Atma Sakshi Survey : రూపాయి పేపర్లు.. అర్ధ రూపాయి వెబ్సైట్లు.. ఆ పై ఊరు పేరు లేని సర్వే సంస్థలు. ప్రజాభిప్రాయం ఇది అని కుండ బద్దలు కొడుతున్నాయి. అసలు గుర్తింపు లేని పేర్లతో హల్చల్ చేస్తున్నాయి. నీ సాక్షి.. ఆ.. సాక్షి అంటూ లేనిపోని ప్రచారానికి తెర లేపుతున్నాయి . ఏపీ రాజకీయాలను హైదరాబాద్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇక్కడ వాసనను పసిగట్టలేవు. ఇక్కడి ప్రజల ఆకాంక్షలను పసిగట్టలేవు. కానీ ఏపీ భవిష్యత్తు ఇది అంటూ పతాక శీర్షికన కథనాలు వండి వార్చుతున్నాయి. జగన్ జనంలోకి వెళ్తే జనమే జనం. జగన్ ప్రజల్లోకి వస్తే ప్రభంజనం. జగన్ హైదరాబాద్ వస్తే నీరాజనం. ఇలా ఎన్నెన్నో శీర్షికలు పెట్టి.. రూపాయి పేపర్లు. కనీస ప్రామాణికం లేని వెబ్సైట్లు రంగంలోకి దిగుతున్నాయి. ఇక డిజిటల్ మీడియా.. ఆపై సోషల్ మీడియా.. వాటి గురించి చెప్పనవసరం లేదు. జగన్ లేనిదే ఈ లోకం లేదు.. జగన్ లేనిదే నాయకత్వం లేదు.. జగన్ లేనిదే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు.. అంటూ ఇస్తున్న బిల్డప్ అంతా ఇంత కాదు. సమాజం పట్ల.. సమకాలీన అంశాల పట్ల అవగాహన ఉన్నవారికి ఇది ఎంత మాత్రం రుచించని విషయం.
* ఇంత జరిగాక కూడా..
ఏపీ ప్రభుత్వం గురించి.. ఏపీ రాజకీయాల గురించి.. ఒక్కసారి పరిశీలిద్దాం. కూటమి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం అయి అంతే సమయం పడుతుంది. 2019లో అధికారం చేపట్టింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఏకపక్ష విజయంతో అధికారంలోకి వచ్చింది. అదే పార్టీ ఐదేళ్లు అధికారంలో ఉంది. ప్రతి ఇంటికి సంక్షేమ పథకంతో పాటు రాష్ట్రాన్ని ఎనలేని అభివృద్ధి చేశానని చెబుతోంది. ప్రతి ఇంటికి మంచి జరిగి ఉంటే తనకు ఓటు వేయాలని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలా నమ్మితేనే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలు కూడా ఆయన పట్ల విశేష స్పందన చూపారు. ఆయన ఎక్కడకు వచ్చిన జనం.. జననీరాజనం చూసాం. మీకు మంచి జరిగితే ఓటు వేయండి అని ఆయన చెప్పారు. కానీ ఏపీ సమాజంలో ఉన్న సగానికి పైగా జనం ఆయనకు ఆమోదం తెలపలేదు. ఛీ పో నువ్వు బాగా పాలించలేదు. నిన్ను నమ్మం దొర అంటూ పక్కన పెట్టారు. జగన్ ఈ లాజిక్ మిస్ అయ్యారు.. దానిని కనిపెట్టారు కూటమి పాలకులు. సంక్షేమ పథకాలు మొదలుపెట్టారు. అదే స్థాయిలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. జగన్ ఎవరికి పథకాలు ఇచ్చారో గుర్తించి వారికి ఇచ్చారు. అదే సమయంలో రాష్ట్రానికి అవసరమైన పనులు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు. అయినా సరే ప్రజలట జగన్మోహన్ రెడ్డి పాలనను గుర్తు చేస్తున్నారట. అటువంటి పాలనను ఎవరు అందించలేరట. అందుకే ఆయన పాలనను గుర్తు చేసుకున్నారట. ఇప్పుడు ఎన్నికలు వస్తే 175 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారట.
* మరీ విడ్డూరం..
నవ్విపోదురు గాక నాకేంటి దిక్కు. అన్నట్టు ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దుస్థితి. కూటమి ఆల్ ఫెయిల్. ఇక రావాల్సింది జగన్ మాత్రమే. జగన్ లేనిదే ఏపీ లేదు. జగన్ లేనిదే ఏపీ సమాజం బాగుపడదు. అసలు జగన్ రాకుంటే ఈ రాష్ట్రమే ఉండదు. ఇప్పటివరకు సాక్షితో ఈ పని చెప్పారు. ఇప్పుడు ఆత్మసాక్షితో కొత్త కథనం అల్లుతున్నారు. సాక్షిని భరించలేరు ఏపీ ప్రజలు. ఇప్పుడు ఆత్మసాక్షి పేరుతో కథ అల్లారు. ఏపీ ప్రభుత్వం పడకేసిందని.. వైసిపి పైకి లేచిందని.. ఆ పార్టీ ప్రవాహం ఇప్పట్లో ఆగేది కాదని.. జాకీ ఎట్టి లేపుతోంది సాక్షి.. దాని అమ్మమ్మ ఆత్మసాక్షి. ఐఐటి నిపుణులంటూ ఈ అమ్మమ్మ సాక్షికి జతకడుతూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కొత్త ప్రయోగం భలే గమ్మత్తుగా ఉంది. సాక్షి పోయింది.. ఈ ఆత్మ సాక్షి సర్వే వచ్చింది అన్న సెటైర్ తప్ప. ఇది ఇది నిజం అని నమ్మే ఏపీ సమాజం లేదంటే అతిశయోక్తి కాదు.