Homeజాతీయ వార్తలుKarnataka Congress : వరుసగా ఎమ్మెల్యేల రాజీనామా.. కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోయినట్టే..

Karnataka Congress : వరుసగా ఎమ్మెల్యేల రాజీనామా.. కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోయినట్టే..

Karnataka Congress : దక్షిణాది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కర్ణాటక ఒకటి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే తెలంగాణలో ముఖచిత్రం మారిపోయింది. తెలంగాణలో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం కూడా కర్ణాటకనే. కర్ణాటకలో ఇటీవల ముఖ్యమంత్రి మార్పు జరిగింది. సిద్ధ రామయ్య స్థానంలో డీకే శివకుమార్ కు అధిష్టానం ముఖ్యమంత్రి పీఠం అప్పగించింది. అప్పటినుంచి కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు శివకుమార్ నాయకత్వాన్ని […]

Karnataka Congress : దక్షిణాది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కర్ణాటక ఒకటి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే తెలంగాణలో ముఖచిత్రం మారిపోయింది. తెలంగాణలో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం కూడా కర్ణాటకనే.

కర్ణాటకలో ఇటీవల ముఖ్యమంత్రి మార్పు జరిగింది. సిద్ధ రామయ్య స్థానంలో డీకే శివకుమార్ కు అధిష్టానం ముఖ్యమంత్రి పీఠం అప్పగించింది. అప్పటినుంచి కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు శివకుమార్ నాయకత్వాన్ని బహిరంగంగానే వ్యతిరేకించారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఎమ్మెల్యేలు నిరసన స్వరాన్ని అందుకున్నారు. అంతటితోనే వారు ఆగిపోలేదు. ఏకంగా రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.

క్యాబినెట్లో అవకాశాలు లభించకపోవడంతో చాలామంది ఎమ్మెల్యేలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఇండి ఎమ్మెల్యే యశ్వంత రాయగౌడ వి పాటిల్ తన సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు. ఆయన తన రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప లమాని కి అందజేశారు.

సాగర్ ఎమ్మెల్యే బేలూరు గోపాలకృష్ణ కూడా తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. కేవలం తను మాత్రమే కాకుండా.. మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. శివకుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించడానికి రంగం సిద్ధం చేశారు. కొత్తగా 20 మంది ఎమ్మెల్యేలను మంత్రులుగా చేయడానికి మార్గం సిద్ధమైంది. అయితే ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం.. మిగతా ఎమ్మెల్యేలు తీవ్రమైన అసంతృప్తితో ఉండడంతో కర్ణాటక ప్రభుత్వంలో కుదుపు మొదలైంది. అందువల్లే కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

పదిమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే.. కర్ణాటకలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతాయి. ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం కూడా ఉంటుందని అక్కడి విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడికి గురైంది. దాని నుంచి కాస్త ఉపశమనం లభిస్తుండగానే ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. శివకుమార్ కు కన్నడ పగ్గాలు ఇవ్వడం ఇప్పటికీ కాంగ్రెస్ లో ఓ వర్గానికి ఏమాత్రం ఇష్టం లేదు. శివకుమార్ కింద పనిచేయడం చాలా మంది సీనియర్లకు ఏమాత్రం నచ్చడం లేదు. అందువల్లే వారంతా రాజీనామా చేస్తున్నారు. ఏకంగా పది ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారంటే కర్ణాటక కాంగ్రెస్ లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper