journalism : సమాజానికి టార్చి బేరర్ లాగా పనిచేసే క్రమంలో మీడియా ఎప్పుడు కూడా సొంత ఒత్తిడికి గురి కాకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా స్వీయ విచక్షణ మర్చిపోకూడదు. కానీ నేటి కాలంలో మీడియా ఇది పట్టించుకోవడం లేదు.
తెలుగులో చాలా చానల్స్ ఉన్నాయి. ఇందులో పని చేసే వారంతా ఆ యాజమాన్యం లైన్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ ఈ సీనియర్ జర్నలిస్టు మాత్రం ఒక రకమైన టెంపో కంటిన్యూ చేస్తుంటాడు. ప్రైమ్ టైం లో రావడమే ఆలస్యం తను ఏదైతే అనుకుంటాడో.. అది మాత్రమే చెప్తాడు. కొన్ని సందర్భాలలో టంగ్ స్లిప్ కూడా అవుతుంది. బండ బూతులు వస్తుంటాయి. అయినప్పటికీ ఆయన పట్టించుకోడు.. పైగా తనకు మాత్రమే అలా మాట్లాడే అధికారం ఉంది అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటాడు.
జర్నలిస్టులు కూడా మనుషులే. వాళ్లకు కూడా కొన్ని మనోభావాలు ఉంటాయి. వాళ్లకు కూడా కొన్ని భావోద్వేగాలు ఉంటాయి. వాటిని నియంత్రించుకొని పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఈ జర్నలిస్టు మాత్రం వాటిని కంట్రోల్ చేసుకోలేడు. ఒక్కసారి ప్రైమ్ టైంలో వార్తలు చెప్పడం మొదలుపెడితే మనోడి దూకుడుకు అడ్డుండదు. చెప్తానే ఉంటాడు. చెప్పుకుంటూ పోతూనే ఉంటాడు. తనకు ఇష్టమైన రాజకీయ నాయకుల ప్రస్తావన వస్తే వారిని ఆకాశమంత ఎత్తుకు ఎత్తేస్తూ ఉంటాడు. తనకు నచ్చని రాజకీయ నాయకుల ప్రస్తావన వస్తే తీవ్రంగా విమర్శిస్తూ ఉంటాడు. అసలు దీనిని జర్నలిజం అని ఎలా అంటారు.. ఇటువంటి వ్యక్తిని జర్నలిస్టు అని ఎలా చెప్తారు అని విశ్లేషకులు అంటున్నారు.
ఆయన ప్రతి సందర్భంలో ఇలా మాట్లాడటం అలవాటుగా మారిపోయింది. అందువల్లే ఆయన సోషల్ మీడియాలో తరచుగా ట్రోల్ అవుతూ ఉంటారు. గిట్టని పార్టీ నాయకులు ఆయనను తీవ్రస్థాయిలో విమర్శిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆ జర్నలిస్ట్ వీటిని పట్టించుకోడు. ముందుగానే చెప్పినట్టు తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఉంటాడు. బూతులు గాని.. అంతకు మించిన పదాలు గాని మాట్లాడినప్పటికీ అతడు ఏమాత్రం అపరాధ భావాన్ని ప్రదర్శించడు. అందువల్లే ఆయన కామెడీ పీస్ అయిపోతున్నాడు. గిట్టని పార్టీ నాయకులు ఆయన మీద వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంత జరిగినప్పటికీ ఆ జర్నలిస్ట్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా బూతులు మాట్లాడటంలో.. ఆగ్రహాన్ని ప్రదర్శించడంలో అంతకుమించి అనే స్థాయిని చూపిస్తున్నాడు.
అసలు ఇటువంటి వ్యక్తి జర్నలిస్ట్ ఎలా అవుతాడు.. అతడు సాగించేది జర్నలిజం ఎలా అవుతుందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవలి ఢిల్లీ ఆందోళనలో ఓ యువతి ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడింది. ఆ వీడియో సోషల్ మీడియాలో సంచలనం కలిగించింది. ఇంకేముంది ఆ జర్నలిస్ట్ దీని మీద ఒక ప్రైమ్ టైం బులిటెన్ నిర్వహించారు. అందులో సగం సమయం ఆయనే తీసుకున్నారు. పైగా ఏకపక్షంగా బూతులు మాట్లాడుతూ.. ఆ అమ్మాయిని ఏమైనా చేయొచ్చని వ్యాఖ్యానించారు. పైగా అదే మాటను పదేపదే చెప్పారు. అసలు అలాంటి వ్యాఖ్యలు చేయడం.. పైగా వాటిని సమర్థించుకోవడం ఈయనకు మాత్రమే చెల్లింది. అయినా మేనేజ్మెంట్ కు సమ్మగా ఉన్నప్పుడు.. చూసేవాళ్ళకు మాత్రం ఏమి ఇబ్బంది..
నిజంగా వీరు భారతీయులేనా?
మనుషులకే పుట్టారా?ఇలాంటి భాషను తన చానెల్ లో అనుమతిస్తున్న బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవికి అర్హుడేనా?
ఇలాంటి భాషను తెలంగాణ నడిబొడ్డున టీవీ చానెల్ లో కూర్చొని మాట్లాడటానికి అనుమతిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ గాంధీ వారసత్వాన్ని చాటుకునేందుకు… https://t.co/U7fBGl7lgs
— SRINIVASA RAO (@NeverSayYesDude) August 2, 2026