ENE Repeat: భారీ అంచనాల నడుమ నిన్న విడుదలైన ‘ENE రిపీట్‘ చిత్రం మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టాక్ తగ్గట్టే కలెక్షన్స్ కూడా అదిరిపోయాయి.ముఖ్యంగా నైజాం ప్రాంతం లో అయితే ఈ చిత్రానికి మీడియం రేంజ్ హీరోల సినిమాలకంటే ఎక్కువ ఓపెనింగ్ వచ్చిందనే చెప్పొచ్చు. నూన్ షోస్ నుండే హౌస్ ఫుల్స్ ని నమోదు చేసుకున్న ఈ చిత్రం, మ్యాట్నీ షోస్ నుండి అదనపు షోస్ తో రన్ అయ్యింది. అలా ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ బోర్డ్స్ కళకళలాడాయి. విశ్వక్ సేన్ కి చాలా కాలం తర్వాత ఒక మంచి ఓపెనింగ్ ఈ సినిమా రూపం లో వచ్చింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ , సీడెడ్ లో మాత్రం యావరేజ్ రేంజ్ ఓపెనింగ్స్ రాగా , ఓవర్సీస్ లో సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని నమోదు చేసుకుంది ఈ చిత్రం. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయో వివరం గా ఇప్పుడు చూడబోతున్నాం.
ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 12 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. నైజాం ప్రాంతం నుండి 4 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా , సీడెడ్ నుండి 32 లక్షలు, ఆంధ్ర ప్రదేశ్ నుండి 1 కోటి 20 లక్షలు, కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 80 లక్షలు, ఓవర్సీస్ నుండి 5 కోట్ల 5 లక్షల రూపాయిలు వచ్చాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ షేర్ 6 కోట్ల రూపాయిలు రాగా, మరో 17 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబోయే రోజుల్లో ఈ చిత్రం రాబడితే బ్రేక్ ఈవెన్ మార్కును అందుకొనే అవకాశాలు ఉన్నాయి. వీకెండ్ లోపే ఆ మార్కు ని అవలీలగా అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఫుల్ రన్ లో ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదట.