Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ టైటిల్ గెలిచేంత సత్తా ఉన్నప్పటికీ, ఓటింగ్ లో అందరికంటే టాప్ స్థానంలో ఉన్నప్పటికీ కూడా రోహిత్ ని ఎలిమినేట్ చేయడం పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి ఎంతటి వ్యతిరేకత ఏర్పడిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రోహిత్ అభిమానులు వరుసగా రెండు వారాల పాటు ట్విట్టర్ , ఇన్ స్టాగ్రామ్ ని షేక్ చేసి వదిలారు. సోషల్ మీడియా లో నెటిజెన్స్ డిమాండ్ ని చూసి కచ్చితంగా బిగ్ బాస్ టీం రోహిత్ చేత రీ ఎంట్రీ ప్లాన్ చేయిస్తారని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ కోసం డిక్టేటర్ అనే అంకంలో భాగంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. తమ అభిమాన కంటెస్టెంట్ అయినటువంటి రోహిత్ ని మరోసారి బుల్లితెర పై చూసుకోవచ్చని రోహిత్ అభిమానులు సంబరపడ్డారు. కానీ రోహిత్ తప్ప, దాదాపుగా అందరూ హౌస్ లోకి వచ్చి నామినేట్ చేసి వెళ్లారు. అయితే రోహిత్ రాకపోవడానికి గల కారణాన్ని రీసెంట్ గా ఆయన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు.
దీనిపై రోహిత్ రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, బిగ్ బాస్ టీం నన్ను సంప్రదించిన విషయం వాస్తవమే, నన్ను ఒక వారం రోజులు గెస్ట్ హౌస్ మేట్ గా పిలిచారు. కానీ నాకున్న పొటెన్షియల్ కి అది ఏ మాత్రం సరిపోదు అనిపించింది, అందుకే వాళ్ళ ఆఫర్ ని రిజెక్ట్ చేసాను అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్. ఫినాలే ఎపిసోడ్ కి వస్తారా అని మీడియా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం గా రావొచ్చు , రాకపోవచ్చు , అప్పుడు నా నేను అందుబాటులో ఉంటే వస్తాను అంటూ చెప్పుకొచ్చారు. అయితే అభిమానులు మాత్రం ఇలాంటి బయాస్ షో ఫినాలే కి నువ్వు రావాల్సిన అవసరం లేదని చెప్పుకొస్తున్నారు. మరి రోహిత్ ఫినాలే కి వస్తాడో లేదో చూడాలి.