Homeబిజినెస్RBI Loan Rules: బ్యాంకు రుణాలు తీసుకున్న వారికి భారీ ఊరట.. ఆర్బిఐ కొత్త రూల్స్..

RBI Loan Rules: బ్యాంకు రుణాలు తీసుకున్న వారికి భారీ ఊరట.. ఆర్బిఐ కొత్త రూల్స్..

RBI Loan Rules: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రెపోరెట్స్ గతంలో లాగే స్థిరంగా ఉంచిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటివరకు రకరకాల రుణాలు తీసుకున్న వారికి ప్రయోజనం కల్పించినట్లు అయింది. అయితే రెపోరేటు స్థిరంగా ఉంచినప్పటికీ కొన్ని బ్యాంకులు వినియోగదారులపై రకరకాల చార్జీలు విధిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బిఐ కొత్తగా రూల్స్ తీసుకొచ్చింది. ఈరోజు ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఆర్బిఐ తెలిపిన కొత్త నిబంధనలో వినియోగదారునికి సమాచారం ఇవ్వకుండా బెంచ్ […]

RBI Loan Rules: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రెపోరెట్స్ గతంలో లాగే స్థిరంగా ఉంచిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటివరకు రకరకాల రుణాలు తీసుకున్న వారికి ప్రయోజనం కల్పించినట్లు అయింది. అయితే రెపోరేటు స్థిరంగా ఉంచినప్పటికీ కొన్ని బ్యాంకులు వినియోగదారులపై రకరకాల చార్జీలు విధిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బిఐ కొత్తగా రూల్స్ తీసుకొచ్చింది. ఈరోజు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఆర్బిఐ తెలిపిన కొత్త నిబంధనలో వినియోగదారునికి సమాచారం ఇవ్వకుండా బెంచ్ మార్క్ మార్చకూడదు. సాధారణంగా బెంచ్ మార్క్ ఆధారంగానే వడ్డీ రేటు కొనసాగుతుంది. దీనిని మార్చడం వల్ల వడ్డీ రేట్లలో కూడా మార్పులు వచ్చి వినియోగదారులపై ప్రభావం రావొచ్చు. అందువల్ల ఆర్బిఐ కొత్త నిబంధనల ప్రకారం ఖాతాదారునికి సమాచారం ఇవ్వకుండా వీటిని ఎట్టి పరిస్థితుల్లో మార్చాల్సిన అవసరం లేదు.

అలాగే బ్యాంకు రుణం తీసుకున్న వారికి రుణభారం పడకుండా ప్రస్తుత వడ్డీ రేటునే కొనసాగించాలి. ఆర్బిఐ రేపో రేటు పెంచినప్పటికీ బ్యాంక్ కొన్ని బ్యాంకులు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు వినియోగదారులపై రకరకాల చార్జీలు విధిస్తుంటాయి. కానీ ఇలా చార్జీలు వేయడానికి ఏమాత్రం ఆస్కారం లేదని ఆర్బిఐ తెలిపింది. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటుని కొనసాగిస్తూ అందులో ఎటువంటి మార్పులు తీసుకురాకూడదని తెలిపింది.

ఈ నిబంధనలతో ఫ్లోటింగ్ రేట్తో రుణాలు తీసుకున్న వారికి ప్రయోజనాలు కలగనన్నాయి. ఫ్లోటింగ్ రేట్ అంటే వడ్డీ రేటు మారినప్పుడల్లా వీరు తీసుకున్న రుణాలపై కూడా వడ్డీ రేటు మారే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆర్బిఐ తెలిపిన ప్రకారం వడ్డీ రేటు స్థిరంగా ఉండాలని చెప్పడంతో ఈ రకమైన రుణాలు తీసుకున్న వారికి ప్రయోజనాలు ఉండనున్నాయి. దీంతో ఇప్పటివరకు రుణాలు తీసుకునే వారికి ఎలాంటి అదనపు వడ్డీ భారం చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే కొత్తగా రుణం తీసుకునే వారికి భవిష్యత్తుతో పోలిస్తే తక్కువ వడ్డీకే రుణం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా రుణాలను కొత్త ఫ్రేమ్ వర్క్ పై తీసుకురావడానికి ఆర్బిఐ ప్రతిపాదనలు చేసింది. అంటే బెంచ్ మార్కుకు అనుసంధానమైన రుణాలను ఒకసారి చేసే మ్యాపింగ్ ప్రక్రియ ద్వారా కొత్త విధానానికి మార్చాలని తెలిపింది. ఈ మార్పు 2029 ఏప్రిల్ ఒకటి లోపు చేయాలని పేర్కొంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper