Bigg Boss Agnipariksha 2: గత సీజన్ ‘అగ్ని పరీక్ష’ లో జడ్జీలు మూడు గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చిన వారిలో కేవలం ఒకరిద్దరు తప్ప, ఎవరూ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వలేకపోయారు. కానీ ఒక్క గ్రీన్ ఫ్లాగ్ ని సంపాదించుకున్న వాళ్ళు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. దీన్ని బట్టీ బిగ్ బాస్ షో లో మాత్రమే కాదు , ‘అగ్ని పరీక్ష’ షో లో కూడా ఎప్పుడు ఏమి జరగబోతుంది అనేది అంచనా వేయడం చాలా కష్టం అనేది స్పష్టంగా అర్థం అవుతోంది. ‘అగ్ని పరీక్ష 2’ లో కూడా అంతే , మూడు గ్రీన్ ఫ్లాగ్స్ ని సొంతం చేసుకొని టాప్ 15 లోకి నేరుగా వెళ్లిన కంటెస్టెంట్స్ పెద్దగా టాస్కుల్లో పర్ఫార్మ్ చేయడం లేదు. కానీ ఒకే ఒక్క గ్రీన్ ఫ్లాగ్ ని సొంతం చేసుకున్న కంటెస్టెంట్ మాత్రం ఇప్పుడు ప్రభంజనం సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు, అతని పేరే రోహిత్.
చూసేందుకు చాలా కూల్ గా , కంపోజ్ గా మాట్లాడే ఇతను, బిగ్ బాస్ షో లో ఎలా నెట్టుకొస్తాడో అని అంతా అనుకున్నారు. యాంకర్ శ్రీముఖి కూడా ఇదే మాట ఆడిషన్స్ సమయం లో అంటుంది. ఇక బిందు మాధవి ముఖం పై నీళ్లు కొట్టి కూడా రెడ్ ఫ్లాగ్ ఇస్తుంది , నవదీప్ కూడా నువ్వు బిగ్ బాస్ కి పనికిరావు అని రెడ్ ఫ్లాగ్ ఇచ్చాడు. కానీ ఒక్క అభిజిత్ మాత్రమే ఇతనిలోని టాలెంట్ ని గుర్తించి గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి తదుపరి రౌండ్స్ కి పంపించాడు. టాస్కుల్లో పాల్గొనడానికి మొదట్లో కాస్త భయపడ్డాడు కానీ, ఒక్కసారి బరిలోకి దిగిన తర్వాత ఇతని సత్తా ఏంటో అందరికీ అర్థమైంది. మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే ఇతనికి పెద్దగా పీఆర్ టీం లేదు. అయినప్పటికీ ప్రస్తుతం ఓటింగ్ లో టాప్ 2 లో కొనసాగుతున్నాడు.
ఇక రేపటి ఎపిసోడ్ లో రోహిత్ ప్రభంజనమే సృష్టించాడని చెప్పొచ్చు. దాదాపుగా అన్ని టాస్కుల్లో గెలిచి ఓటు అప్పీల్ చేసుకున్న మొట్టమొదటి కంటెస్టెంట్ గా నిలిచాడు. ముందుగా మ్యూజికల్ చైర్ తరహా టాస్కు ఒకటి పెట్టారట, ఈ టాస్క్ లో రోహిత్ తన తోటి కంటెస్టెంట్స్ అందరినీ ఓడించి టాప్ 1 స్థానం లో నిలిచాడట. ఇక ఆ తర్వాత రోహిత్ మరియు మితిలేష్ మధ్య ఆర్మ్ రెజిలింగ్ పోటీ పెడతారట. ఈ పోటీ లో కూడా మితిలేష్ ని ఓడించి రోహిత్ గెలిచాడట. మితిలేష్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడో తెలిసిందే , అతన్నే ఓడించాడంటే రోహిత్ స్టామినా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇలా వరుసగా రెండు టాస్కులు గెలిచిన తర్వాత ఆయన ఒక టీం కి కెప్టెన్ అయ్యాడట. రేపటి ఎపిసోడ్ తో రోహిత్ గ్రాఫ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్తుందని అంటున్నారు విశ్లేషకులు.