Homeఆంధ్రప్రదేశ్‌YSR Congress Party: వారసుల ప్రకటనపై వైసీపీలో అసంతృప్తి జ్వాల!

YSR Congress Party: వారసుల ప్రకటనపై వైసీపీలో అసంతృప్తి జ్వాల!

YSR Congress Party: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వాతావరణం నడుస్తోంది. పార్టీలో సీనియర్లు తమ వారసులను రంగంలోకి దించుతామంటే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవడం లేదు. కానీ పార్టీలో వివాదాస్పద నేతలు మాత్రం తమ వారసులను ఇట్టే ప్రకటిస్తున్నారు. దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు సీనియర్లు. అంత వింతలా ఉందని చెబుతున్నారు. తమకు మాత్రం ఆంక్షలు విధించి.. బూతులు మాట్లాడే నేతలకు మాత్రం ఏంటి స్వేచ్ఛ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయ వారసుడిని ప్రకటించారు మరో మాజీ మంత్రి పేర్ని నాని. 2034 ఎన్నికల్లో కొడాలి నాని సోదరుడు కుమారుడు అర్జున్ గుడివాడ నుంచి పోటీ చేస్తారని చెప్పుకొచ్చారు. ఇదే కొడాలి నాని గత ఎన్నికలకు ముందు మచిలీపట్నం నుంచి పేర్ని నాని కుమారుడు కిట్టు పేరును ప్రకటించారు. అదే సమయంలో కొందరు సీనియర్లు అడిగితే మాత్రం జగన్ నో చెప్పారు. ఇప్పుడు తాజాగా కొడాలి నాని వారసుడు ప్రకటనతో సీనియర్లు రగిలిపోతున్నారు.

* సీనియర్లకు మొండి చేయి..
2024 ఎన్నికల్లో తమ వారసులను పోటీ చేయించాలని చూశారు చాలామంది నేతలు. ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణ దాసు, తమ్మినేని సీతారాం.. ఇలా ఈ జాబితాలో చాలామంది నేతలు ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పేర్ని నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వారికి మాత్రం తమ వారసులను బరిలో దించేందుకు అనుమతి ఇచ్చారు. అప్పట్లోనే సీనియర్లు మండిపడ్డారు. తాము క్రియాశీలకంగా ఉండగా వారసులను రాజకీయంగా యాక్టివ్ చేస్తాం అనుకుంటే అధినేత అనుమతి ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. లోలోపల బాధ పడిపోయారు.

* అలా ఎలా చేస్తారు?
ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని కొడాలి నాని వారసుడిని ప్రకటించేశారు. అధిష్టానం నిర్ణయంతో సంబంధం లేకుండా.. కనీసం అధినేతను సంప్రదించకుండా ఈ ప్రకటన చేయడం ఏంటనేది ఇప్పుడు వైసీపీ సీనియర్ల నుంచి వస్తున్న మాట. అసలు కొడాలి నాని గత రెండేళ్లుగా నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. అక్కడ టిడిపి ఎమ్మెల్యే దూకుడుతో ఉన్నారు. కనీసం పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం లేదు. ఇప్పుడు వచ్చి ఆయన పోటీ చేస్తారు.. తరువాత వారి అన్న కుమారుడు పోటీ చేస్తాడు అంటూ ప్రకటన చేయడం ఏంటి అనేది వైసిపి సీనియర్ల నుంచి వినిపిస్తున్న మాట. పేర్ని నానికి ఉన్న స్వేచ్ఛ తమకు లేదా అని చాలామంది సీనియర్లు మండిపడుతున్నారు. శ్రీకాకుళంలో తమ్మినేని సీతారాం లాంటి నేత అయితే.. తనను నియోజకవర్గ ఇన్చార్జి నుంచి తప్పించి జూనియర్ కు అప్పగించడం పై రుస రుసలాడుతున్నారు. ఆయన ఒక్కరే కాదు సీనియర్లంతా ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కొడాలి నాని వారసుడిని పేర్ని నాని ప్రకటించిన తర్వాత సీనియర్లలో ఒక రకమైన అసంతృప్తి ప్రారంభం అయ్యింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular