Homeబిజినెస్GMR Group : జీఎంఆర్.. ఇప్పటి వరకు ఎన్ని విమానాశ్రయాలను నిర్మించింది?

GMR Group : జీఎంఆర్.. ఇప్పటి వరకు ఎన్ని విమానాశ్రయాలను నిర్మించింది?

GMR Group : భారతదేశంలో మౌలిక సదుపాయాల రంగాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో జీఎంఆర్ గ్రూప్ ప్రముఖపాత్ర వహిస్తోంది. జూట్ మిల్లుతో ప్రారంభమైన ఈ కంపెనీ ఆ తరువాత అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయాలు నిర్మించడంలో తనదైన ముద్ర వేసింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని భోగాపురంలోని‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ నిర్మించిన ఘనత జీఎంఆర్ కే దక్కుతుంది. అయితే ఈ జీఎంఆర్ సంస్థ ఎక్కడింది? దీని ఫౌండర్ ఎవరు? గ్రంధి మల్లిఖార్జున రావు (GMR) ఆధ్వర్యంలో మొదట 1978లొ జూట్ […]

GMR Group : భారతదేశంలో మౌలిక సదుపాయాల రంగాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో జీఎంఆర్ గ్రూప్ ప్రముఖపాత్ర వహిస్తోంది. జూట్ మిల్లుతో ప్రారంభమైన ఈ కంపెనీ ఆ తరువాత అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయాలు నిర్మించడంలో తనదైన ముద్ర వేసింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని భోగాపురంలోని‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ నిర్మించిన ఘనత జీఎంఆర్ కే దక్కుతుంది. అయితే ఈ జీఎంఆర్ సంస్థ ఎక్కడింది? దీని ఫౌండర్ ఎవరు?

గ్రంధి మల్లిఖార్జున రావు (GMR) ఆధ్వర్యంలో మొదట 1978లొ జూట్ మిల్లుతో ప్రారంభమైంది. ఆ తరువాత చక్కెర, బ్రూవరీస్ వంటి రంగాల్లో తన కార్యకలాపాలను విస్తరించింది. 1990లలో దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత, జీఎం రావు వ్యూహాత్మకంగా మౌలిక వసతుల రంగంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 1996లో విద్యుత్ రంగంలోకి.. ఆ తరువాత 2001లో జాతీయ రహదారుల నిర్మాణంలోకి.. 2003లో విమానాశ్రయాల అభివృద్ధి రంగంలోకి అడుగుపెట్టారు.

విమానాశ్రయరంగంలోకి అడుగుపెట్టిన తరువాత ఈ కంపెనీ ప్రపంచ దేశాల్లో ప్రఖ్యాతి పొందింది. ఎందుకంటే దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఈ సంస్థ ఆధ్వర్యంలో విమాశ్రయాలను నిర్మించారు. భారత్ లో ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 9 విమానాశ్రయాలను నిర్మించింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునికీకరణలో సంస్థ ప్రధాన పాత్ర పోషించింది. అలాగే హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తోంది. గోవాలోని మోపా అంతర్జాతీయ విమానాశ్రయం, నాగ్‌పూర్, బీదర్ విమానాశ్రయాల అభివృద్ధిలోనూ సంస్థ భాగస్వామ్యమైంది.

విదేశాల విషయానికొస్తే..ఫిలిప్పీన్స్‌లోని మాక్టాన్ సెబూ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇండోనేషియాలోని మెడాన్‌లో కువాలనాము అంతర్జాతీయ విమానాశ్రయం, గ్రీస్‌లోని పలు ప్రాంతీయ విమానాశ్రయాల అభివృద్ధి, నిర్వహణలో భాగస్వామ్యంగా సంస్థ సేవలందిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా రాజాం పట్టణానికి చెందిన పారిశ్రామికవేత్త గ్రంధి మల్లికార్జున రావు దీని ఫౌండర్. ఈయన సాధారణ వ్యాపారవేత్తగా తన జీవిత ప్రయాణాన్నిప్రారంభించి.. నేడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో విమానాశ్రయాన్ని నిర్మించడం మాత్రమే కాకుండా, దాని నిర్వహణ, ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు కల్పించడం, కార్గో సేవలు, వంటి అంశాల్లో త్యేక నైపుణ్యాన్ని కరబరుస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper