Kota Vinutha: అప్పట్లో వ్యక్తిగత సహాయకుడు.. డ్రైవర్ హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొని జైలుకు వెళ్లి వచ్చారు శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇంచార్జ్ కోట వినూత. ఆ తర్వాత ఆమె రాజకీయంగా అంత యాక్టివ్ గా లేరు. ఆమె భర్త చంద్రబాబు డ్రైవర్ హత్య కేసులో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కోట వినూత వ్యవహారం బయటికి వచ్చిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంటనే కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ఆమెను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని చెప్పారు.
సరిగ్గా ఇన్నాళ్లకు కోట వినూత మళ్లీ తన సోషల్ మీడియాలో ఒక కీలకమైన వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో ఆమె చెప్పిన మాటలు సంచలనంగా ఉన్నాయి. “నేను కూటమి గెలుపు కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేశాను.. మా సొంత ఊరు రేణిగుంట మేజర్ పంచాయతీ సర్పంచ్ గా జనసేన నుంచి మా అమ్మ నగరం జయలలిత పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆమె పోటీలో ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే సహకరించడం లేదు. పైగా మాకు పోటీగా రెబల్ అభ్యర్థిని నిలబెట్టారు. ఇది ఎంతవరకు న్యాయం.. నారా లోకేష్ గారికి.. చంద్రబాబు నాయుడు గారికి విన్నపం . పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని గౌరవించాలని.. మీ సహకారం కావాలని కోరుతున్నానని” కోట వినూత ఆ వీడియోలో పేర్కొన్నారు.
గతంలో డ్రైవర్ హత్య కేసు సమయంలో కూడా వినూత సంచలన ఆరోపణలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం ఇందులో ఉందని ఆరోపించారు. అంతేకాదు నిజాలు త్వరలోనే బయటపడతాయని ఆమె వ్యాఖ్యానించారు. జైలు నుంచి విడుదల తర్వాత జనసేన పార్టీ కార్యకలాపాలలో ఆమె పాల్గొంటున్నారు. ఈ ప్రకారం చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే ఆమె పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారని తెలుస్తోంది. రేణిగుంట మేజర్ పంచాయతీలో విననత తల్లి పోటీ చేస్తున్నారు. ఆమె అధికారికంగా జనసేన నుంచి పోటీలో ఉన్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే ప్రోత్బలం వల్లే రెబల్ పోటీలో ఉన్నారని వినూత ఆరోపిస్తున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు.. చంద్రబాబు.. నారా లోకేష్ స్థానిక ఎమ్మెల్యేకు ఏమైనా సూచనలు చేస్తారా.. కూటమి ధర్మం ప్రకారం సర్పంచ్ పోటీలో ఉన్న అభ్యర్థులకు పోటీగా రెబల్స్ ఉండకూడదని నిర్ణయించారు. మరి రేణిగుంట సర్పంచ్ స్థానం విషయంలో ఏం చేస్తారో చూడాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
నేను కూటమి గెలుపు కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేశాను. మా సొంత ఊరు రేణిగుంట మేజర్ పంచాయతీ సర్పంచ్ జనసేన తరఫున మా అమ్మ నగరం జయలలిత గారు ఆఫీసియల్ గా పోటీ చెయ్యమని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పోటీ చేస్తుంటే స్థానిక టీడీపీ MLA సహకరించకుండా రెబల్ నిలబెట్టడం కరెక్ట్ కాదు.
@naralokesh గారు, @ncbn గారికి విన్నపం, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని గౌరవించాలని, మీ సహకారం కావాలని కోరుతున్నాను.
మీ
వినుత కోటా
@JanaSenaParty @PawanKalyan
— Vinutha Kotaa (@VinuthaKotaa) November 20, 2026