Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డేరింగ్ అండ్ డైనమిక్. డాషింగ్ వ్యవహార శైలితో పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా ఉంటారు. ముఖ్యమంత్రి కాకముందు.. కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. అంతకుముందు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు.. ఇలా ప్రతి సందర్భంలో రేవంత్ రెడ్డి తనదైన మేనరిజాన్ని చూపించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏమాత్రం తగ్గేది లేదు అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
ప్రత్యర్థుల మీద విమర్శలు చేయడంలో.. రాజకీయ వ్యూహాలు రచించడంలో రేవంత్ రెడ్డి డిఫరెంట్ స్టైల్ అనుసరిస్తారు. రాజకీయ నాయకుడిగా రేవంత్ రెడ్డి తాను అనుకున్న లక్ష్యాలను సాధించారు. అయితే ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. చాలా కొంతమందికి మాత్రమే ఆ విషయాలు తెలుసు. ముఖ్యంగా ఆయన ప్రేమ కథ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది సినిమాలకు ఏమాత్రం తగ్గదు. అయితే తొలిసారిగా తన లవ్ స్టోరీని బయట పెట్టారు రేవంత్ రెడ్డి. అందులో ఉన్న మలుపులు చూస్తే సినిమా స్టోరీకి మించి ఉంది..
రేవంత్ రెడ్డి ది ప్రేమ వివాహం. ఆయన భార్య పేరు గీత. ఈమెను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లోనే రేవంత్ రెడ్డి ప్రేమించారు. అప్పట్లో ఒకసారి నాగార్జునసాగర్ కు వెళ్ళినప్పుడు గీతతో ఆయనకు పరిచయం మొదలైంది. అది కాస్త స్నేహంగా మారింది. ఆ తర్వాత ప్రేమగా రూపాంతరం చెందింది. రేవంత్ రెడ్డి ముందుగా గీతకు తన ప్రేమను వ్యక్తం చేశారు. ఆయన ధైర్యాన్ని చూసి.. వ్యక్తిత్వాన్ని ఇష్టపడి.. ముక్కు సూటితనాన్ని నచ్చి గీత రేవంత్ రెడ్డి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు
రేవంత్ రెడ్డి ప్రేమ కథకు మొదట్లో కుటుంబం నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. రాజకీయాలలో అప్పటికి రేవంత్ రెడ్డి స్థిరపడలేదు. దీంతో గీత కుటుంబ సభ్యులు ఈ వివాహానికి ముందుగా అంగీకారం తెలపలేదు. ఉన్నత చదువుల కోసం గీతను ఢిల్లీలో ఉంటున్న ఆమె బాబాయి.. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి వద్దకు పంపించారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తన ప్రేమను పెళ్లి దాకా తీసుకువెళ్లాలని భావించారు. ఈ నేపథ్యంలో ఆయన బైక్ మీద ఢిల్లీ దాకా వెళ్లారు. సుమారు 1750 కిలోమీటర్ల దూరం బైక్ మీద ప్రయాణం చేశారు. రైలు లేదా విమానంలో వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి బైక్ మీద ప్రయాణం చేయడం అతడిలో ఉన్న పట్టుదలకు నిదర్శనం. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి అడిగితే అది నాకు పర్సనల్ అని చెప్పారు.
ఢిల్లీ వెళ్లిన తర్వాత రేవంత్ రెడ్డి నేరుగా జైపాల్ రెడ్డిని కలిశారు. గీతతో తనకు ఉన్న ప్రేమ బంధాన్ని గురించి మాట్లాడారు. తన అభిప్రాయాల గురించి వివరించారు. పెళ్లికి ఒప్పుకునే విధంగా ఆయనను ఒప్పించారు. రేవంత్ రెడ్డిలో ధైర్యం.. ఆత్మవిశ్వాసం.. మాటతీరు జయపాల్ రెడ్డి ని ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత జైపాల్ రెడ్డి కూడా గీత తండ్రిని ఒప్పించారు. నీతో రెండు కుటుంబాల వారు పెళ్లికి ఒప్పుకున్నారు. 1992 మే 7న రేవంత్ రెడ్డి, గీత వివాహ బంధం ద్వారా ఒకటయ్యారు.
వివాహ అనంతరం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రయాణాన్ని మరింత దూకుడుగా మొదలుపెట్టారు. ఈ సమయంలో గీత ఆయనకు అండగా నిలిచారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎదిగారు. ఇంతటి ఎదుగుదలలో రేవంత్ రెడ్డికి గీత అన్ని విధాలుగా సహకరించారు. ఇక ఇటీవల నాగార్జునసాగర్ లో వరుణయాగం జరిగింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి తన సతీమణి గీతతో కలిసి అక్కడికి వెళ్లారు. తమ ప్రేమకు తొలి అడుగు పడిన ప్రాంతాన్ని సందర్శించారు. నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అప్పటి పాత ఫోటోలు కూడా ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.. ప్రేమ కోసం 1750 కిలోమీటర్లు దూరం బైక్ మీద ప్రయాణించడం.. పెద్దలను ఒప్పించడం.. పెళ్లిదాకా దానిని తీసుకెళ్లడం అంటే మాటలు కాదు. దీనిని చేతల్లో చూపించారు రేవంత్ రెడ్డి. పొలిటికల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా తనది పోరాటాల చరిత్ర అని నిరూపించుకున్నారు.