TDP Young Leaders: ఎవరి గురించి తక్కువ మాట్లాడకూడదు. అలాగే అతిగా కూడా ఊహించుకోకూడదు. నిన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో యువ నాయకులైన కింజరాపు రామ్మోహన్ నాయుడు, నారా లోకేష్ మాట్లాడారు. చాలా నిర్మాణాత్మకంగా మాట్లాడుతూ.. పొలిటికల్ సెటైర్లు వేస్తూ.. సాగిన వారి ప్రసంగం ప్రధానిని తన్మయత్వం చేసింది. సభకు హాజరైన ప్రజల నుంచి అభినందనలు అందుకుంది. లక్షలాదిమంది ప్రజలు, ఆపై దేశ ప్రధాని సమక్షంలో ఎటువంటి తడబాటు లేకుండా మాట్లాడడం చిన్న విషయం కాదు. అందులోనూ నారా లోకేష్ ఈ విషయంలో గ్రేట్ అని చెప్పాలి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సభకు హాజరు కాకపోవచ్చు కానీ.. కచ్చితంగా టీవీల్లో ఆ కార్యక్రమాన్ని వీక్షించక తప్పదు. కానీ వారిలో సైతం ఒక ఆలోచన వస్తోంది. నాడు లోకేష్ ను తక్కువ చేసి మాట్లాడడం. జగన్మోహన్ రెడ్డిని ఎక్కువగా ఊహించుకున్నాం అనే మాట వారి లోలోపల నుంచి వ్యక్తం అవుతుంది.
* సోషల్ మీడియాలో ట్రోల్స్..
పోనీ ఇటీవల జగన్మోహన్ రెడ్డి పర్యటనలను గుర్తుచేస్తే ఆయన చేసిన వ్యాఖ్యలు విపరీతంగా నవ్వు పుట్టించాయి. సోషల్ మీడియాలో రూల్స్ కారణం అయ్యాయి. మొన్న శ్రీకాకుళంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ సిపిఆర్ అంటే ఏమిటి? హార్ట్, జస్ట్ పంపింగ్ అంటూ మాట్లాడడం చూసి జనాలు నవ్వుకున్నారు. చిన్నపిల్లోడు తప్పు చేస్తే.. 45 ఏళ్ల దారిన పోయే దానయ్య చనిపోతే అంటూ జగన్ మాట్లాడిన మాటలపై విమర్శలు వచ్చాయి. జగన్ మాజీ మంత్రి అప్పలరాజును కలిసేందుకు వచ్చారు. కానీ ములాఖత్ సమయం ముగియడంతో ఆయనని పరామర్శించకుండానే వెళ్ళిపోయారు. అయితే ఈ చర్యలు అన్నింటిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
* ఆ ఇద్దరు యువ నేతలు..
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ తో పాటు కింజరాపు రామ్మోహన్ నాయుడు గురించి ఎక్కువగా చర్చ నడుస్తోంది. వారిద్దరి మాట తీరు, వ్యవహరిస్తున్న విధానం వైసీపీ శ్రేణులను సైతం ఆకర్షిస్తోంది. కానీ తమ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం అలా వ్యవహరించకపోవడంపై వారికే నచ్చడం లేదు. అందుకే ఎవరిని తక్కువ చేసి చూడకూడదు. ఎవరిని అతిగా ఊహించుకోకూడదు. అయితే ఇలాంటి బాధ ఎవరికి రాకూడదు కూడా. ఎందుకంటే జనం జనం అంటూ జగన్ అంటుంటే.. జనం నోటిలో నానుతున్నారు టిడిపి యువ నేతలు.