Homeఅంతర్జాతీయంIndus Waters Treaty: పాకిస్తాన్‌ ఆనందాన్ని ఆవిరి చేసిన భారత్‌..

Indus Waters Treaty: పాకిస్తాన్‌ ఆనందాన్ని ఆవిరి చేసిన భారత్‌..

Indus Waters Treaty: పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్‌ పాకిస్తాన్‌పై అనేక చర్యలు చేపట్టింది. ఇందులో సిందూ జలాల ఒప్పందం నిలిపివేత ఒకటి. దీంతో పాకిస్తాన్‌లో కరువు, అవసరం లేనప్పుడు వరదలు సృష్టిస్తోంది. దీనిపై పాకిస్తాన్‌ ఐక్యరాజ్యసమితి అనుబంధ మధ్యవర్థిత్వ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు పాకిస్తాన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఒప్పందం కొనసాగాలని, భారత్‌ ఇచ్చిన కారణాలు సరిపోవని, జమ్మూ కశ్మీర్‌లోని జలవిద్యుత్‌ ప్రాజెక్టులపై కొన్ని పరిమితులు విధించాలని కోర్టు పేర్కొనడంతో […]

Indus Waters Treaty: పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్‌ పాకిస్తాన్‌పై అనేక చర్యలు చేపట్టింది. ఇందులో సిందూ జలాల ఒప్పందం నిలిపివేత ఒకటి. దీంతో పాకిస్తాన్‌లో కరువు, అవసరం లేనప్పుడు వరదలు సృష్టిస్తోంది. దీనిపై పాకిస్తాన్‌ ఐక్యరాజ్యసమితి అనుబంధ మధ్యవర్థిత్వ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు పాకిస్తాన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఒప్పందం కొనసాగాలని, భారత్‌ ఇచ్చిన కారణాలు సరిపోవని, జమ్మూ కశ్మీర్‌లోని జలవిద్యుత్‌ ప్రాజెక్టులపై కొన్ని పరిమితులు విధించాలని కోర్టు పేర్కొనడంతో పాకిస్తాన్‌ సంతోషం వ్యక్తం చేసింది. అయితే ఆ ఆనందం కొన్ని గంటల్లోనే అడుగంటింది. భారత్‌ ఆ కోర్టు చట్టబద్ధతను, అధికార పరిధిని గుర్తించడం లేదని స్పష్టం చేసింది. తమ సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకునే హక్కు ఆ కోర్టుకు లేదని విదేశాంగ శాఖ చెప్పడంతో పాకిస్తాన్‌ ఆశలు నీరుగారాయి.

ఒప్పందం నేపథ్యం..
1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన సింధూ జలాల ఒప్పందం ప్రకారం రావి, బియాస్, సట్లెజ్‌ నదుల జలాలు భారత్‌కు, సింధు, జీలం, చినాబ్‌ జలాలు పాకిస్తాన్‌కు కేటాయించబడ్డాయి. దశాబ్దాలుగా ఈ ఏర్పాటు కొనసాగుతూ వచ్చింది. అయితే పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌ ఒప్పందాన్ని తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టింది. ఉగ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో జలాలను నిలిపివేయడం జరిగింది. ఈ నిర్ణయం కేవలం జలాల విషయం కాదు; భద్రతా పరిగణనలతో ముడిపడి ఉంది అని భారత్‌ స్థానం.

కోర్టు తీర్పుపై భారత్‌ ఆగ్రహం..
మధ్యవర్తిత్వ కోర్టు ఒప్పందం కొనసాగాలని, నిలిపివేతకు కారణాలు సహేతుకం కావని అభిప్రాయపడింది. అయితే భారత్‌ ఈ విచారణలో పాల్గొనలేదు. తమ సార్వభౌమాధికారం, జాతీయ భద్రతా విషయాల్లో బయటి వేదికలు నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదని స్పష్టం చేసింది. కోర్టు తీర్పు ఎలా ఉన్నా, దానిని అమలు చేయాల్సిన బాధ్యత భారత్‌పై లేదని సూచించింది. జలవిద్యుత్‌ ప్రాజెక్టులపై పరిమితులు విధించాలన్న కోర్టు సూచనలు కూడా భారత్‌ అంతర్గత అధికార పరిధిలోకి వస్తాయని వాదన.

భౌగోళిక రాజకీయాల్లో ప్రాధాన్యం
సింధూ జలాలు కేవలం నీటి పంపిణీ విషయం కాదు. ఇది భద్రత, ఉగ్రవాదం, సార్వభౌమాధికారం అనే విస్తృత చట్రంలో చూడాలి. పాకిస్తాన్‌ భూభాగం నుంచి లేదా మద్దతుతో జరిగే ఉగ్ర కార్యకలాపాలు కొనసాగుతున్నప్పుడు సాధారణ ఒప్పందాలను యథాతథంగా కొనసాగించడం కష్టం అని భారత్‌ సందేశం. కోర్టు తీర్పులు దౌత్యపరమైన ఒత్తిడిని సృష్టించవచ్చు కానీ, జాతీయ ప్రయోజనాలు, భద్రతా అవసరాలు ముందు ఉంటాయి అని భారత్‌ వైఖరి సూచిస్తోంది.

నిలిపవేత కొనసాగింపు..
భారత్‌ సింధూ జలాల నిలిపివేతను కొనసాగిస్తామని స్పష్టం చేయడం పాకిస్తాన్‌కు ఆర్థిక, వ్యవసాయ పరమైన ఒత్తిడిని పెంచుతుంది. అదే సమయంలో అంతర్జాతీయ వేదికలపై చర్చలు, ఒత్తిళ్లు కొనసాగే అవకాశం ఉంది. భారత్‌ తన స్థానాన్ని దృఢంగా నిలబెట్టుకోవడం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా స్పష్ట సందేశం ఇవ్వడం ఈ పరిణామాల్లో కీలకం. జలాలు రాజకీయ ఆయుధంగా మారకుండా, భద్రతా పరిగణనలతో ముడిపడి ఉండాలని భారత్‌ నిర్ణయం సూచిస్తోంది.

మధ్యవర్తిత్వ కోర్టు తీర్పు పాకిస్తాన్‌కు తాత్కాలిక ఉత్సాహం ఇచ్చినా, భారత్‌ సార్వభౌమాధికారం, భద్రతా ప్రాధాన్యతల ముందు అది నిలవలేకపోయింది. జలాల విషయంలో భారత్‌ వైఖరి స్పష్టంగా చెప్పింది. ఉగ్రవాదం కొనసాగినంత కాలం సాధారణ పరిస్థితులు తిరిగి రావు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper