Pawan Kalyan: సినీ హీరోల మీద హద్దులు దాటిన అభిమానం ఎప్పటికైనా ప్రమాదమే. కేవలం సినిమాలు చూశామా, ఎంజాయ్ చేశామా?, ఎప్పుడైనా బయట కనిపిస్తే వాళ్ళతో కలిసి ఒక ఫోటో దిగామా అన్నట్టుగానే ఉండాలి. అంతకు మించి దాటితే మాత్రం అనర్దాలకు దారి తీస్తుంది. గతం లో ఇలాంటి ఘటనలు మనం చాలానే చూశాము. వీటి పైన కొన్ని సినిమాలు కూడా తెరకెక్కాయి. అయినప్పటికీ కొంతమంది హద్దులు దాటిన అభిమానాన్ని చూపిస్తూనే ఉన్నారు. రీసెంట్ గా అందుకు ఉదాహరణగా ఒక ఘటన జరిగింది. ఇది చూసిన తర్వాత వీళ్ళేమి అభిమానులు రా బాబు, ఇలా ఉన్నారేంటి అంటూ నెటిజెన్స్ మండిపడుతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద ఒక వీరాభిమాని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన ఇప్పుడు సంచలనం గా మారింది. ఖమ్మం ప్రాంతానికి చెందిన సుచిత్ అనే వీరాభిమాని గత కొంతకాలం నుండి పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ పవన్ నివాసం వద్ద ఉన్న బాడీ గార్డ్ అందుకు అనుమతించపోవడం, దాడికి ప్రయత్నం చేయడం తో సుచిత్ తన చేతిని కొడుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడం తో ఘటన స్థలం వద్దకు చేరుకొని , సుచిత్ ని అదుపులోకి తీసుకొని హాస్పిటల్ కి తరలించారు. అనంతరం ఈ ఘటన పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ప్రస్తుతానికి సుచిత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు సమాచారం.