Homeఆంధ్రప్రదేశ్‌Vijaya Sai Reddy: విజయసాయిరెడ్డి కేరాఫ్ ఉత్తరాంధ్ర..ఇక మొదలు పెడతారట..

Vijaya Sai Reddy: విజయసాయిరెడ్డి కేరాఫ్ ఉత్తరాంధ్ర..ఇక మొదలు పెడతారట..

Vijaya Sai Reddy: ఒకప్పుడు వైసిపిలో నెంబర్ 2 గా కొనసాగిన విజయసాయిరెడ్డి.. ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు. జగన్ గురించి విమర్శలు చేస్తున్నారు. పార్టీలో పాతుకుపోయిన సజ్జల రామకృష్ణారెడ్డిని తీవ్రంగా విమర్శిస్తున్నారు.. పార్టీలో తను జరిగిన అన్యాయాన్ని.. పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ఆయన ఏ కరువు పెట్టుకుంటూ పోతున్నారు. అంతేకాదు తన పొలిటికల్ జర్నీ మీద కూడా కీలకమైన అప్డేట్స్ ఇస్తున్నారు. త్వరలోనే ఆయన పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు. అంతేకాదు తన కూతురు మీడియా […]

Vijaya Sai Reddy: ఒకప్పుడు వైసిపిలో నెంబర్ 2 గా కొనసాగిన విజయసాయిరెడ్డి.. ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు. జగన్ గురించి విమర్శలు చేస్తున్నారు. పార్టీలో పాతుకుపోయిన సజ్జల రామకృష్ణారెడ్డిని తీవ్రంగా విమర్శిస్తున్నారు.. పార్టీలో తను జరిగిన అన్యాయాన్ని.. పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ఆయన ఏ కరువు పెట్టుకుంటూ పోతున్నారు. అంతేకాదు తన పొలిటికల్ జర్నీ మీద కూడా కీలకమైన అప్డేట్స్ ఇస్తున్నారు.

త్వరలోనే ఆయన పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు. అంతేకాదు తన కూతురు మీడియా ఛానల్.. ఇతర వ్యవహారాలు సాగిస్తారని చెబుతున్నారు. పార్టీకి, తన కూతురు నిర్వహించబోయే మీడియా ఛానల్ కు ఎటువంటి సంబంధం ఉండదని విజయసాయిరెడ్డి స్పష్టం చేస్తున్నారు. తన పార్టీ ఏర్పాటు దసరా తర్వాత ఉంటుందని ఇప్పటికే ఆయన క్లారిటీ ఇచ్చారు. విజయవాడలో ఒక ఖరీదైన హోటల్లో విలేకరుల సమావేశం కూడా పెట్టారు. తన పార్టీ ఏర్పాటు.. ఏపీ రాజకీయాలలో పోషించాల్సిన పాత్ర గురించి విజయసాయిరెడ్డి అనేక సందర్భాలలో క్లారిటీ ఇచ్చారు.

తాజాగా విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి విలేకరుల సమావేశం పెట్టారు. విశాఖపట్నం నగరానికి పాతిక టీఎంసీల నీరు అవసరమని స్పష్టం చేశారు. ఆ నీరు ఉంటేనే విశాఖ నగరం బాగుపడుతుందని చెప్పారు. అలాగే విశాఖ నగరాన్ని రాజధానిగా మార్చుతామని చెప్పి వైసిపి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం వైసిపి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర తీవ్రమైన వెనుకబాటుకు గురైందని.. ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. తాను త్వరలోనే పాదయాత్ర మొదలు పెడతానని.. ఇచ్చాపురం నుంచి ఇది మొదలవుతుందని స్పష్టం చేశారు.

మొన్న విజయవాడ.. నిన్న వైజాగ్.. మరి రేపు.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక నగరాలలో విలేకరుల సమావేశం పెట్టి తన పార్టీ గురించి వివరిస్తున్నారు. ఆయా ప్రాంతాల ప్రజల సమస్యలను ప్రస్తావిస్తున్నారు. వాటిని తాము అధికారంలోకి వస్తే ఎలా పరిష్కరిస్తామో కూడా చెబుతున్నారు. మొత్తానికి రోడ్డు మ్యాప్ విజయ సాయి రెడ్డి గట్టిగానే వేసుకున్నారు. మరి దీని తర్వాత ఆయన ఏం చేస్తారు.. రాష్ట్రవ్యాప్తంగా తన పార్టీని ఎలా విస్తరిస్తారు.. ఇప్పటికే ఆయన రెడ్డి సామాజిక వర్గం మీద ఒక పుస్తకం రాస్తున్నాను అని చెప్పారు. ఈ ప్రకారం ఆయన తదుపరి కార్యాచరణ కూడా చాలా భిన్నంగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు జగన్ పార్టీ అభివృద్ధిలో.. ఆయన ముఖ్యమంత్రి కావడంలో కీలకపాత్ర పోషించిన విజయసాయిరెడ్డి.. ఇప్పుడు పార్టీ పెట్టడం.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper