Homeఎంటర్టైన్మెంట్Funky Movie First Review: విశ్వక్ సేన్ 'ఫంకీ' మూవీ మొట్టమొదటి రివ్యూ..'జాతి రత్నాలు' డైరెక్టర్...

Funky Movie First Review: విశ్వక్ సేన్ ‘ఫంకీ’ మూవీ మొట్టమొదటి రివ్యూ..’జాతి రత్నాలు’ డైరెక్టర్ ఇలా కూడా ఆలోచిస్తాడా!

Funky Movie First Review: ‘మెకానిక్ రాకీ’, ‘లైలా’ వంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత విశ్వక్ సేన్(Viswak Sen) హీరో గా నటిస్తున్న చిత్రం ‘ఫంకీ'(Funky Movie). ‘జాతి రత్నాలు’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన అనుదీప్ KV ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గానే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఈ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 3న విడుదల కాబోతుంది. అయితే మేకర్స్ ఇప్పటి నుండే ప్రొమోషన్స్ […]

Funky Movie First Review: ‘మెకానిక్ రాకీ’, ‘లైలా’ వంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత విశ్వక్ సేన్(Viswak Sen) హీరో గా నటిస్తున్న చిత్రం ‘ఫంకీ'(Funky Movie). ‘జాతి రత్నాలు’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన అనుదీప్ KV ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గానే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఈ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 3న విడుదల కాబోతుంది. అయితే మేకర్స్ ఇప్పటి నుండే ప్రొమోషన్స్ మొదలు పెట్టేసారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ కి, మొదటి లిరికల్ వీడియో సాంగ్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం లో హీరోయిన్ గా కాయదు లోహర్ నటిస్తోంది. ఈమె ‘డ్రాగన్’ చిత్రం ద్వారా ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఆ చిత్రం తర్వాత ఆమె చేస్తున్న మొట్టమొదటి తెలుగు సినిమా ఇదే. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని రషెస్ ని మేకర్స్ రీసెంట్ గానే ప్రసాద్ ల్యాబ్స్ లో చూశారట. కొంతమంది ప్రముఖ మీడియా ప్రతినిదులు ఈ సినిమా రషెస్ ని చూశారు. వాళ్ళ నుండి వచ్చిన రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. సినిమా ఔట్పుట్ చాలా బాగా వచ్చిందని, ఈమధ్య కాలంలో ఇంతటి ఆర్గానిక్ కామెడీని ఏ సినిమాలో కూడా చూడలేదని, అనుదీప్ మార్క్ కామెడీ పంచులు ఒక రేంజ్ లో పేలాయని అంటున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో కథ కూడా చాలా బలంగా కుదిరింది అట. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకున్న విశ్వక్ సేన్ కి ఈ చిత్రం మంచి కమర్షియల్ కం బ్యాక్ గా నిలుస్తుందని అంటున్నారు.
విశ్వక్ సేన్ కెరీర్ లో మంచి యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉన్న చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’. మళ్లీ ఆ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా విశ్వక్ సేన్ నుండి రాలేదు.  ‘ఫంకీ’ మాత్రం కచ్చితంగా ఆ కోవకు చెందిన సినిమా అవుతుందని బలమైన నమ్మకంతో ఉన్నారట మేకర్స్. మరి ఆ రేంజ్ లో ఈ చిత్రం ఉంటుందా లేదా అనేది చూడాలి. వరుస ఫ్లాప్స్ తర్వాత విశ్వక్ సేన్ చాలా జాగ్రత్తలు తీసుకొని ఒప్పుకున్న చిత్రమిది. కాబట్టి కమర్షియల్ గా కచ్చితంగా భారీ రేంజ్ లోనే వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. రాబోయే రోజుల్లో ఈ చిత్రం నుండి వచ్చే ప్రతీ కంటెంట్ కూడా అదిరిపోతోంది టాక్.
Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper