TTD SVBC Chairman post update: కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయితే ముందుగా వినిపించే పేరు టీటీడీ చైర్మన్( TTD chairman ). ప్రభుత్వాల ప్రతిపాదన మేరకు, సిఫారసు మేరకు ఈ పోస్టు నియామకం ఉంటుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత టిటిడి చైర్మన్గా టీవీ5 అధినేత బి.ఆర్ నాయుడుకు అవకాశం ఇచ్చారు. అయితే టీటీడీకి అనుబంధంగా ఉండే ఎస్వీబీసీ చైర్మన్ పదవి భర్తీ చేయలేదు. అదిగో ఇదిగో అంటూ రెండు సంవత్సరాల కాలం గడిపేశారు. ప్రస్తుతం ఎస్వీబీసీ కూడా బిఆర్ నాయుడు చూస్తున్నట్లు తెలుస్తోంది. కానీ టీటీడీలో ఎస్వీబీసీ ది కూడా ప్రధాన పాత్ర. ఆ పదవి కోసం చాలామంది సినీ ప్రముఖులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. టిడిపి హయాంలో ఈ పదవిని దర్శకుడు రాఘవేంద్రరావు నిర్వర్తించేవారు. వైసీపీ హయాంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ నియమించబడ్డారు. ఆయనపై ఆరోపణలు రావడంతో కొత్త వ్యక్తికి అప్పగించారు అప్పట్లో. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నియామకం జరగలేదు.
స్వామి వారి కార్యక్రమాలతో..
తిరుమల తిరుపతి దేవస్థానంలో( Tirumala Tirupati Devasthanam) ఎస్వీబీసీ ఛానల్ ది క్రియాశీలక పాత్ర. స్వామి వారి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక భావన కలిగించే రీతిలో ప్రసారాలు ఎస్వీబీసీ ద్వారా ఉంటాయి. అటువంటి ఎస్వీబీసీ పర్యవేక్షణ బాధ్యత చైర్మన్ ది. అది నామినేటెడ్ పదవి. ప్రభుత్వాలు నియమించాల్సి ఉంటుంది. అయితే ఈ పదవి కోసం సినీ ప్రముఖులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బి ఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. అందుకే ఎస్వీబీసీ చైర్మన్ పదవి కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది.
సినీ ప్రముఖుల ప్రయత్నం..
ఎస్వీబీసీ చైర్మన్( SVBC chairman ) పదవి కోసం చాలామంది సినీ ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో రాఘవేంద్రరావు, అశ్వినీ దత్, మురళీమోహన్ వంటి వారు ఉన్నారు. నట కిరీటి రాజేంద్రప్రసాద్ సైతం ఈ పదవిని ఆశిస్తున్నారు. అయితే ఈ పదవి కోసం చాలామంది పవన్ కళ్యాణ్ ద్వారా ప్రయత్నిస్తున్నారు. మరికొందరు బాలకృష్ణ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకోవైపు బిజెపి సైతం తమ పార్టీకి ఆ పదవికి కేటాయించాలని కోరుతోంది. అందుకే ఆ పదవి భర్తీలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..
