్లాడుతూ.. లేడీ గెటప్ వేయగానే వాడికి టైమింగ్ ఉండదు, స్టేజ్ వరకే సరిపోతారని అన్నవాళ్లందరికీ.. మేమంతా కలిసి ఏదైనా చేయగలమనే ధైర్యాన్ని ఇచ్చామని ఎమోషనల్ అయ్యాడు.”
“చివర్లో బలగం వేణు మాట్లాడుతూ.. కమెడియన్లంటే ఏముందిలే అనుకునేవాళ్లకు ఒక విషయం చెప్పాలి. ఎన్నో బాధలు, దెబ్బలు పడితే తప్ప కమెడియన్ అవ్వలేడు. నవ్వించే ప్రతి పంచ్ వెనుక పెద్ద పెద్ద కలలు ఉంటాయి. ‘జబర్దస్త్ కమెడియన్ రా.. పక్కకి వెళ్లండి’ అనే స్థాయి నుంచి ‘జబర్దస్త్ డైరెక్టర్స్’ అనే స్థాయికి ఎదిగామని వేణు చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి.
ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. జబర్దస్త్ నుంచి వెళ్లిన వాళ్లు ఫుల్ ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం మాట్లాడారో చూడాలంటే ఈ ఆదివారం వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ మిస్ కాకుండా చూడాల్సిందే.