Upcoming Smartphones November 2026:స్మార్ట్ ఫోన్లు కొనాలి అని చూస్తున్న వారికి నవంబర్ నెలలో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రాబోతున్నాయి. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలు కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా మోటరోలా.. వివో.. ఒప్పో.. షావోమి సంస్థల నుంచి కొత్త ఫోన్లు రాబోతున్నాయి. వీటిలో కొన్ని ప్రీమియం.. మరికొన్ని మిడ్ రేంజ్ ఫోన్లు.
200 మెగాపిక్సల్ కెమెరా.. అత్యధిక ప్రాససర్లు.. 8000 ఎమ్ఎహెచ్ బ్యాటరీలు.. హై రీ ప్రెష్ రేట్ డిస్ ప్లే లతో ఈ ఫోన్లు ప్రత్యేకతను చాటుకోబోతున్నాయి. నవంబర్లో భారత్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్న ఈ ఫోన్లు.. వాటి ఫీచర్లు ఏమిటో తెలుసుకుందాం..
మోటరోలా సిగ్నేచర్ 27
మోటోరోలా ప్రీమియం విభాగంలో తీసుకొస్తున్న కొత్త స్మార్ట్ ఫోన్ సిగ్నేచర్ 27. ఈ ఫోన్ నవంబర్ ఐదు న అంతర్జాతీయ మార్కెట్ లోకి విడుదలైంది. మనదేశంలో కూడా ఇదేనా విడుదల కాబోతోంది. ఈ ఫోన్ లో క్వాల్ కం 8 ఎలైట్ ఎక్స్ ట్రిమ్ జెన్ 6 ప్రాసెసర్ ఉంది. టూ మెగాపిక్సల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50 మెగా పిక్సెల్ సోనీ ప్రైమరీ కెమెరా ఉంది. బ్యాంగ్ & Olufsen ఆడియో ట్యూనింగ్ ఉంది. ఏడు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టం అప్డేట్స్ ఇస్తామని కంపెనీ ప్రకటించింది.
వివో ఎక్స్ 500 సిరీస్
వివో నుంచి వస్తున్న ఎక్స్ 500 సిరీస్ పై స్మార్ట్ ఫోన్ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్ లో వివో ఎక్స్ 500, వివో ఎక్స్ 500 ప్రో, వివో ఎక్స్ 500 ప్రో మాక్స్ మోడల్స్ ఉండే అవకాశం ఉంది. మన దేశ మార్కెట్లో ఈ సిరీస్ నవంబర్ చివరి వరంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో అధునాతన డైమన్ సిటీ 9600 సిరీస్ ప్రాసెసర్లు, ఓఎల్ఈడి డిస్ ప్లే లు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్స్ 500 ప్రో మాక్స్ లో 200 మెగాపిక్సల్ బైస్ పెరిస్కోప్ కెమెరా, బ్యాటరీ ఉండనుంది.
ఒప్పో రెనో 17 సిరీస్
ఒప్పో రెనో సిరీస్ కు మార్కెట్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.. ముఖ్యంగా కెమెరా.. డిజైన్ విషయంలో ఈ సిరీస్ యూజర్లను ఆకట్టుకుంటున్నది. ఇప్పుడు రెనో 17, రెనో 17 ప్రో మోడల్ ను చైనా మార్కెట్లో ఈ నవంబర్లో విడుదల చేసేందుకు కంపెనీ రెడీ అయింది. రెనో 17 లో 6.5 అంగుళాల డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్, 8000ఎంఏ హెచ్ స్థాయి బ్యాటరీ ఉంటాయి. రెనో 17 ప్రో లో 6.3 అంగుళాల డిస్ ప్లే, మీడియా టెక్ డైమన్ సిటీ 8550 ప్రాసెసర్, 7200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. రెండు మోడల్స్ లో 50 మెగా పిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండే అవకాశం ఉంది. అయితే మనదేశంలో రిలీజ్ మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
Xiaomi 18 Pro series
షావోమి నుంచి రాబోతున్న 18 ప్రో, 18 ప్రో మాక్స్ మోడల్ ఫోన్స్ కూడా ఈ నెలలో చర్చకు దారితీస్తున్నాయి. ఇప్పటికే చైనా మార్కెట్లో ఈ ఫోన్లు విడుదలయ్యాయి. త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్లోకి రాబోతున్నాయి. ఈ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రాసెసర్లు ఉండబోతున్నాయి. మరోవైపు సెకండరీ డిస్ ప్లే, రెండు 200 మెగా పిక్సెల్ కెమెరాలతో కూడిన కెమెరా సెట్ అప్ ఈ సిరీస్ లో ప్రత్యేకంగా నిలవబోతున్నాయి. అయితే భారత మార్కెట్లో నవంబర్లోనే ఈ ఫోన్లు విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Motorola Moto G47 power 5G
బడ్జెట్, మిడ్ రేంజ్ విభాగంలో మోటరోలా ఈ ఆసక్తికరమైన ఫోన్ తీసుకొస్తోంది. ఇందులో మీడియా టెక్ డైమన్ సిటీ 6300 ప్రాసెసర్, 7000 ఎంఏ హెచ్ బ్యాటరీ, 33 డబ్ల్యూ పాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 6.67 అంగుళాల డిస్ ప్లే, 120h z రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి. ఇప్పటికే యూరప్ లో ఈ ఫోన్ విడుదలైంది. మనదేశంలో ఎప్పుడు విడుదలవుతుందో ఇంకా క్లారిటీ లేదు.
నవంబర్ నెలలో వస్తున్న స్మార్ట్ ఫోన్లలో కెమెరాకు ప్రాధాన్యం ఇచ్చేవారు వివో ఎక్స్ 500 సిరీస్ మీద దృష్టి పెట్టొచ్చు. ప్రీమియం ఫోన్ కోరుకునే వారికి మోటరోలా సిగ్నేచర్ 27 ఆసక్తికరంగా ఉండొచ్చు. ఇక ఒప్పో రెనో 17 సిరీస్ ఫోన్లు డిజైన్.. కెమెరా ఫీచర్లతో ఆకట్టుకునే అవకాశం ఉంది. అయితే అన్ని ఫోన్లు భారతదేశంలో లాంచ్ అయ్యే తేదీలు.. ధరలు ఇంకా ఖరారు కాలేదు.