Rayalaseema Rising: రాయలసీమ అంటే కరువు కాటకాలు మాత్రమే గుర్తుకొస్తాయి. కక్షలు కొట్లాటలు మాత్రమే కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. వాస్తవానికి రాయలసీమకు ఎన్నో అనుకూలతలు ఉన్నాయి. విస్తారంగా భూములు ఉన్నాయి. సాగునీటి వనరులు ఉన్నాయి. కానీ వీటిని ఇప్పటివరకు సమర్థవంతంగా వినియోగించుకున్న దాఖలాలు లేవు. ఇక్కడి ప్రజలను ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఉపయోగపడే వ్యక్తులుగానే చూశారు. అయితే ఇప్పుడు దీనికి చరమగీతం పాడుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. తన ముందు చూపుతో.. తన దీర్ఘ దృష్టితో రాయలసీమకు కొత్త దిశను చూపించబోతున్నారు. చంద్రబాబు ప్రణాళిక.. పవన్ కళ్యాణ్ ప్లాన్.. లోకేష్ దీర్ఘ దృష్టి ఇవన్నీ కలిసి ఇప్పుడు రాయలసీమకు కొత్త మార్గాన్ని నిర్దేశించబోతున్నాయి. Global horticulture hub Rayalaseema Rising పేరుతో కూటం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపతోంది.. గాంధీ జయంతి రోజు మదనపల్లె వేదికగా శ్రీకారం చుడుతోంది.
దీంతో ఏం చేస్తారంటే
గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రాయలసీమ రైసింగ్ నినాదంతో వచ్చే మూడేళ్ల కాలంలో ఈ ప్రాంతంలో దాదాపు లక్ష కోట్ల పెట్టుబడులు పెడతారు. రాయలసీమ ప్రాంతాన్ని పూర్తిగా మార్చేస్తారు. ఇందులో ప్రభుత్వ రంగం నుంచి దాదాపు 40 వేల కోట్లకు పైగా.. ప్రైవేట్ రంగం నుంచి 60 వేల కోట్లకు పైగా పెట్టుబడులను సమీకరిస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా అనంతపురం.. అన్నమయ్య.. చిత్తూరు.. కర్నూలు.. నంద్యాల.. సత్యసాయి.. తిరుపతి.. వైయస్ఆర్ కడప జిల్లాలతో పాటు ప్రకాశం, మార్కాపురం ప్రాంతాలను కలుపుకొని మొత్తం పది జిల్లాలలో 201 క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు. క్లస్టర్ల పరిధిలో ఉద్యాన పంటల సాగు.. నీటిపారుదల.. రహదారులు.. ఆహార పదార్థాల నిల్వ.. ప్రాసెసింగ్.. మార్కెటింగ్.. ఎగుమతులు.. ఇలా అద్భుతమైన వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు.
సాగు పెంచబోతున్నారు
ప్రస్తుతం ఉన్న ఉద్యాన సాగు విస్తీర్ణాన్ని పెంచుతారు. దీనిని మొత్తంగా 14.41 లక్షల హెక్టర్లకు తీసుకెళ్తారు. అదే సమయంలో ఉద్యాన పంటల ఉత్పత్తిని కూడా గణనీయంగా పెంచుతారు. దీనిద్వారా సుమారు 9.6 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పించబోతున్నారు. మామిడి.. అరటి.. టమాట.. దానిమ్మ.. బత్తాయి.. నిమ్మ వంటి సంప్రదాయ పంటలు మాత్రమే కాకుండా డ్రాగన్ ఫ్రూట్.. అవకాడో.. బెర్రీస్ వంటి అధిక విలువ కలిగిన పంటలను కూడా ప్రోత్సహిస్తారు.
నీటిపారుదలకు భారీగా కేటాయింపులు
రాయలసీమ ప్రాంతంలో కీలకమైన అంశం సాగునీరు. అందువల్లే ఈ ప్రాజెక్టులో నీటిపారుదల రంగానికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించాలని ప్రతిపాదించింది. తాజాగా అనుదిన సమాచారం ప్రకారం ప్రభుత్వ పెట్టుబడిలో నేటిపారుదల రంగానికి సుమారు 20,884 కోట్లు.. ఉద్యాన రంగానికి 15 వేల కోట్లు.. రహదారులు, మౌలిక వసతులకు 4562 కోట్లు కేటాయిస్తారు. తొమ్మిది లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టిస్తారు. మరో నాలుగు పాయింట్ మూడు లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తారు..
ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్
మదనపల్లిలో నిర్వహించే ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ రాబోతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటును ప్రభుత్వం చేయబోతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామితో మదనపల్లిలో ఈ సంస్థకు శంకుస్థాపన చేయబోతున్నారు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత.. పరిశోధన.. నైపుణ్యం.. విలువ ఆధారిత వ్యవసాయం అంటే అంశాలకు ఇది ఉపయోగపడేలా ఉంది. రాయలసీమ అభివృద్ధిలో భాగంగా దేశంలోనే కీలక ఉద్యాన పంటలకు కేంద్రంగా మార్చబోతున్నట్టు ప్రభుత్వం చెబుతోంది.
సీమ రూపురేఖలు మారతాయి
మొత్తంగా చూస్తే రాయలసీమ రైసింగ్ అనేది కేవలం మరో అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాదు. రాయలసీమ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని మార్చాలి అనే భారీ ప్రణాళిక. దీని ద్వారా సీమ ప్రాంతం కాస్త బంగారు పంటలు పండే ప్రాంతంగా మారబోతుంది. రాయలవారి పరిపాలన కాలంలో రాయలసీమలో ముత్యాలను రాశులుగా పోసి అమ్మారని మనం చదువుకున్నాం. ఇప్పుడు చంద్రబాబు పరిపాలన కాలంలో అది వాస్తవ రూపం దాల్చబోతోంది. అంటే నాటి రాయలవారి పరిపాలన.. నేటి చంద్రబాబు పరిపాలన ఒకే విధంగా ఉన్నట్టు. సీమ ప్రజలు నేటి కార్యక్రమంతో అదృష్టాన్ని తమ గుమ్మంలోకి తీసుకెళ్తున్నట్టు.